దేవుడే సృష్టికి కారణమన్న ఈశ్వర వాదాన్ని సాంఖ్యం తుత్తునియలు చేసింది. దేవుడికి ఏ గుణమూ లేదని మీరంటారు. ఏ గుణమూ లేనిదాని నుంచి గుణాలున్న ప్రపంచం ఎలా వచ్చింది? తెల్లదారంతో వస్త్రంచేస్తే తెలుపు రంగు గల వస్త్రం వస్తుంది. అదే నల్లదారం తోనైతే నలుపు వస్త్రం తయారౌతుంది. దారం రంగును బట్టి వస్త్రం రంగు నిర్ణయించబడినట్టే ప్రపంచంలోకి వస్తువుల గుణాలు అవి దేని నుంచి ఉద్భవించాయో దాని గుణాల నుండే సంక్రమిస్తాయి. ఒక వేళ దేవుడి నుండే ప్రపంచం ఏర్పడితే ఈ ప్రపంచానికున్న గుణాలన్నీ ఆ దేవుడి నుండి సంక్రమించినవేగదా. అంటే దేవుడికి గుణాలు ఉన్నట్టే గదా? దేవుడు నిర్గుణుడు అని మీరు చెప్పింది తప్పు అని తేలింది గదా!... ఈ విధంగా ఈశ్వరవాదులను సాంఖ్యం తన తర్కంతో ఎదుర్కొన్నది.
''ఓ దేవుడా! నువ్వు నన్ను డిపెం డెంటుగా సృష్టించావా? లేక ఇండిపెండెంటుగా సృష్టించావా? డిపెండెంటుగా ఐతే నేను చేసే పనులన్నిటికీ బాధ్యత నాదే. కనుక నేను సమాధానం చెప్పనక్కరలేదు. కాదూ, ఇండిపెం డెంటుగా సృష్టించానంటావూ! అలాగైతే నేను నీకు ఎందుకు సమాధానం చెప్పాలి? అని అడుగుతున్నాను.'' - అంటాడు గిరిశం కన్యాశుల్కం నాటకంలో. ఒక వికట హాస్య పాత్ర ధారి చేత ఈ డైలాగులు పలికించినా గురజాడ గిరీశం ద్వారా ఒక కీలకమైన ప్రశ్నను లేవ నెత్తాడు. దేవుడికీ, మనిషికీ సంబంధ ఏమిటన్నదే ఆ ప్రశ్న? భావవాదులు దేవుడే ప్రకృతిని సృష్టించాడని వాదిస్తారు. దాని నుంచి ఓ అడుగు ముందుకు పోయి దేవుని నిర్ణయాను సారమే అంతా జరుగుతుందని అని అంటారు. మరి ఆ దేవుడెలా వుంటాడు? ఎక్కడుంటాడు? ఉన్నా డని ఎలా చెప్పగలరు? అని అడిగితే దేవుడు ఆదిమధ్యాంత రహతుడని, సర్వశక్తి మంతుడని, నిరాకారుడు, నిర్గుణుడు అని సమాధానం చెప్తారు. ఏ ఆకారమూ లేని, ఏ లక్షణమూలేని దేవుడిని ఉన్నాడని ఎలా చెప్పగలరు? ఉన్నట్టు తెలుసుకోవటం ఏలా? ''ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు'' అని ప్రహ్లాదుడిచేత పోతన పలికిస్తాడు భాగవతంలో. వెదకి చూసినపుడు కంటికి కనపడాలంటే ఆకారం ఉండాలి. మరి దేవుడు నిరాకారుడన్నాడు కదా! ఎలా చూడటం? పోనీ ఆకారంలేకుంటేనే ఏ లక్షణమైనా ఉంటే తెలుసుకోవచ్చు. గాలికి ఆకారం లేదు గాని మన చర్మానికి తెలుస్తుంది గాలి ఉన్నట్టు. విద్యుత్తుకి ఆకారంలేదు కాని టెస్టర్ ప్లగ్గులో పెడితే కరెంటు ఉన్నదీ పోయినదీ తెలుస్తుంది. అలా దేవుడి గురించి తెలియాలంటే ఏదో లక్షణం ఉండాలి గదా. ఏ లక్షణమూలేక, ఏ గుణమూలేక, ఏ ఆకారమూ లేక - ఇక ఉన్నట్లు భావించడమెలా? ఉన్నాడన్న విషయాన్ని నిర్ధారించలేని పరిస్థితి ఉన్నపుడు ఇక ఆ దేవుడికీ, మనిషికీ సంబంధం ఏమిటి?
దేవుడే ప్రపంచాన్ని సృష్టించాడు అన్న వాదాన్ని చీల్చి చెండాడిన వారిలో పెద్దపీట వేయాల్సినది సాంఖ్యులకు. సాంఖ్యవాదాన్ని అతి ప్రాచీనమైనదిగా చరిత్ర కారులు గుర్తిం చారు. ఉపనిషత్తుల కాలానికి ముందే సాంఖ్యం ఉనికిలోకి వచ్చింది. బౌద్ధం క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలం నాటిది. దానికి ముందే సాంఖ్య వాదం ఉంది. అంటే నేటికి సుమారు 2700 సంవత్సరాల క్రితమే సాంఖ్యవాదం ప్రాచుర్యం లో ఉందన్నమాట. ఈ సాంఖ్యాన్ని తొలుత ప్రతిపాదించిన వాడు కపిలుడు. ఉపనిషత్తులలో (భాందోగ్యోపనిషత్, కఠోపనిషత్, శ్వేతాశ్వతా రోపనిషత్, వగైరాలలో) మహాభారతంలో, భగవద్గీతలో సాంఖ్యం గురించిన ప్రస్తావనలు, చర్యలు ఉన్నాయి. ఉపనిషత్తుల కాలంనుంచి శంకరుని వరకూ గల భావవాదులందరూ సాంఖ్యా వాదాన్ని ఖండించటానికి ఎంతో ప్రధా న్యత నిచ్చారు. దానిని బట్టి సాంఖ్యం ఆనాటికి చాలా శక్తివంతమైన భౌతికవాదంగా ప్రాచుర్యం పొందినట్టు తేలుతోంది.
సాంఖ్యులు ప్రతిపాదించిన వాదాన్ని స్వభావ వాదం అంటారు. ప్రకృతి అనాదిగా ఉన్నది. ఈ ప్రకృతికి స్వతహాగా ఉన్న స్వభావం వల్లనే నిరంతరం మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులలో భాగంగానే ప్రస్తుతం ఉన్న ప్రపంచం ఏర్పడింది. ఇందులో దేవుని ప్రసక్తే లేదు. ఆవు గడ్డితిని నీరు తాగుతుంది. అది దాని స్వభావం. అదే సమయంలో దాని శరీర స్వభావం వలన పొదుగులో పాలు ఏర్పడ తాయి. అవుదూడ ఆ పాలను తాగుతుంది. ఇదే విధంగా ప్రకృతి స్వభావం వల్లనే ఈ ప్రపంచం ఏర్పడింది. ఎగువ నుంచి పల్లానికి ప్రవహించడం నీటి స్వభావం. ఆ నీటికి ఎటువంటి చైతన్యమూ లేదు. కాని నీరు మానవులకి ఉపయోగపడుతుంది. చెట్లు, చేమలు నీటిపై ఆధారపడి బతుకుతాయి. నీటికున్న స్వభావం రీత్యానే ఇదంతా జరుగుతోంది. తప్ప వేరే ఇరత కారణం (దేవుడు) ఏదీలేదు.
దేవుడే సృష్టికి కారణమన్న ఈశ్వర వాదాన్ని సాంఖ్యం తత్తునియలు చేసింది. దేవుడికి ఏగుణమూ లేదని మీరంటారు. ఏ గుణమూలేని దాని నుంచి గుణాలున్న ప్రపంచం ఎలా వచ్చింది? తెల్లదారంతో వస్త్రంచేస్తే తెలుపు రంగు గల వస్త్రం వస్తుంది. అదే నల్లదారం తోనైతే నలుపు వస్త్రం తయారౌతుంది. దారం రంగుని బట్టి వస్త్రం రంగు నిర్ణయించబడినట్టే ప్రపంచంలోకి వస్తువుల గుణాలు అది దేని నుంచి ఉద్భవించాయో దాని గుణాల నుండే సంక్రమిస్తాయి. ఒక వేళ దేవుడి నుండే ప్రపం చం ఏర్పడితే ఈ ప్రపంచానికున్న గుణాలన్నీ ఆ దేవుడి నుండి సంక్రమించినవేగదా. అంటే దేవుడికి గుణాలు ఉన్నట్టే గదా? దేవుడు నిర్గుణుడు అని మీరు చెప్పింది తప్పు అని తెలింది గదా!... ఈ విధంగా ఈశ్వర వాదు లను సాంఖ్యం తన తర్కంతో ఎదుర్కొన్నది. ఈ ప్రపంచం పదార్ధమయం. పదార్ధానికి గుణాలుంటాయి. ప్రపంచాన్ని సృష్టించాడని మీరు చెబుతున్న దేవుడు నిర్గుణుడు. అంటే పదార్థరహితం. మూలకారణం పదార్ధరహితం అయితే అందులోనుంచి వచ్చిన ప్రపంచం కూడా పదార్ధరహితంగానే ఉండలి గదా. పదార్ధ రహితమైన దైవం నుంచి పదార్ధమయమైన ప్రపంచం ఎలా వస్తుంది? కార్యానికీ కారణానికీ మధ్య మూలకంగా ఉమ్మడిలక్షణం ఉండాలి. కారణంగా మీరు చెప్పే దేవుడికీ, కార్యంగా ఏర్పడిన ప్రపంచానికీ ఆ ఉమ్మడి లక్షణం ఏది? కనుక దేవుడు సృష్టికి మూల కారణం కాలేడు. తాను చెప్పిన దానిలోనే ఒకదానికొకటి పొసగకపోతే దానిని తర్కంలో స్వచోవ్యాఘాతం అంటారు. ఈశ్వరవాదం అంతా స్వవచోవ్యా ఘాతమేనని సాంఖ్యం రుజువు చేసింది.
దేవుడు సృష్టికర్తే అయితే ఎందుకోసం సృష్టించాడు? తన ఆనందం కొరకా? తన ఆనందం కోసం చేసేవాడు స్వార్ధపరుడు. దేవుడిని స్వార్ధపరుడు అని ఒప్పుకుంటారా? ఒప్పుకోలేరు. కనుక దేవుడు దయతో సృష్టించివుండాలి. ఎవరిపైన ఈ దయ? నిర్జీవ పదార్దాలపై దయ అంటే అర్ధంలేదు. సజీవ పదార్ధాలపై దయ అంటారా? అలాంటి దయ కలగాలంటే ముందు సజీవ పదార్ధాలు ఉండలిగదా? జీవపదార్ధాన్ని సృష్టించాక దయ కలిగిందా లేక దయ కలిగి సృష్టించాడా? ఏది ముందు? జీవాన్ని సృష్టించ కుండానే దయ ఎలా కలిగింది?
పోనీ, దయ ఏదో విధంగా ఎప్పుడో ఒకప్పుడు కలిగింది అనుకుందాం. ఈ దయ ఎందుకోసం? జీవుల బాధలు తొలగించ డానికా? అసలు బాధలు ఎందుకొచ్చాయి? బాధలుండాలంటే శరీరం ఉండాలి. దానిని దేవుడు ముందు సృష్టించాలి. అంటే దేవుడు బాధలకు నిలయమైన శరీరాన్ని సృష్టించా డన్నమాట. అంటే బాధలకు మూలకారణం దేవుడే అన్నమాట. దీనికి ఈశ్వర వాదులు అంగీకరిస్తారా?
ముందు దేవుడు శరీరం సృష్టిస్తే అప్పుడు బాధలు కలిగాయి. బాధలను తొలగిం చాలనే దయ దేవుడికి కలిగింది. అని అను కుంటే అసలు సృష్టికి మునుపు బాధలు కలిగే ఆస్కారం లేదు అని అర్ధం అవుతుంది. అప్పుడు దయ కలగాల్సిన అవసరం లేదు. అటువం టప్పుడు సృష్టి చేయాల్సిన అవసరమే లేదు.
అబ్బెబ్బే, అలాకాదు, సృష్టి తర్వాతనే దేవుడు దయామయుడైనాడని అంటారా? అంటే ముందు ప్రాణులను సృష్టించి, వారికి బాధలు కలిగించి ఆ తర్వాత దయతో ఆ బాధలను తొలగించేందుకు దేవుడు పూనుకున్నాడని ఒప్పుకుంటారా?
ఈశ్వరవాదులు తాము చెప్పిన దానిలో దేనినీ తామే ఒప్పుకోజాలని ఇరకాటం లో పడిపోయేంతగా సాంఖ్యం తన తార్కిక వాదనలను ప్రతిభావంతంగా ప్రయోగించింది. ఇంత ప్రతిభావంతమైన ప్రాచీనమైన సాంఖ్యం తర్వాతకాలంలో బలహీనపడింది. క్రీస్తుపూర్వం నాటి సాంఖ్యవాదానికి సంబంధించి క్రీస్తుశకం 11వ శతాబ్దానికి చెందిన ఈశ్వర కృష్ణ రచించిన 'సాంఖ్య కారిక' 14వ శతాబ్దం నాటికి చెందిన సాంఖ్య సూత్రాలు మాత్రమే లభ్యమౌ తున్నాయి. ఈశ్వర కృష్ణ ఆస్తికుడు. అతడు రచించాడన్న దానినిబట్టి సాంఖ్యం యొక్క మూలసిద్ధాంతం ఎంతగా పలుచనై పోయి వుంటుందో ఎంతగా వక్రీకరించే అవకాశం వుందో ఊహించుకోవచ్చు. సాంఖ్య సూత్రాలు కూడా ఆ విధంగా రూపొందినవే.
ఈశ్వరవాదాన్ని చెండాడడంపై కేంద్రీకరించినంతగా సాంఖ్యం సమాజంలోని వర్గ వైరుధ్యాలపై దృష్టి సారించలేదు. లోకాయతానికి, సాంఖ్యానికి ఇదే ప్రధానమైన తేడా. అందుకు భావవాద తత్వవేత్తలు లోకాయతాన్ని శత్రుపూరిత దోరణితో నాశనం చేస్తే కపిలుడికి అమితమైన గౌరవం ఇచ్చారు. దేవుడి అవతారం అని అభివర్ణించారు. అదే సమ యంలో సాంఖ్యం యొక్క ఆయువు పట్టయిన స్వభావ వాదాన్ని నామమాత్రంగా మిగిల్చి వుంచారు.
తర్వాత కాలంలో వేదాలను ప్రమా ణంగా సాంఖ్యులు అంగీకరించడంతో దాని ప్రగతిశీలత కనుమరుగైంది. పశ్చిమదేశాలలో భౌతిక వాదులందరిలోకి ప్రాచీనుడు హిరాక్లిటస్. ఇతడు క్రీ.పూ. 550-480 సంవత్సరాల మధ్య జీవించిన గ్రీకుతత్వవేత్త. అంతకన్న దాదాపు 400-500 సంత్సరాలకు మనుపే మనదేశంలో సాంఖ్యం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇదీ దీని చారిత్రక ప్రాధాన్యత.
written by ఎం.వి.ఎస్.శర్మ in prajasakti paper
Monday, 28 September 2009
స్వైన్ ఫ్లూ వ్యాప్తికి కారకులెవరు?
స్వైన్‌ఫ్లూ మహమ్మారి భయం, ఆ వ్యాధి కారక వైరస్ కంటే వేగంగా ప్రపంచ మంతటా వ్యాపించింది. ఒక వారం రోజులు మీడియా గగ్గోలు పెట్టింది. తరువాత ప్రచా రోధృతి తగ్గిపోయింది. వైరస్ మాత్రం ప్రపం చంలో చాలా చోట్లకు వ్యాపించింది. అయితే ఆ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య, చనిపోయినవారి సంఖ్య మొదట్లో అంచనా వేసిన దానికంటే చాలా తక్కువగా వున్నట్లు కనిపిస్తోంది.
మామూలు ఫ్లూ వ్యాధికి భిన్నమైన ఈ కొత్త ఫ్లూ వ్యాధి ప్రపంచంలోని ఏఏ ప్రాంతాలకు విస్తరించిందీ, ఎంతటి ప్రాణాంతక మైనది ఇప్పుడు చెప్పబూనటం తొందరపాటే అవుతుంది. ఈ క్రొత్త వైరస్ ఎలా మొదల యిందనే దానిపై మాత్రం వివాదం ముదురు తోంది.
ఈ కొత్త వైరస్ యొక్క ప్రస్తుత జన్యురూపం మొట్ట మొదటగా 1998లో అమెరికాలోని పందుల ఫారాల్లో కనిపించిందని వ్యాధి నివారణ, నిరోధం కోసం ఏర్పాటు చేసిన అమెరికన్ కేంద్రాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వైరస్ విజృంభణ మాత్రం మెక్సికోలో జరిగింది. అమెరికా బడా కంపెనీ స్మిత్ ఫీల్డుకు చెందిన పందులఫారాలు, పందిమాంసం ఫ్యాక్టరీలు ఉన్న మెక్సికన్ పట్టణాల్లో ఈ వ్యాధి బాగా ప్రబలింది. స్మిత్ ఫీల్డ్ అనుబంధ కంపెనీ అయిన గ్రంజాస్ కార్రోల్ డి మెక్సికో అనే సంస్థ మెక్సికోలో ఈ పారిశ్రామిక కార్యకలాపాలను నిర్వహిస్తోంది. స్మీత్‌ఫీల్డు కంపెనీ ఒకటే ఏడాదికి 1100 కోట్ల డాలర్లకు పైగా పంది మాంసం విక్రయాలు జరుపుతుంది. పంది మాంసం వుత్పత్తిక్రమంలో 2.6 కోట్ల టన్నల మేరకు జంతు సంబంధమైన వ్యర్ధ పాదార్థాలు అక్కడపోగుబడతాయని ''రోలింగ్‌స్టోన్'' పత్రిక 2006లో ప్రచురించిన ఒక వ్యాసంలో అంచనా వేసింది.
మెక్సికోలోని వెరాక్రజ్ రాష్ట్రంలోనూ, లాగ్లోరియా, పెరోట్ ప్రాంతాల్లోనూ నివసించే ప్రజలు అనేక సంవత్సరాలుగా ఈ రాకాసి పరిశ్రమ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే వున్నారు. 'ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం' అమల్లోకి వచ్చీరాగానే 1994లో ఈ భారీస్థాయి పందిమాంసం కర్మాగారం, దానికి అవసరమైన పందులను పెంచే ఫారాలు నెలకొల్పబడినాయి. సరిహద్దుల ఆవలినుంచి ఆమెరికా పెట్టుబడులు ''స్వేచ్చగా'' మెక్సికోలో ప్రవేశించటానికి ఈ ఒప్పందం ద్వారాలు తెరిచింది. అంతేకాదు అమెరికా కంపెనీలు మెక్సికోలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకో వటానికీ, ఎలాంటి అదుపూ లేకుండా శ్రమ దోపిడి చేయటానికీ, మొక్కజొన్న తదితర సరుకుల దిగుమతులతో మెక్సికో ఆర్థిక వ్యవస్థను ముంచెత్తటానికీ ఈ ఒప్పందం ద్వారా అమెరికన్ కంపెనీలకు అవకాశం లభించింది. అమెరికా లోని కొన్ని కఠినతర నిబంధనలనుండి తప్పు కోవడం కోసమే స్మిత్ ఫీల్డ్ కంపెనీ తన పందిమాంసం ఫ్యాక్టరీలను మెక్సికోలో నెల కొల్పిం దన్న అభిప్రాయం కూడా చాలా మందిలో వుంది. మాంసం కోసం పెంచే లక్ష లాది పందుల పెంటను ఎరువుగా నిలవ చేయటానికి కంపెనీ అక్కడ పెద్ద పెద్ద చెరువులు ఏర్పాటుచేసింది. మాంసం కోసం కోత దశకు చేరటానికి ముందుగానే చనిపోయే పందులను కుళ్లబెట్టటం కోసం బహిరంగ ప్రదేశంల్లోనే గుట్టలు గుట్టలుగా పడేసి వుంచటం జరుగుతోంది. ఈ వ్యర్ధ పదార్థాల నుంచి వచ్చే కంపుతో మైళ్లతరబడి వాయు కాలుష్యం జరుగుతోంది. అనేక మెక్సికన్ పట్టణాల భూగర్భజాలలు కూడా కలుషితమైనాయని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. పంది ఎరువు కుప్పలమీద జీవించే ఈగలు పరిసరా ల్లోని జనావాసాల్లో ముసురుతుంటాయి.
ఫ్లూ వ్యాధి బారిన పడిన పక్షుల రెట్టలను ఒక చోట నుంచి - వేరొక చోటకు చేరవేయటం ద్వారా ఈగలు బర్డ్ ఫ్లూ వ్యాధిని వ్యాప్తి చేయగలవనే విషయం అందరికీ తెలిసిందే. పందుల ఎరువులో పెరిగి పెద్ద వయిన ఈగలు, పక్షుల రెట్టల మీద కూడా వాలే అవకాశం వుంది. అందువల్ల, అవి పందులనుంచి, పక్షుల నుంచి, మనుషుల నుంచీ వైరస్ జన్యువులను కలగలిపే సాధనాలుగా తయారయినాయి. కొత్త వ్యాధి విజృంభణకు అదొక కారణమయ్యే అవకాశం వుంది.
స్మిత్ ఫీల్డ్ కంపెనీ పందుల ఫారం ఏర్పాటు చేయటాన్ని 2005లోనే స్థానిక ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు మెక్సికన్ వార్తాపత్రిక ''లాజొర్నాడా''లో ప్రచురితమైన వార్తలు తెలుపుతున్నాయి. భారీ స్థాయిలో పందుల పెంపకం, పందిమాంసం వుత్పత్తి కార్యకలాపాలు చేపట్టటాన్ని స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలే నడిచాయి. అయితే 'గ్రంజా కర్రోల్' కంపెనీతో కుమ్మక్కయిన వెరాక్రజ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు 2008లో అనేక మంది ఉద్యమ కారులను అరెస్టుచేసి జైళ్లలో కుక్కారు. స్వైన్ ఫ్లూ విజృంభణ అంతర్జాతీయ వార్తాంశం కావటానికి చాలా కాలం ముందే వందలాది మంది లాగ్లోరియా పట్టణ ప్రజలు శ్వాస సంబంధమైన వ్యాధులకు లోనైట్లు, అనేక మందిలో ఇది న్యూమోనియో రూపం దాల్చినట్లు వార్తలు వచ్చాయి. ఫ్లూ బారిన పడితే వచ్చే సమస్యల్లో న్యూమోనియా ఒకటి. 'వెరా టెక్ట్' అనే పేరుగల ప్రయివేటు కంపెనీ ఒకటి అమెరికాలో ఉంది. ప్రపంచం అంతటా ఎక్కడెక్కడ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నదీ గమనిస్తూ, నిర్ణీత రుసుము చెల్లించి తమ ఖాతాదారులుగా నమోదు చేసుకున్నవారికి సమాచారం అందించటమే ఈ కంపెనీ పని. వెరాక్రజ్ పట్టణంలో స్వైన్ ఫ్లూ ఉనికిని ఆ కంపెనీ ఒక నెల ముందుగానే గమనించింది. వ్యాధి నిరోదక కేంద్రానికి తెలియపరచింది. అయితే బయో టెర్రరిజం బూచిపైనే దృష్టినంతా కేంద్రీకరించి వున్న వ్యాధి నిరోధక కేంద్రాలు ఈ విషయాన్ని అనేక వారాలపాటు పట్టించుకో కుండా మూలపడేశాయి.
స్వైన్ ఫ్లూ వైరస్ బారిన పడినట్లు నిర్థారితమైన మొట్టమొదటి కేసు లాగ్లోరియా పట్టణ ప్రాంతంలోని ఒక యువకునిలో కనిపించింది. అతను తర్వాత కోలుకున్నాడు. తరువాత ఈ వైరస్ మెక్సికో సిటీకి, మెక్సికోలోని ఇతర ప్రాంతాలకూ వ్యాపించింది. వాటితో పాటే అమెరికాలోని న్యూయార్కు, కాలిఫో ర్నియా, టెక్సాస్ తదితర ప్రదేశాలకూ, ప్రపం చంలోని ఇతర ప్రదేశాలకూ వ్యాప్తి చెందింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మే మూడో తేదీన చేసిన ప్రకటన ప్రకారం ప్రపంచం మొత్తం మీద తొమ్మిది వందలకు పైగా స్వైన్‌ఫ్లూ కేసులు నిర్థారితమైనాయి. అందులో సగానికిపైన మెక్సికో లోనే నమోదయినాయి. జబ్బుసోకిన వారిలో ఇరవై మంది మృతి చెందారు. వారిలో పంతొమ్మిది మంది మెక్సికోవాసులు ఒక్కరు అమెరికా వాసి.
ప్రస్తుతం చెప్పుకుంటున్న ఈ స్వైన్ ఫ్లూ వైరస్, పందులను, పక్షులను, మానవులనూ ఆశించే వైరస్‌ల యొక్క జన్యు మిశ్రమం వల్ల కొత్తగా అభివృద్ధి చెందినదని ఆరోగ్య అధి కారులు తెలియజేశారు. అమెరాకాకు చెందిన ఆరోగ్య అధికారులు, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు కూడా దాదాపు ఒక దశాబ్ద కాలంపాటు 'హెచ్ 5 ఎన్-1' గా పిలవ బడుతున్న బర్డ్ ఫ్లూ వ్యాధి పైనే తమ దృష్టినంతా కేంద్రీకరించారు. బర్డ్ ఫ్లూ ప్రపం చం అంతటా వ్యాప్తి చెందింది. కాని ఎక్కడా మనుషుల జోలికి మాత్రం పోలేదు. కోళ్ళతోనూ, జలచర పక్షులతోనూ మమేకమై పనిచేస్తుండిన కొంత మందికి బర్డుఫ్లూ సోకినప్పటికీ ఒక మనిషి నుండి మరో మనిషికి బర్బుఫ్లూ సోకినదాఖలాలు లేవు.
కొత్తగా ముందుకొచ్చిన ఈ స్వైన్ ఫ్లూ భిన్నమైనది. హెచ్1 ఎన్1గా వ్యవహరిం చబడుతున్న ఈ వైరస్‌కు మనుషులకు సోకే ఫ్లూతో సామీప్యత ఉంది. ఒక మనిషి నుండి వేరొక మనిషికి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ మనిషి నుండి - పందికి సోకిన సందర్భం ఒకటి కెనడాలో కనిపించింది. మెక్సికోలో ఉండి వచ్చిన కార్మికుడు కెనడా లోని ఈ పందుల ఫారాన్ని సందర్శించిన మీదట ఆ ఫారంలోని చాలా పందులకు ఈ వైరస్ సోకినట్లు గమనిం చటం జరిగింది.
వాస్తవం ఏమిటంటే - అమెరి కాలో కనిపించిన స్వైన్ ఫ్లూ కేసులు టూరిస్టుల్లోనూ, టూరిస్టులతో సన్నిహితంగా ఉన్నవారిలోనూ మాత్రమే గమనించ బడినాయి. అందువల్ల వలసవచ్చిన వారిపై దాడి చేయటం ఇప్పటికింకా పరిమిత స్థాయిలోనే ఉంది. అయితే బడా వాణిజ్య వర్గాల అధీనంలోని మాస్ మీడియా మాత్రం స్మిత్‌ఫీల్డ్ కంపెనీ ప్రమేయాన్ని గురించిగాని, నార్త్ కరోలినా, ఉంటా తదితర ప్రదేశాల్లోని భారీస్థాయి హాని కరమైన బహుళ జాతి మాంసం కర్మా గారాల ప్రమేయాన్ని గురించి గాని ఏమాత్రం ప్రస్తావించటం లేదు. పర్యా వరణానికీ, ప్రజారోగ్యానికీ ప్రమాదం తెచ్చిపెడుతూ లాభాలు గడిస్తున్న బడా బహుళజాతి కంపెనీలే అసలు నేరస్తులు. స్వైన్ ఫ్లూ నేరస్తులు వారే కనుక వారినే ప్రపంచం శిక్షిం చాలి.
note article took from the Markist Paper markist

'అణు'మానాలు తొలగించాలి
అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి)పై భారత్ సంతకం చేయాలన్న వత్తిడిని మరోసారి అమెరికా ప్రారంభించిందంటే కేంద్రంలోని యుపిఏ సర్కార్‌ను మరోసారి అనుమానించకతప్పటం లేదు. ఇటువంటి వత్తిళ్లు వస్తాయని గతంలోనే సిపిఎం ఇతర వామపక్షాలు కేంద్ర సర్కార్‌ను హెచ్చరించాయి. ఇప్పుడది నిజమని రుజువైంది. బుష్ విధానాల నుంచి మార్పుకు ప్రయత్నిస్తానని చెప్పి గద్దె నెక్కిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇప్పుడు అదే బుష్ బూట్లలో కాళ్లుపెట్టి నడిచేందుకు పూనుకున్నారని వెల్లడైంది. అణ్వస్త్రాలు కలిగిన, లేని దేశాల పట్ల వివక్ష చూపుతున్న ఈ ఒప్పందాన్ని ఇంతవరకు అంగీకరించని నాలుగు దేశాలలో భారత్ ఒకటి. పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తరకొరియా మిగిలిన మూడు. వీటిలో ఉత్తర కొరియా గతంలో ఒప్పందంపై సంతకం చేసింది.
అయితే అమెరికా తాను ఇచ్చిన హామీల నుంచి వైదొలగటంతో దానికి నిరసనగా ఉత్తర కొరియా ఎన్‌పిటి నుంచి వైదొలగింది. తన ప్రయోజనాలకోసం అమెరికా ముందుకు తెచ్చిన ఎన్‌పిటి ఒప్పందంతో తాము కూడా లబ్దిపొందే అవకాశం ఉంది కనుక అణుదేశాలుగా గుర్తింపు పొందిన బ్రిటన్,ఫ్రాన్స్,చైనా, రష్యా కూడా దానిని బలపరిచాయి. పాకిస్థాన్, ఇజ్రాయెల్ తన కనుసన్నలలో మెలిగే దేశాలే కనుక వాటి గురించి అమెరికా నోరెత్తదు. తాము అణ్వస్త్రాల వ్యాప్తికి వ్యతిరేకమేనని, అదే సమయంలో ముందుగా తాము వాటిని వినియోగించబోమని ఏకపక్షంగా ప్రకటించిన భారత్ తమ రక్షణ అవసరాల రీత్యా ఎన్‌పిటిపై సంతకం చేసేది లేదని గత నాలుగు దశాబ్దాలుగా చెబుతోంది. ఈ విధానం నుంచి వైదొలగబోమని ప్రధాని మన్మోహన్‌సింగ్ గతంలో ప్రకటించారు.
ఇదే సమయంలో మన దేశాన్ని అణుదేశంగా గుర్తిస్తే ఎన్‌పిటిపై సంతకం చేయటానికి అభ్యంతరం లేదని తొలిసారిగా చెప్పటంతో ప్రధాని రెండునాలుకలతో మాట్లాడుతున్నారని, ఇంతకాలంగా అనుసరిస్తున్న విధానం నుంచి వైదొలగేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని వెల్లడైంది.
అమెరికాతో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందం(123 ఒప్పందం)లో ఎన్‌పిటిపై మనం సంతకాలు చేయాలన్న నిబంధనలేవీ లేవని 2006 ఆగస్టు17న, ఆతరువాత 2007లో కూడా పార్లమెంట్ ఉభయసభలలో చేసిన ప్రకటనలో కూడా నమ్మబలికారు. అయితే వామపక్షాల వత్తిడి మేరకు పార్లమెంట్‌కు సమర్పించిన 123 ఒప్పందంలో ఎన్‌పిటి గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఇదే సమయంలో మనదేశం దానిపై సంతకం చేయాలన్న మినహాయింపు ఇచ్చినట్లు కూడా లేదు. అయితే ప్రధాని పార్లమెంట్‌కు ఇచ్చిన హామీకి విరుద్ధంగా దానిలో ఒక మెలిక ఉంది.
అమెరికాతో కుదుర్చుకున్న 123 ఒప్పందానికి అణునిరాయుధీకరణ ఇరుసువంటిది. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి. 1968లో ఉనికిలోకి వచ్చిన ఎన్‌పిటి ఒప్పందంలో ప్రొలిఫరేషన్ అనే పదానికి ఎలాంటి స్పష్టమైన నిర్వచనం ఇవ్వలేదు. దానికి విస్తరణ, వ్యాప్తి, పునరుత్పాదన అనే అర్ధాలున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం గుర్తింపు పొందిన అణు దేశాలు అప్పటికే తమ వద్ద ఉన్న అణ్వాయుధాల సంఖ్యను, వాటి విధ్వంసక శక్తిని పెంచుకోవచ్చు. మనం కుదుర్చుకున్న 123 ఒప్పందంలో కూడా ఈ పదం ఉంది గాని దానికి ఇక్కడ కూడా నిర్వచనాన్ని విస్మరించారు. అందువల్లనే మనకు ఎన్‌పిటి వర్తించదని యుపిఏ సర్కార్ భాష్యం చెప్పింది. అయితే 123 ఒప్పందంలో చెప్పిందేమిటి? అంతర్జాతీయ అణుశక్తి సంస్థ లక్ష్యాలు, రక్షణ వ్యవస్థకు అనుగుణంగా ఆధునిక అణుపరిజ్ఞానం పొందిన దేశాలు దానిని అణ్వాయుధాల తయారీకి వినియోగించ కూడదు.
అలా చేయాలంటే రెండు పక్షాలూ అందుకు అంగీకరించాలి. కనుక మనదేశం ఎన్‌పిటిపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ డొంకతిరుగుడు హామీల గురించి చెప్పకుండా తక్కువ చేసి చూపటం, విస్మరించినట్లు వ్యవహరించటంతో యుపిఏ సర్కార్ విశ్వసనీయతపై అనుమానాలు తలెత్తాయి. వామపక్షాలు దీనికి వ్యతిరేకంగానే యుపిఏ సర్కార్‌కు మద్దతు ఉపసంహరించాయి. సమాజవాదిపార్టీ మరికొన్ని పార్టీల మద్దతుతో యుపిఏ సర్కార్-1 విశ్వాసపరీక్షలో గట్టెక్కింది. ఆ తరువాత ఒప్పందం కుదిరే వరకు దాని గురించి పట్టుబట్టని అమెరికా ఇప్పుడు దాన్ని మళ్లీ ముందుకు తెచ్చింది కనుక అనుమానించాల్సి వస్తోంది.పిట్స్‌బర్గ్‌లో జరిగిన జి-20 సమావేశాలకు ముందుగా భద్రతా మండలిలో అమెరికా ప్రతిపాదించి ఆమోదం పొందిన తీర్మానంలో నేరుగా భారత్ పేరెత్తకపోయినా వచ్చే ఏడాది జరిగే ఎన్‌పిటి సమీక్షా సమావేశాలలోగా అన్ని దేశాలూ ఒప్పందాన్ని ఆమోదించాలని, అణ్వస్త్రవ్యాప్తి నిరోధానికి సహకరించాలని కోరింది.
తాము కూడా సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిరోధ ఒప్పందం(సిటిబిటి)పై సంతకం చేస్తామని ఇప్పుడు ఒబామా సర్కార్ నమ్మబలుకుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఇప్పటివరకు ఎందుకు ఆమోదించలేదంటే సాంకేతికంగా తామాపని చేయకపోయినా పరీక్షలను నిలిపివేశాము కదా అని అడ్డగోలు వాదనకు దిగుతోంది. అదే వాదన తమకు మాత్రం ఎందుకు వర్తించదని ప్రశ్నించకుండా ముందు జాగ్రత్తగా తాము కూడా ఆమోదిస్తామని చెబుతోంది. అయితే అందుకు అవసరమైన మూడింట రెండువంతుల మెజారిటీ అమెరికా పార్లమెంట్‌లో ఒబామాకు లేదన్నది గమనించాలి. అవసరం లేకుండానే జపాన్‌పై అణుబాంబులను ప్రయోగించి మారణకాండకు పాల్పడటమేగాక ప్రపంచాన్ని భయపెట్టిన అమెరికానే ఈ అణ్వాయుధపోటీకి ఆజ్యం పోసింది.
ఇంతజరిగినప్పటికీ మరోసారి తాము ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోమని చెప్పటానికి అమెరికా సిద్దం కావటం లేదు. భద్రతా మండలి తీర్మానంపై మనదేశం స్పందించిన తీరు హర్షణీయమే. అందుకు కట్టుబడి ఉంటుందా అన్నదే అనుమానం. ఇరాన్ ఎన్‌పిటిపై సంతకాలు చేసినప్పటికీ రహస్యంగా అణ్వాయుధాల తయారీకి పూనుకుందన్న తప్పుడు ప్రచారంతో దానిని సాధించేందుకు పూనుకుంది. అందువలన అమెరికాను నమ్మటానికి వీలులేదు. ప్రపంచవాణిజ్య సంస్థలో వ్యవసాయసబ్సిడీలపై అమెరికా, ఇతర ధనికదేశాల వైఖరిని ఇంతకాలం వ్యతిరేకించిన మనదేశం ఇప్పుడు దోహాదఫా చర్చలకు ముగింపు పలికే చొరవకు పూనుకుందంటే మనం లొంగిపోయామా? ధనిక దేశాలు దిగివచ్చాయా అంటే రెండవదానికి ఎలాంటి రుజువు లేదు. అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం విషయంలో కూడా ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా మన దేశాన్ని అణుదేశంగా గుర్తించినా లేకున్నా ఆ ఒప్పందాన్ని అంగీకరించేదిలేదని పార్లమెంటుకు, దేశ ప్రజలకు విస్పష్ట హామీ ఇవ్వాలి. దీనిపై తలెత్తిన అన్ని అనుమానాలను తొలగించాలి.
Note:article took from prajashakti paper

Friday, 25 September 2009
మేధో సంపత్తి హక్కులపై కపట నాటకం
మేధో సంపత్తి హక్కుల వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. గతంలో సమర్పించిన నివేదికనే కమిటీ 2009 ఏప్రిల్‌లో తిరిగి సమర్పించింది. పార్లమెంటు సమావేశాలు వాయిదా పడిన తరుణంలో దీనిని సమర్పించడంలో ఉద్దేశం దేశంలో ప్రజలచే ఎన్నుకోబడిన అత్యున్నత పార్లమెంటు పరిశీలన నుంచి తప్పించుకోవడమేనని స్పష్టమవుతోంది. దీనిని ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించరాదు.
ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యుటిఓ) ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందంపై పద్నాలుగేళ్ళ క్రితం భారతదేశం సంతకం చేసింది. దానిపైనే కాకుండా దానికి అనుబంధంగావున్న పలు ఒప్పందాలపై కూడా సంతకాలు చేసింది. ఇలాంటి వాటిల్లో వాణిజ్య సంబంధింత మేధో సంపత్తి హక్కుల (ట్రిప్స్) ఒప్పందం ఒకటి. ట్రిప్స్ ఒప్పందం 'మేధో సంపదకు' రక్షణ కల్పిస్తుంది. అంటే, మనకున్న సరికొత్త ఆలోచనలు నూతన సృష్టికి దారితీసినట్లయితే పేటెంట్లు, కాఫీరైట్స్, ట్రేడ్‌మార్క్ తదితరాల ద్వారా దానిపై యాజమాన్యం లభిస్తుంది. ఈ సందర్భంగా ఒక సంగతి గుర్తు చేసుకోవలసి ఉన్నది. అదేమంటే, డబ్ల్యుటిఓ పరిధిలోకి ట్రిప్స్‌ను తీసుకు రాకూడదంటూ ఉరుగ్వే దఫా గాట్ చర్చలలో భారత్ సహా పలు వర్ధమాన దేశాలు ఉద్ఘాటించాయి. ఈ సందర్భంగా అమెరికా, ఐరోపా, జపాన్‌ల నుంచి ఈ దేశాలు తీవ్ర ఒత్తిడినే ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రపంచంలోని అన్ని దేశాలు తమ చట్టాలలో మేధో సంపద హక్కుల అంశాన్ని చేర్చాలంటూ అమెరికా తదితర దేశాలు పట్టుపట్టాయి. తమకున్న ప్రయోజనాల రీత్యా ఈ అంశాన్ని బడా ఔషధ కంపెనీలు, సాప్ట్‌వేర్ కంపెనీలు దీన్నొక యుద్ధంగా మార్చివేశాయి. అసమానుల మధ్య జరిగిన ఈ యుద్ధంలో వర్ధమాన దేశాలు పరాజయం పాలుకాగా, ట్రిప్స్ వాస్తవ రూపం దాల్చింది. ఇతర వర్ధమాన దేశాలు భారత్‌ను విడిచిపెట్టటంతో సంతకాలు చేయక తప్పలేదని మన ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించింది. మన దేశం చర్చలలో సరిగ్గా పాల్గొన్నదా లేదా అన్న విషయాన్ని చర్చించటానికి ఇది సమయం కాదు. అయితే ట్రిప్స్ ఒప్పందం జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమంటూ భారతప్రభుత్వం తన వైఖరిని ప్రకటనల రూపంలో వెల్లడించింది.
పేటెంటు ఉత్తర్వు-2004
ఒక్కసారి 2004 ప్రథమ పాదానికి వెళ్దాము. ఆనాటి బిజెపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 1970ల నాటి పేటెంబ్ చట్టానికి సవరణలను ఖరారు చేసింది. ఒకసారిగాని ట్రిప్స్ ఒప్పందంపై సంతకం చేస్తే దేశీయంగా వున్న పేటెంట్ చట్టాన్ని సవరించి తీరాల్సిందే. ఇందుకుగాను భారత్‌వంటి వర్ధమాన దేశాలకు పదేళ్ళ గడువు ఇచ్చారు. అంటే 2005 జనవరి నాటికి పేటెంటు చట్టాన్ని సవరించాలన్న మాట. ట్రిప్స్ ఒప్పందం ప్రధానంగా ఔషధ, సాఫ్ట్‌వేర్ రంగాలను దెబ్బతీసేదిగా ఉన్నది. 1970 నాటి భారతీయ పేటెంటు చట్టం ప్రకారం పేటెంటు పరిధిలోకి ఔషధాలు రావు. కాని ఇప్పుడు ట్రిప్స్ ఒప్పందాన్ని అనుసరించి ఔషధాలకు కూడా పేటెంటు వర్తిస్తుంది. ఈ ఒప్పందంలో కొన్ని వెసులుబాట్లున్నాయి. పేటెంటు హక్కు కల్పిస్తున్నప్పటికీ ఔషధాలను అందరికీ అందుబాటులో ఉంచే అవకాశం ఉన్నది. 2004 నాటికి ఎన్డీయే ప్రభుత్వం ముందున్న పరిస్థితి ఇది. కాని ఈ మేరకు ఎన్డీయే తయారు చేసిన ముసాయిదా ఎందుకూ పనికి రాలేదు. అదృష్టవశాత్తు 2004 ఎన్నికలలో ఎన్డీయే ఓడిపోయింది. దానితో ఈ సవరణలు పార్లమెంటులో చర్చకు రాలేదు.
2004 డిసెంబరు 26న భారతదేశం సునామీ ప్రమాదంలో చిక్కుకున్నది. వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సమయంలోనే యుపిఏ ప్రభుత్వం భారతీయ పేటెంటు చట్టానికి ఉత్తర్వు రూపంలో సవరణలను ముందుకు తీసుకువచ్చింది. ఈ ఉత్తర్వు మునుపటి ఎన్డీయే దారిలోనే ఉన్నది. పార్లమెంటులో ఎలాంటి చర్చకూ అవకాశం ఇవ్వకుండానే దీనిని ఆమోదించాలని ప్రభుత్వం ప్రయత్నించింది. ఇది తాను తయారు చేసిన ముసాయిదాయే కనుక ఎన్డీయే కూడా దీనికి సుముఖంగానే ఉన్నది. 2004 నాటి పేటెంట్ సవరణ ఉత్తర్వు తీవ్ర విమర్శలనే ఎదుర్కొన్నది. ఈ సవరణలు అమలులోకి వస్తే లక్షలాది భారతీయులకు కొత్తరకాల మందులు అందకుండా పోతాయి. కనుకనే ఈ సవరణలకు వ్యతిరేకంగా అనేక సంస్ధలు ఆందోళనకు దిగాయి. ఒక్క భారతదేశంలోనే కాక ప్రపంచమంతటా వివిధ సంస్ధల ఆధ్వర్యంలో ప్రదర్శనలు సాగాయి. అంతేకాక, సవరించిన భారతీయ చట్టం అమలైతే భారతీయ కంపెనీలు చౌక ధరలకు మందులను అమ్మలేవు. ప్రస్తుతం ఆసియా, ఆఫ్రికా దేశాలలో ఈ మందులు అమ్ముడవుతున్నాయి. మార్క్సిస్టు పార్టీ నేతృత్వంలో వామపక్షాలు కూడా గొంతు కలపటంతో ఈ ఉద్యమానికి మరింత వూపు వచ్చింది.
ఎన్డీయే మద్దతు ఉండటంతో యుపిఏ ప్రభుత్వంలో ఎలాంటి చలనమూ లేకుండా పోయింది. ప్రభుత్వాన్ని కలవరపరిచే ఉద్దేశంతో పార్లమెంటులో ఈ ఉత్తర్వును వ్యతిరేకించాలని 2005 మార్చిలో బిజెపీ నిర్ణయించటంతో యుపిఏలో కదలిక వచ్చింది (2004లో తన ప్రభుత్వం తయారు చేసిన సవరణలనే వ్యతిరేకించాలని బిజెపీ నిర్ణయించింది!). పార్లమెంటులో ఓటమిని తప్పించుకునేందుకై యుపిఏ ప్రభుత్వం విధిలేక వామపక్షాలతో చర్చలకు అంగీకరించింది. మొత్తంమీద వామపక్షాలు, ఇతర బృందాలు చేసిన ప్రతిపాదనలు సవరణలలో చోటుచేసుకున్నాయి. రెండు అంశాలపై మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదు. ఇందులో ఒకటేమంటే, కొత్తగా కనిపెట్టిన రసాయన మూలకాలకే పేటెంట్లు వర్తించేలా వాటిపై ఆంక్షలు విధించాలనడం. సూక్ష్మాంగాలపై పేటెంట్లు లేకుండా చేయాలన్నది మరొకటి. ఈ ప్రతిపాదనలను నిపుణుల బృంద పరిశీలనకు పంపుతానని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ విధంగా పార్లమెంటులో భారతీయ పేటెంటు చట్టం ఆమోదం పొందింది.
మషేల్కర్ కమిటీ
అనుకున్నట్లుగానే ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. దీనిని పేటెంటు చట్టంపై సాంకేతిక నిపుణుల బృందం (టిఇజి) అని పిలిచారు. డాక్టర్ ఆర్.జి. మషేల్కర్ ఈ కమిటీకి నేతృత్వం వహించారు. సిఎస్‌ఐఆర్ మాజీ డైరక్టర్‌గా ఈయన పనిచేశాడు. కార్పొరేట్ ప్రసారమాధ్యమంలో ఒక భాగం ఈయనపట్ల సానుభూతితో ఉన్నది. దేశంలోని అత్యున్నత శాస్త్రీయ సంస్ధలను ఆధునికీకరించాడన్న పేరు ఆయనకు ఉన్నది. ఈయన హయాంలోనే సిఎస్‌ఐఆర్ కార్పొరేట్ సంస్ధగా మారిందని చెప్తారు. భారతీయ శాస్త్రానికీ, భారతీయులకూ పేటెంట్లు ఉపయోగపడగలవన్న అభిప్రాయంతో ఆయన ఉన్నారు. ఆయనను ఎంపిక చేసుకోవటంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ఉద్దేశాలు లేకపోలేదు. డాక్టర్ మషేల్కర్ అయితే భారతీయ పేటెంటు చట్టం అవసరం లేదనటానికి తగిన ఆధారాలు చూపగలడని, వాస్తవంలో రబ్బరు స్టాంపులా పనిచేస్తాడని ప్రభుత్వం భావించింది. 2006 డిసెంబరులో ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. సవరణలు అవసరం లేదని ఈ నివేదిక పేర్కొన్నది. కొన్ని రోజుల తరువాత ఈ నివేదికను విడుదల చేశారు. లండన్‌కు చెందిన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇన్‌స్టిట్యూట్ ఈ కమిటీకి సమర్పించిన పత్రమే ఎలాంటి మార్పులేకుండా కమిటీ నివేదికగా వెలువడినట్లు వెల్లడైంది. ఈ కమిటీకి అస్త్రా జెనెకా, గ్లాక్సో స్మిత్ క్లిన్ తదితర బహుళజాతి సంస్ధలు పెద్దయెత్తున విరాళాలు ఇచ్చాయి. దీనినిబట్టి కూడా ఈ కమిటీ స్వభావం అర్థమవుతున్నది. 'అనుకోకుండా సాంకేతిక అవకతవకలు' నివేదికలో చోటు చేసుకున్నాయంటూ డాక్టర్ మషేల్కర్ స్వయంగా అంగీకరించాడు.
ప్రజలలో ఆందోళన పెరగటంతో కమిటీ అధ్యక్ష పదవికి మషేల్కర్ రాజీనామా చేశారు. కమిటీ తన నివేదికను వెనక్కు తీసుకున్నది. వాణిజ్య మంత్రిత్వ శాఖ మాత్రం తన వెబ్‌సైట్‌లో పాతచ నివేదికనే ప్రదర్శిస్తున్నది. ప్రభుత్వం మాత్రం దీని గురించి ఏమీ మాట్లాడటం లేదు. కమిటీ మరలా గత ఏప్రిల్‌లో మరో నివేదిక సమర్పించినట్లు ప్రకటన వెలువడింది. అయితే ఈ కొత్త నివేదికలో పెద్దగా మార్పులేమీ లేవని తెలుస్తున్నది. పేటెంటు చట్టాలలో నిపుణునిగా పేర్గాంచిన ప్రొఫెసర్ కార్లొస్ కోరియా చెప్పిన దానిని సందర్భశుద్ధి లేకుండా ఈ నివేదికలో చాలా ఎక్కువగా ఉటంకించడం జరిగింది. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత నివేదికను సమర్సించడం జరిగింది. అంటే పార్లమెంటును తప్పించుకోవాలని ప్రభుత్వం చూస్తున్నదన్నమాట. ఏదియేమైనా తిరిగి సమర్పించిన ఈ నివేదికను పార్లమెంటులో చర్చకు పెట్టాలి. అప్పుడే పార్లమెంటుకు తగిన గౌరవమిచ్చినట్లవుతుంది.

Thursday, 24 September 2009
మీడియా దాడి వెనుక..............!
నిప్పులేనిదే పొగరాదంటారు. అయితే , నిప్పు లేకుండానే పొగ ఎలా పుట్టించవచ్చో మీడియా రుజువు చేసింది. భారత్- చైనా సరిహద్దుల్లో ఎలాంటి ఘర్షణలు లేకపోయినా ఏదో జరిగిపోయిందని, యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయని మీడియాలో ఒక సెక్షన్ ఊదరగొట్టడం దీనికి పరాకాష్ట. ఈ అతిపెద్ద ఆసియన్ ఇరుగుపొరుగు దేశాలు రెండూ వివిధ రంగాల్లో స్నేహపూర్వక, ద్వైపాక్షిక సహకార సంబంధాలను మెరుగుపరచుకుంటూ ముందుకు సాగుతున్న తరుణంలో 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రిక భారత్ భూభాగంలోకి చైనా చొరబడి, ఇద్దరు భారత సైనికులను గా యపరిచిందంటూ నిరాధారమైన ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ వెంటనే అదే గ్రూపు సంస్థకు చెందిన ఒక టీవీ న్యూస్ చానెల్ దానిపై కొంతమంది నిపుణులతో చర్చ నిర్వహించింది. ఆ ఛానెల్‌ను చూసి ఈ చానెల్, ఈ చానెల్‌ను చూసి ఇంకో చానెల్ ఇలా ఒకటి కొకటి పోటీ పడి అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు ఈ కట్టుకథలకు మరికొన్ని జోడించి విస్తృతంగా ప్రచారం చేశాయి. అటు ప్రింట్ మీడియా, ఇటు ఎలక్ట్రానిక్ మీడియా కూడబలుక్కున్నట్టుగా ఈ ప్రచారం సాగించాయి. ఎలాంటి ఆధారాలు చూపకుండా అనధికారిక సమాచారం పేరుతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం మీడియా నైతిక ప్రమాణాలకు విరుద్ధమని తెలిసి కూడా ఇలాంటి నీతిబాహ్యమైన ప్రచారానికి పాల్పడడం బాధ్యతా రాహిత్యమే తప్ప మరొకటి కాదు. చైనాతో గల సరిహద్దుల్లో ఎప్పటి మాదిరిగానే సామరస్యపూర్వక వాతావరణం కొనసాగుతోందని ఆర్మీ చీఫ్ చెప్పిన తరువాత కూడా మీడియా పదేపదే అదే పాట పాడింది. భారత్, చైనా ప్రభుత్వాలు రెండూ ఈ వార్త తప్పు అని స్పష్టం చేసిన తరువాత కూడా చైనా అంటే భయమా? ఈ చొరబాట్లను ఖండించరేం? అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కథనాలను మీడియా కొనసాగిస్తోంది. ఇంతవరకు జరిగింది చాలు. ఇప్పటికైనా ఈ దుష్ప్రచారాన్ని కట్టి పెట్టమని ప్రభుత్వం మొత్తుకుంటున్నా మీడియా ధోరణిలో మార్పు లేదు. దీంతో మొదట ఈ తప్పుడు వార్తను పుట్టించిన టైమ్స్ ఆఫ్ ఇండియా విలేకరులిద్దరిపైన కేసు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తం ఉదంతంలో ప్రభుత్వ తప్పిదం కూడా కొంత వుంది. తన దగ్గర వున్న సమాచారాన్ని ప్రజల ముందుంచకుండా తాత్సారం చేసింది. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే.. అయితే దీనిని సాకుగా చూపి లేని చొరబాట్లను ఉన్నట్లుగా మీడియా చిత్రీకరించడం దుర్మార్గం.
మీడియా ఈ విధంగా వ్యవహరించడం వెనక ఉన్న శక్తులు ఏమిటో, వాటి ఎజెండా ఏమిటో తెలుస్తూనే ఉంది. ఆసియాలో బలమైన శక్తులుగా ఎదుగుతున్న భారత్, చైనాలు కలిస్తే ప్రపంచాధిపత్యానికి అర్రులు చాస్తున్న అమెరికా యత్నాలకు గండి పడుతుంది. అందుకే చైనాను ఎదగనీయకుండా చేయడానికి నానా గడ్డి కరుస్తోంది. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా చైనా మాత్రం 9 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతుండడం అమెరికాను కలవరపరుస్తోంది. అదీగాక ఆసియాలోని ఇరుగుపొరుగు దేశాలతో చైనా మంచి సామరస్య పూర్వక సంబంధాలను నెరపుతోంది. భారత్‌తో సరిహద్దు సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న కృతనిశ్చయాన్ని వ్యక్తం చేసింది. ఆ దిశగా చర్చల ప్రక్రియను కూడా వేగవంతం చేసింది. 2005లో చైనా ప్రధాని వెన్‌జియా బావో, 2006 నవంబరులో అధ్యక్షుడు జింటావో భారత్‌లో పర్యటించడం, గతేడాది జనవరిలో భారత ప్రధాని మన్మోహన్ సింగ్ చైనాలో మూడు రోజులు పర్యటించడం, అదే సంవత్సరం ఆగస్టులో ఒలింపిక్ సంబరాలకు యుపిఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, విదేశాంగ మంత్రి హోదాలో ప్రణబ్ ముఖర్జీ హాజరవడం, వివిధ స్థాయిల్లో పరస్పర సహకారానికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటివి ఈ రెండు దేశాల మధ్య బలపడుతున్న మైత్రీ బంధానికి నిదర్శనం. అంతేకాదు భారత్, రష్యా,లతో కలిసి ఒక వేదికను, బ్రెజిల్, రష్యా, ఇండియాలను కలిపి మరో వేదికను, అయిదు ప్రధాన వర్థమాన దేశాలతో కలిపి ఇంకో వేదికను ఏర్పాటు చేయడం ద్వారా అమెరికా ఇతర సంపన్న దేశాల ఏకపక్ష ధోరణులకు చెక్ పెట్టేందుకు చైనా ప్రయత్నిస్తున్నది. దీంతో చైనాను దెబ్బతీస్తేగాని తమ ప్రయోజనాలు నెరవేరవని భావించిన అమెరికా ఇప్పటికే చైనాతో వాణిజ్య రంగంలో ప్రచ్ఛన్న యుద్ధానికి తెరతీసింది. ఇప్పుడు భారత్- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే చర్యలకు మీడియా ద్వారా ప్రయత్నిస్తోంది. గతంలో అమెరికాతో అణు ఒప్పందాన్ని ఏ మీడియా అయితే బాహాటంగా సమర్ధించిందో అదే మీడియా ఇప్పుడు భారత్‌ను చైనాకు దూరం చేసి, అమెరికాకు మరింత దగ్గరకి చేర్చాలని తహతహలాడుతోంది. సరిహద్దుల్లో లేని ఉద్రిక్తతలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న అరుణ్ శౌరీ వంటి ప్రబుద్ధులు, బిజెపి/ఆరెస్సెస్ నాయకులు, కొందరు మాజీ సైనికాధికారులు ఈ బాపతు అంతా బయటకు దేశ భక్తులుగా పోజు పెడుతూ ప్రతిదానిని కమ్యూనిస్టు వ్యతిరేక కళ్ళద్దాలలో చూస్తారు. తద్వారా అమెరికా ప్రయోజనాలను పరిరక్షిస్తుంటారు. వీరి అసలు స్వరూపమేమిటో తెహల్కా కుంభకోణంలో నగంగా బయటపడింది. ఇప్పుడు భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం వెనక అమెరికా ఆయుధ వ్యాపారుల ప్రయోజనాలు కూడా దాగివున్నాయి.
పాకిస్తాన్‌ను బూచిగా చూపి భారత్‌కు, భారత్‌ను శత్రువుగా చూపి పాకిస్తాన్‌కు ఆయుధాలు అమ్ముకున్న అమెరికా ఇప్పుడు చైనానుంచి భారత దేశ భద్రతకు ప్రమాదం ముంచుకొస్తోందన్న భయానక వాతావరణాన్ని సృష్టించి భారత ఆయుధాల కొనుగోళ్ల బడ్జెట్‌ను మరింత పెంచేలా ఒత్తిడి తీసుకురావాలన్ని చూస్తున్నది. అమెరికానుంచి పెద్దయెత్తున ఆయుధాలు కొనుగోలు చేసుకుంటున్న దేశంగా భారత్ ఇప్పటికే పేరొందింది. జిడిపి లో 7 శాతం వరకు రక్షణ వ్యయానికి భారత్ వెచ్చిస్తోంది. ఈ సంవత్సరం 600 కోట్ల డాలర్లను ఆయుధాల కొనుగోలుకు భారత ప్రభుత్వం వెచ్చించింది. ఆయుధాల అమ్మకాలను పెంచుకోవాలంటే ఇటువంటి ఉద్రిక్తతలు సృష్టించడం అమెరికాకు చాలా అవసరం. అదే సమయంలో చైనాను బూచిగా చూపడం ద్వారా భారత్ అమెరికా వ్యూహాత్మకమైత్రి సరైనదేనన్న భావన కలిగించాలని చూస్తోంది. భారత ప్రజలు దీనినంతటినీ గమనిస్తున్నారు. గనుక మీడియా ఇప్పటికైనా ఇటువంటి కట్టుకథలకు స్వస్తి చెప్పి తమ మధ్య సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న భారత్, చైనా ప్రభుత్వాల సంకల్పానికి చేతనైతే సహకరించాలి. అంతేకానీ, ఇటువంటి అసత్య ప్రచారంతో వాతావరణం కలుషితం చేయొద్దు.

ఎవరి కోసం ఈ యుద్ధోన్మాదం ?
ప్రభుత్వ నిధులను భోంచేస్తూ, మాజీ ఉన్నతాధికారుల సారథ్యంలో నడుస్తున్న సంస్థలు కూడా ఈ రకమైన ఉన్మాదాన్ని రెచ్చగొట్టటంలో తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. ఎంత విచారకరం! ఇటీవల సర్కారీ సంస్ధ ఒకటి తను నడిపే పత్రికలో అరుణ్‌శౌరి వ్యాసాన్నొకదానిని ప్రచురించింది. చైనాను శత్రువుగా తప్ప మరో రకంగా చూసే గుణమే ఈయనకు లేదు. ఉద్యోగ విరమణ చేసిన సైనికాధిóకారులు కొందరు ఈ మేధావుల సరసన చేరి ప్రసారమాధ్యమాన్ని వేదికగా చేసుకుని ప్రస్తుత దుష్ప్రచారానికి మహోత్సాహంతో తోడ్పడుతున్నారు.
1913లో ఎవరు లాభపడతారు? అన్న శీర్షికన వ్లదిమీర్ లెనిన్ సుప్రసిద్ధ వ్యాసాన్ని ప్రావ్దా పత్రిక ప్రచురించింది. ''నిర్దిష్టమైన ప్రతిపాదనల్ని, చర్యల్ని, ఇతరత్రా అంశాలను ఏ రాజకీయ లేదా సామాజిక బృందాలు, శక్తులు లేదా కూటములు ముందుకు తెస్తున్నాయో వెనువెంటనే బహిర్గతం కానప్పుడు, ఎవరైనాగాని వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే, లాభం పొందేదెవరు? అన్నదే.......ఒకానొక ప్రత్యేకత కలిగిన అభిప్రాయాలను ఎవరు నేరుగా వ్యక్తం చేశారా అన్నది ముఖ్యం కాదు. ఈ అభిప్రాయాలు, ప్రతిపాదనలు, చర్యల ద్వారా ఎవరు లాభపడతారన్నదే' ప్రధానం'. భారత్, చైనా సంబంధాల గురించి ఇటీవలి కాలంలో రకరకాల కట్టుకథలు ప్రచారంలోకి వచ్చాయి. యుద్ధోన్మాదాన్నీ, పొరుగు దేశంపట్ల విద్వేషాన్నీ రెచ్చగొట్టటమే ఈ ప్రచారోద్దేశం. ఇలాంటి విపరీత ప్రచారం ద్వారా భారత్‌కుగానీ, చైనాకుగానీ ఒరిగేదేవిూ ఉండదనేది స్పష్టం. ఏమాత్రం స్థిరత్వంలేని ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో అభివృద్ధి, పెరుగుదలకు సంబంధించి తమవైన మార్గాలలో ఆసియాలోని ఈ రెండు దేశాలు ముందుకు సాగిపోతున్నాయి. అంతేగాక, ఇటు భారత్‌గానీ లేదా అటు చైనా గానీ తాము ఎంపిక చేసుకున్న జాతీయ అభివృద్ధి విధానాల నుంచి వైదొలగలేదు. యుద్ధమే సంభవిస్తే ఉభయ దేశాల కీలక ప్రయోజనాలకు ఎనలేని నష్టం వాటిల్లుతుంది. అయినప్పటికీ మన కార్పొరేట్ ప్రసారమాధ్యమం అలుపూసలుపూ లేకుండా యుద్ధభేరీలను మోగిస్తూనే ఉన్నది. యుద్ధం తథ్యం అంటూ అనేక కట్టుకథలను ప్రచారంలో పెడుతున్నది.
ఇలాంటి బాధ్యతారహితమైన ప్రవర్తనకు కేవలం ప్రసార మాధ్యమానికి చెందిన వారినే నిందించాల్సిన అవసరం లేదు. ప్రేతాత్మలను ఆవాహన చేయడంలోనూ, సైతానును స్మరించడంలోనూ వారికున్న శక్తియుక్తులు మనకు తెలుసు. వారు క్షణికమైన ఊహా ప్రపంచంలో విహరిస్తున్నారు. తమ ఉనికిని కాపాడుకునేందుకు వారి భాండాగారంలో జనులను ఆకర్షించే రకరకాల కుయుక్తులు ఉన్నాయి. ప్రభుత్వ నిధులను భోంచేస్తూ, మాజీ ఉన్నతాధికారుల సారథ్యంలో నడుస్తున్న సంస్థలు కూడా ఈ రకమైన ఉన్మాదాన్ని రెచ్చగొట్టటంలో తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. ఎంత విచారకరం! ఇటీవల సర్కారీ సంస్ధ ఒకటి తను నడిపే పత్రికలో అరుణ్‌శౌరి వ్యాసాన్నొకదానిని ప్రచురించింది. చైనాను శత్రువుగా తప్ప మరో రకంగా చూసే గుణమే ఈయనకు లేదు. ఉద్యోగ విరమణ చేసిన సైనికాధిóకారులు కొందరు ఈ మేధావుల సరసన చేరి ప్రసారమాధ్యమాన్ని వేదికగా చేసుకుని ప్రస్తుత దుష్ప్రచారానికి మహోత్సాహంతో తోడ్పడుతున్నారు. కనుక, మన జాతీయ భద్రతా సలహాదారు వలె బాధ్యతనంతా ప్రసారమాధ్యమంపై నెట్టివేయకుండా మరింత లోతుగా ఈ విషయాన్ని పరిశీలిద్దాము. ప్రభుత్వం కూడా తన ఇంటిని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. కాస్త వివరంగా చెప్పుకోవాలంటే మూడు తరహాలకు చెందినవారు యుద్ధోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. విదేశాంగ, రక్షణ విధానాలకు సంబంధించిన పాత ముఖాలను గుర్తుపట్టటం కష్టమేమీ కాదు. వీరు మొదటి కోవకు చెందుతారు. చైనా ప్రమాదం అంతకంతకూ పెరుగుతుందన్న వీరి నమ్మకం తిరుగులేనిది. ఇలాంటి పరిస్థితిలో అమెరికావైపు చేరడం మినహా భారత్‌కు మరో మార్గాంతరం లేదన్నది వీరి వాదన. దేశంలోనూ, విదేశాలలోనూ భారత ప్రభుత్వ అధికారులుగా వివిధ స్ధాయిలలో పనిచేసిన వీరు మేధావులు, ఆధునికులు, స్పష్టతగలిగిన వారు. చైనాకు వ్యతిరేకంగా ''టిబెట్ తురుపుముక్క''ను భారత్ ఉపయోగించాలన్న వారి వాదన సహజంగానే ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఇలా చెప్పేవారు తమను తాము 'వాస్తవిక వాదులమని' చెప్పుకుంటారు. కాని టిబెట్ విషయాన్ని చూపి చైనాపై ఒత్తిడి తీసుకురాగలమని భావించటం అమాయకత్వమే అవుతుంది. ఒకవేళ చైనా కూడా ఇదేతరహాలో చిల్లరమల్లర తురుపు ముక్కలను ఉపయోగిస్తే అప్పుడు ఈ ఆట కాస్తా వికటిస్తుంది. టిబెట్ కల్లోలం మొదలైన గత రెండు సంవత్సరాలలో వెలువడిన పది పన్నెండు వ్యాసాలకు సమాధానంగా వచ్చిన భారత్ 'విచ్ఛిన్నం' అన్న చైనీయుని వ్యాసం ఎంత గందరగోళాన్ని సృష్టించిందీ మనకు తెలుసు.
రెండవ విషయం మరొకటి ఉన్నది. పౌర నాయకత్వం చైనా ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేస్తున్నదని, ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు మన సైనిక బలగాలకు పెద్దయెత్తున ఆర్థిక, భౌతిక వనరులను అందుబాటులో ఉంచాలంటూ సైనికాధికారులుగా ఉద్యోగ విరమణ చేసిన కొంతమంది ఉత్సాహపరులు చెప్తున్నారు. మొత్తం సైనిక దళాలన్నీ కార్పొరేట్ ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. భారతదేశం విషయానికివస్తే జిడిపీలో 7 శాతం రక్షణ బడ్జెట్‌కు పోతున్నది. తిండికీ, తుపాకీకి మధ్య వనరుల పంపకంపై ప్రాచీన కాలం నుంచీ వివాదం సాగుతున్నది. అయినా రక్షణ బడ్జెట్ అతిగా ఉంటున్నదని భారతీయులు ఏనాడూ ఆక్షేపించలేదు. అమెరికా నుంచి ఆయుధాలు కొనాలంటూ సైనికదళాలలో ప్రచారం సాగటం కలవరపరిచే విషయం. ఇలాంటి పరిస్థితిలో అమెరికన్ ఆయుధ బేహారులు ఈ దేశంలోని తమ ఖాతాదారులపై మత్తుమందు చల్లటంలో వింతేమున్నది? మూడవదేమంటే, మనకు మితవాద హిందూత్వ జాతీయవాదులున్నారు. జాతీయ భద్రతకు తమను తాము సంరక్షకులుగా ప్రకటించుకునే ఈ బాపతు భారతదేశం అగ్రరాజ్యంగా ఎదగకపోవడానికి చైనానే అడ్డుపడుతోందని వాదిస్తారు. ప్రపంచ రాజకీయాలలో అగ్రరాజ్యాధిపత్యం అంతరించి పోయిందన్న స్పృహ వీరిలో బొత్తిగా కొరవడింది. వీరు ఎప్పుడూ రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతుంటారు. ఇదొక సమస్య. గత ఏడాది ఆరెస్సెస్‌తో చైనా ఒక అవగాహనకు వచ్చింది. ఆరెస్సెస్‌కు చెందిన సీనియర్ నాయకునికి బీజింగ్ ఆతిథ్యం ఇచ్చింది. పాలక పార్టీకన్నా వారు ఒకటి రెండు పాయింట్లు ఎక్కువే సాధించారని దీనిని బట్టి చెప్పవచ్చు. చైనా 'దుష్టపన్నాగాల' గురించి ప్రచారం చేయటంలో పైన తెలిపిన మూడు రకాలవారు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. త్వరలోనే యుద్ధం రాగలదని, భారతదేశం తన రక్షణ సామర్ధ్యాన్ని పెంచుకోవటానికి తగినంత సమయం లేదని వారు నమ్మబలుకుతున్నారు. అత్యాధునికమైన 126 యుద్ధ విమానాల కొనుగోలుతో సహా అపరిష్కృతంగా వున్న ఆయుధ సేకరణ అంశాలపై ప్రభుత్వం సత్వరమే నిర్ణయం తీసుకోవాలని వీరు కోరుతున్నారు.ఈ విషాదభరిత హాస్య నాటకం అంతం లేకుండా కొనసాగుతుండడంతో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ జోక్యం చేసుకుని వీరి యుద్ధోన్మాదంపై చన్నీళ్ళు చల్లారు. చైనా సరిహద్దులో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నదంటూ ఆర్మీ ప్రధానాధిపతి దీపక్ కపూర్ ప్రకటించారు. రకరకాలుగా చెవులు కొరుక్కుంటున్న తమ వారిని సైనిక ప్రధానాధికారి అదుపు చేయాల్సి ఉంటుంది. ప్రసారమాధ్యమానికి ఉప్పందించటం ద్వారా ఉత్తుత్తి యుద్ధాలు చేసే అలవాటు అమెరికన్ కమాండర్లకు బాగా ఉన్నది. కాని భారతీయులమైన మనకు ఈ కుటిల సంస్కృతిని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు.
వాస్తవానికి, భారత్-చైనా సంబంధాలు ఇటీవలి సంవత్సరాలలో నిలకడగా విస్తరిస్తుండటంతోపాటు, పరిణతి చెందుతున్నాయి. ఎప్పటికప్పుడు ఉన్నతస్ధాయిలో రాజకీయ అభిప్రాయాల మార్పిడి, అంతకంతకూ వృద్ధి చెందుతున్న వాణిజ్య సంబంధాలు, సరికొత్త వ్యూహాత్మక చర్చలు, సైనిక సహకారం తదితర అంశాలు ఉభయ దేశాల మధ్య సాన్నిహిత్యాన్నీ, విశ్వాసాన్నీ పెంపొందించాయి. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవటానికి ఈ వాతావరణం చక్కని భూమికగా ఉపయోగపడనున్నది. రష్యా-చైనాల మధ్య సాధారణ పరిస్థితి నెలకొనటానికి కూడా ఈ పద్ధతే ఉపయోగపడింది. చైనాతో భారత్‌కున్న సంక్లిష్ట సంబంధాలను కొనసాగించటానికిగాను యుపిఏ ప్రభుత్వం చేపట్టిన దానికన్నా ఉత్తమమైన విధానం మరొకటి లేదు. ప్రధానమైన మరో అంశమేమిటంటే, ఈనాడు భారత్ అనుసరిస్తున్న చైనా విధానం అత్యున్నతస్ధాయిలో చేపట్టినది. విదేశాంగ కార్యదర్శిగావున్న నిరుపమా రావు అత్యుత్తమ దౌత్యవేత్త, చైనా వ్యవహారాలలో ఎంతో నైపుణ్యం గడించిన వారు. ఇంతకన్నా మంచి వ్యక్తిని రాజకీయ నాయకత్వం సంపాదించలేదు. అయితే సమస్య ఎక్కడ ఉన్నది? భారత్-చైనాల మధ్యవున్న సుహృద్భావ సంబంధాలు దెబ్బతినడం వల్ల ఎవరు లాభపడతారు? ఈ సందర్భంగా ఒక్క మాట గుర్తు చేయాలి. ప్రపంచంలోనే చైనా రెండవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్నది. సమీప భవిష్యత్‌లో భారతదేశం మూడవ స్థానాన్ని ఆక్రమించే సూచనలు ఉన్నాయి. వ్యూహాత్మక రీత్యా చూసినపుడు అత్యంత కీలకమైన అంశాలలో, అంటే, వాతావరణ మార్పులు, దోహ దఫా చర్చలు, మతపరమైన తీవ్రవాదం, ఉగ్రవాదం వంటివాటిల్లో ఉభయ దేశాలు ఉమ్మడిగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. దీని ప్రభావం ఆసియాపై బలంగా ఉంటుంది. వాస్తవానికి కొన్ని విషయాలలో ఈ పరిణామం ఇప్పటికే మొదలైంది. ఈ పరిణామం కారణంగా ప్రపంచ రాజకీయ రంగం తూర్పు వైపు మారే అవకాశం ఉండటంతో పాశ్చాత్య దేశాలు కలవరపడుతున్నాయి. వాస్తవానికి భారతదేశంపై దండెత్తటం వల్ల చైనా బావుకునేదేమీ ఉండదు. పైగా నష్టమే ఎక్కువ. ఆర్థికాభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగాలన్న దాని విధానాలకు విఘాతం కలుగుతుంది. అంతేకాక, అంతర్జాతీయంగా బాధ్యతాయుత శక్తిగావున్న ప్రతిష్టకు భంగం వాటిల్లుతుంది. పొరుగు దేశాలతో చైనా స్నేహ సంబంధాలు సమతూకంతో ఉన్నాయని మయన్మార్ వ్యవహారాన్ని చూస్తే అర్థమవుతుంది. భారత మాత కంఠానికి ''ముత్యాల ఉరితాడు''ను చైనా సిద్ధం చేస్తున్నదంటూ అమెరికాకు చెందిన ఓ అపరిపక్వ వయస్కురాలు చేసిన నిర్ధారణలనే మన దేశంలోని మేధావులు పదేపదే వల్లిస్తున్నారు. చివరిగా మరొక ముఖ్యమైన విషయాన్ని చెప్పుకోవాలి. అదేమంటే, చైనా చాలా మెలకువతో వ్యవహరిస్తున్నది. పాకిస్తాన్‌ను కీలక పొత్తుదారుగా చేసుకుని మన ప్రాంతంలో శాశ్వతంగా తిష్టవేయాలనే అమెరికా పన్నాగం నుండి ఈ యుద్ధోన్మాదం ప్రజల దృష్టిని మళ్ళిస్తున్నది. ఆప్ఘనిస్ధాన్, ఉగ్రవాదం వంటి విషయాలపై రష్యా, భారత్, చైనాలు ఉమ్మడి వైఖరిని తీసుకోవాలన్న ఆలోచనను ఇది అస్థిరపరుస్తున్నది. బయటిదేశం నుంచి ముప్పు ఉందని చూపినట్లైతే అంతిమంగా అది అమెరికాతో భారత్ సైనిక సహకార విస్తృతికి ప్రాతిపదికగా ఉపయోగపడుతుంది. లెనిన్ మహాశయుడు ఈ పరమ సత్యాన్ని ఎంత చక్కగా చెప్పాడు!
Note:Article took from Prajasakthi paper written by BadraKumar

ప్రపంచబ్యాంకు ఉచ్చులో ప్రభుత్వరంగ బ్యాంకులు
ఫైనాన్స్ రంగంలో ఎలాంటి సంస్కరణలు ప్రవేశపెట్టాలో సిఫార్సు చేసేందుకు ప్రభుత్వం రఘురాం రాజన్ కమిటీని, పెర్సీ మిస్ట్రీ కమిటీని నియమించింది. ఫైనాన్స్‌రగంలో తలపెట్టే మార్పులకు చొరవ తీసుకోవలసింది రిజర్వుబ్యాంకు. కాని ఇక్కడ ప్రభుత్వమే అలాంటి కమిటీలను నియమించింది. ఈ కమిటీ నేతలు, సభ్యులు అంతా ప్రపంచ బ్యాంకు ఆదేశిత సరళీకృత ఆర్ధిక విధానాలకు నమ్మిన బంటు లాంటి వారు. అందుచేతనే రూపాయి మారకం రేటు తీవ్రమైన ఆటుపోట్లకు గురికాకుండా రిజర్వు బ్యాంకు తీసుకునే చర్యలు స్వేచ్ఛామార్కెట్ విధానాలకు విరుద్ధమైనవన్న విమర్శలతోనే రఘురాం రాజన్ కమిటీ సిఫార్సులు మొదలయ్యాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రాధాన్యతా రంగాలకు ఇచ్చే రుణాలను రఘురాం కమిటీ తీవ్రంగా విమర్శించింది. గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు అసమర్ధమైనవని,వాటి స్థానంలో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల తరహాలో నడిచే లోకల్ ఏరియా బ్యాంకులను ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులను, దేశ విదేశీ ప్రైవేటు రంగ బ్యాంకులను సమాన స్థాయిలో పోటీ పడే అవకాశం కల్పించాలనే పేరుతో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలను విక్రయించాలని కూడ సిఫార్సు చేసింది.
భారత ప్రభుత్వరంగ బ్యాంకుల పెట్టుబడి పునాది పెంపుకోసం 200కోట్ల డాలర్ల రుణాన్ని అందిస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు మంగళవారం నాడు అధికారికంగా ప్రకటించింది. దీనితో ఇప్పటిదాకా చర్చల దశలోనే ఉన్నాయని భావిస్తున్న వివాదాస్పద రుణ ప్రతిపాదనలు వాస్తవ రూపం దాల్చినట్లయింది. ఈ రుణానికి సంబంధించిన వివరాలను కూడ ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ఈ ఒక్కటే కాకుండా ఇప్పుడు ప్రపంచ బ్యాంకు మొత్తం 430కోట్ల డాలర్లమేర నాలుగు రుణాలను భారత దేశానికి అందిస్తున్నది. బ్యాంకులతో పాటు, మౌలిక సదుపాయాల కల్పనను మెరుగు పరిచేందుకు వీటిని ప్రపంచ బ్యాంకు మంజూరు చేసింది. నిజానికి ఇది 2012 లోగా భారత దేశానికి ఇవ్వతలపెట్టిన 1400కోట్ల డాలర్ల భారీ రుణంలో ఒక భాగం మాత్రమే. ప్రస్తుత నాలుగు రుణాలు పారిశ్రామిక సంస్థలు అధిక రుణాలు పొందేలా చేయడం ద్వారాను, మౌలిక సదుపాయరంగంలో పెట్టుబడులు పెంచడం ద్వారాను భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఉపయోగపడతాయని ఈ రుణాల వివరాలను ప్రకటిస్తూ ప్రపంచ బ్యాంకు భారత దేశ డైరెక్టరు రాబర్టో జాఘా చెప్పారు. ప్రపంచ ఆర్థిక వాతావరణంలో ఏర్పడిన ప్రతికూల పరిణామాలను తట్టుకోవడానికి భారత ప్రభుత్వం విస్తృతమైన ఆర్థిక ఉద్దీపన చర్యల ద్వారా త్వరితంగా కదిలిందని ఈ రుణాల గురించి వివరిస్తూ విడుదల చేసిన ప్రకటనలో ప్రపంచబ్యాంకు ప్రశంసించింది. ఈ ఉద్దీపన పథకంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు మద్దతు అందించడం ఒక ప్రధానాంశం అని పేర్కొంది. అనేక సంపన్న దేశాలలోను, త్వరితంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలోను బ్యాంకుల రుణవితరణకు పెట్టుబడుల కొరత వల్ల ఆటంకం కలిగిందని, అలాంటి ఆటంకం భారత దేశం విషయంలో కలగరాదనే ఉద్దేశంతోనే ఈ రుణాన్ని అందిస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు చెప్పింది. 2009-11 మధ్య కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకుల పెట్టుబడి పునాది పెంచడానికి మొత్తం 480కోట్ల డాలర్లు అవసరమవుతాయని భారత ప్రభుత్వ అంచనాఅని తెలిపిన ప్రపంచ బ్యాంకు, భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఇప్పుడు తాను ఈ 200కోట్ల డాలర్ల రుణాన్ని అందిస్తున్నట్లు చెప్పింది. ఇంకో ఏడాదిలో మరో వందకోట్ల డాలర్ల రుణం అందుతుందని కూడ తెలిపింది. ప్రపంచ బ్యాంకు రుణం కాబట్టి షరతులు ఏమిటి అన్న సందేహం సహజంగానే కలుగుతుంది. ఇది అభివృద్ధి విధాన రుణం (డిపిఎల్) అని, భారత ప్రభుత్వానికి బడ్జెట్ మద్దతు రూపంలో అందిస్తున్నానని, దాన్ని ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకుల పెట్టుబడుల పెంపుకు ఉపయోగిస్తున్నదని-అందుచేత ఈ రుణం మూలంగా ప్రభుత్వరంగ బ్యాంకులు ఎలాంటి షరతులు అమలుచేయనవసరం లేదని ప్రపంచ బ్యాంకు చెప్పింది.
అయితే భారత ప్రభుత్వం తగువిధమైన స్థూల ఆర్థిక విధానాలను అనుసరించాల్సి ఉంటుందని, ఆర్థికాభివృద్ధి, పేదరిక నిర్మూలనకు సంబంధించిన సమర్ధవంతమైన మధ్యకాలిక విధానాన్ని అనుసరించాలని తెలిపింది. సంతృప్తికరమైన ప్రభుత్వ ద్రవ్య నిర్వహణ పద్ధతులను అనుసరించాలని కూడ చెప్పింది. ఇలాంటి చర్యలను డిపిఎల్ రుణం తీసుకున్న ప్రతిదేశం చేపట్టాల్సి ఉంటుందని, దీనిలో భారత దేశానికని ప్రత్యేకంగా ఏమీ లేవని పేర్కొంది. బ్యాంకులు అమలుచేసినా, ప్రభుత్వం అమలుచేసినా ఈ రుణం షరతులేమీ లేనిది కాదని స్పష్టమవుతుంది. నిజానికి ప్రభుత్వమే తాను నేరుగా అమలుచేయడానికి జంకుతున్న అనేక ఫైనాన్స్ రంగ సంస్కరణలను ఈ రూపంలో తీసుకు రావడానికి ప్రపంచ బ్యాంకు రుణాన్ని వినియోగిం చుకుంటోందన్న అనుమానం కలుగుతుంది. ఫైనాన్స్ రంగంలో ఎలాంటి సంస్కరణలు ప్రవేశపెట్టాలో సిఫార్సు చేసేందుకు ప్రభుత్వం రఘురాం రాజన్ కమిటీని, పెర్సీ మిస్ట్రీ కమిటీని నియ మించింది. ఫైనాన్స్‌రగంలో తలపెట్టే మార్పులకుచొరవ తీసుకో వలసింది రిజర్వుబ్యాంకు. కాని ఇక్కడ ప్రభుత్వమే అలాంటి కమిటీలను నియమించింది. ఈ కమిటీ నేతలు, సభ్యులు అంతా ప్రపంచ బ్యాంకు ఆదేశిత సరళీకృత ఆర్ధిక విధానాలకు నమ్మిన బంటు లాంటి వారు. అందుచేతనే రూపాయి మారకం రేటు తీవ్రమైన ఆటుపోట్లకు గురికాకుండా రిజర్వు బ్యాంకు తీసుకునే చర్యలు స్వేచ్ఛామార్కెట్ విధానాలకు విరుద్ధమైనవన్న విమర్శలతోనే రఘురాం రాజన్ కమిటీ సిఫార్సులు మొదలయ్యాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రాధాన్యతా రంగాలకు ఇచ్చే రుణాలను రఘురాం కమిటీ తీవ్రంగా విమర్శించింది. గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు అసమర్ధమైనవని, వాటి స్థానంలో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల తరహాలో నడిచే లోకల్ ఏరియా బ్యాంకులను ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులను, దేశ విదేశీ ప్రైవేటు రంగ బ్యాంకులను సమాన స్థాయిలో పోటీ పడే అవకాశం కల్పించాలనే పేరుతో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలను విక్రయించాలని కూడ సిఫార్సు చేసింది. ఈ రకమైన సిఫార్సులను ప్రభుత్వం నేరుగా అమలుచేయడానికి సాహసించలేదు. ప్రత్యేకించి యుపిఏ-1 హయాంలో వామపక్షాల భయంతో ఆ పనికి పూనుకోలేదు. ఇప్పుడు కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అన్న రీతిలో ప్రపంచ బ్యాంకు రుణానికి పాల్పడింది.
ప్రభుత్వరంగ బ్యాంకులలో పెట్టుబడుల పునాదిని పెంచాల్సిన అవసరం ఇప్పుడు ఎంత మాత్రం లేదు. బేసెల్-2 నిబంధనల ప్రకారం పెట్టుబడి సమృద్ధి (క్యాపిటల్ ఎడికెసీ) నిష్పత్తి 9 శాతం ఉండాలి. కాని మన బ్యాంకుల్లో అది 12 శాతానికి మించి ఉంది. ఇంకా కచ్చితంగా చెప్పుకోవాలంటే క్యాపిటల్ ఎడికెసీ నిష్పత్తి 2007 మార్చి నాటికి 12.3 శాతం, 2008 మార్చి నాటికి 13 శాతం ఉండగా, 2009 మార్చి నాటికి మరింతగా పెరిగి 13.2 శాతానికి చేరుకుంది. ఈ నిష్పత్తి కేవలం ఒక పాత తరహా ప్రైవేటు బ్యాంకులో 9 శాతం, ఒక విదేశీ బ్యాంకులో 10 శాతం ఉంది. మిగతా అన్ని బ్యాంకుల్లోను ఇది అంత కన్నా ఎక్కువగానే ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకులను విడిగా తీసుకున్నపుడు 2008 మార్చినాటికి క్యాపిటల్ ఎడికేసీ రేషియో 12.5 శాతంగా ఉంది. ఒక వైపున ప్రపంచ ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతున్న సమయంలో భారత ప్రభుత్వ రంగ బ్యాంకుల పెట్టుబడి పునాది పెరుగుతూ ఉండటాన్ని గమనిస్తాము. అందుచేత ప్రపంచ బ్యాంకు చెబుతున్నట్లు ప్రపంచ ఆర్ధిక సంక్షోభం పర్యవసానాలను తట్టుకోవడానికి అవసరమైన రుణాలు అందించే సామర్ధ్యాన్ని బ్యాంకులకు కల్గించేందుకు ఇలాంటి రుణం అవసరమని ఎంత మాత్రం భావించజాలం.పెట్టుబడి పునాదిని పెంచడం నిజంగానే ఒక సమస్య అయినా, దానిని సమకూర్చుకోవడానికి ప్రపంచబ్యాంకు రుణం పరిష్కారం కాదు. ఈ విషయంలో చైనాను ఆదర్శంగా తీసుకోవచ్చు. చైనా తన మూడు అతి పెద్ద బ్యాంకులకు పెట్టుబడి పునాదిని విశిష్టమైన రీతిలో పెంచుకున్నది. ఇండిస్టియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, ది బ్యాంక్ ఆఫ్ చైనా, చైనా కన్‌స్ట్రక్షన్ బ్యాంక్‌ల పెట్టుబడులను ఒకే దఫాగా పెంచేసింది. ఇటీవలనే 2008 నవంబరులో అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా పెట్టుబడిని కూడ పెంచింది. దీనికోసం కాస్త కూస్తో కాదు 40 బిలియన్ డాలర్లను వెచ్చించింది. ఇదంతా దానికి ఎక్కడి నుండి వచ్చింది అని ఆశ్చర్యం కలగవచ్చు. తన అపారమైన విదేశీ మారక నిల్వలనుండి కావలసిన మొత్తాన్ని కేటాయించింది. ప్రభుత్వరంగ ఆధ్వర్యంలోనే సెంట్రల్ హుజిన్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ అనే దానిని ఏర్పాటు చేసి వాణిజ్య బ్యాంకుల్లో ఈక్విటీ పెట్టుబడులను కలిగి ఉండే అధికారాన్ని కల్పించింది. అవసరమైన మొత్తంలో విదేశీ మారక నిల్వలను ఈ ప్రభుత్వరంగ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థకు బదలాయించింది. ఫలితంగా బ్యాంకులు తమ ఈక్విటీని ఈ సంస్థకు విక్రయించడం ద్వారా అవసరమైన పెట్టుబడులు పొందాయి. బదిలీ అయిన ఈక్విటీ ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలోనే ఉంది కాబట్టి బ్యాంకులపై ప్రభుత్వ ఆధీనానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. చైనా ప్రభుత్వం నాలుగు వేలకోట్ల డాలర్ల భారీ మొత్తాన్ని బ్యాంకులపై తన ఆధిపత్యానికి ఎలాంటి భంగం కలగని రీతిలో సమకూర్చుకుంటే, భారత ప్రభుత్వం కేవలం 300కోట్ల డాలర్ల కోసం (అది కూడ రెండు దఫాలుగా) ప్రపంచ బ్యాంకును దేబిరించింది. చైనా మాదిరి వ్యవహరించడానికి మనకూ అవకాశాలు దండిగా ఉన్నాయి. మన వద్ద ఉన్న 26వేల 500కోట్ల బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వల్లో ఈ 300కోట్ల డాలర్లు ఒక మొత్తమే కాదు. అయినా భారత ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నదంటే దాని ఉద్దేశాల పట్ల కచ్చితంగా సందేహం కలుగుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ స్వతంత్రంగా నిలబడటానికి వెన్నుదన్నుగా నిలిచిన ప్రభుత్వరంగ బ్యాంకులను దెబ్బతీయడానికి మాత్రమే ఈ చర్య దోహదపడుతుంది.

Subscribe to:
Comments (Atom)