మన పత్రికల్లోనూ, టివీ చానళ్లలోనూ ఇటీవల చైనా నుండి మనకు పెద్ద ప్రమాదం వస్తున్నదనే ప్రచారం ఊపందుకున్నది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, లడక్ సరిహద్దుల్లో అనేక చోట్ల చైనా సైన్యాలు సరిహద్దులు దాటి భారత్ లోకి చొరబడుతున్నాయన్న వార్తలు మీడి యాలో ముప్పిరిగొంటున్నాయి. విశేషమే మంటే ఇటు భారత ప్రభుత్వమూ, భారత సైన్యంలోని ఉన్నతాధికారులూ, అటు చైనా అధికారులూ ఈ వార్తలను ఖండిస్తున్నా ఇటు వంటి వార్తలు రావడం ఆగడం లేదు. నిప్పు లేకుండా పొగరాదంటారు. కాని మన మీడి యాలో మాత్రం నిప్పులేకుండానే పొగవ స్తోంది. సెప్టెంబర్ రెండో వారంలో సిక్కింలోకి చొచ్చుకు వచ్చిన చైనా సైన్యానికీ, భారత్ టిబెట్ సరిహద్దు భద్రతా దళాలకూ (ఐటిబిపి) మధ్య కాల్పులు జరిగాయినీ, కాల్పుల్లో ఇద్దరు ఐటిబిపి జవాన్లు గాయపడ్డా రని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ఒక వార్త వచ్చింది. వెను వెంటనే 'టైమ్స్ నౌ' ఛానల్ ఒక ప్రత్యేక స్టోరీ ప్రసారం చేసింది.
దాంతో ఇతర పత్రికలూ, చానళ్లూ వార్తా కథనాలూ, విశ్లేషణలూ అందు కున్నాయి. కాని అటువంటి కాల్పులు జరగడం గాని, భారతీయ జవాన్లు గాయపడడం గాని జరగలేదని భారత సైనికాధికారులు, విదే శాంగ శాఖ మంత్రి కూడా ప్రకటించారు. అంతేకాదు గౌహతి, కొల్‌కొతా నుండి ఈ తప్పుడు వార్తలు ఇచ్చిన విలేకరులపై సరిహద్దు భద్రతా అధికారుల కేసులు పెట్టారు. వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నట్లు హౌమ్‌శాఖ కూడా ప్రకటించింది. హౌమ్ శాఖ, విదేశాంగ శాఖ అధికారులు, ఉన్నత స్థాయి సైనికాధికారులు పదేపదే ఈ వార్తలను ఖండించిన తరువాతగాని పరిస్థితి కొంతమేరకు సద్దుమణగలేదు. భారత్-చైనా సంబంధాలు గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత పటిష్టంగా, సుహ్రుద్భావంగా ఉన్న తరుణంలో ఇటువంటి వస్తున్నాయని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సిద్ధార్ధ వరదరాజన్ పేర్కొన్నారు.
భారత దేశం బయటివారు ఎవరైనా ఈ వార్తలు చూస్తే రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చేస్తోందని అనుకుం టారు అని బిబిసి హిందీ బ్యూరో ఎడిటర్ అమిత్ బారువా రాశారు. నిజంగానే చైనా నుండి చొరబాట్లు జరిగితే భారత ప్రభుత్వం వాటిని ధీటుగా ఎదుర్కొనాలి. అలాగే మన సరిహద్దులను శత్రు దుర్భేద్యంగా ఉంచడానికి సకల చర్యలూ తీసుకోవాలి. కాని అటువంటి ఘటనలేవీ జరగడం లేదని ప్రభుత్వ నేతలూ, ఉన్నత సైనికాధికారులూ ప్రకటిస్తున్నా పదేపదే ఇటువంటి ప్రచారం ముందుకు రావడమే నేటి విశేషం.
మీడియా అత్యుత్సాహమా?
అకస్మాత్తుగా దేశంలో ఇటువంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి? ఎవరు పుట్టిస్తున్నారు? ఇదంతా మీడియా అత్యుత్సాహమనీ, రేటింగ్స్ పెంచుకోడానికి సంచలనాత్మకవార్తలకోసం జరుగుతున్న పోటీవల్ల ఇలా అవుతోందనీ కొందరంటున్నారు. మీడియా అత్యుత్సాహం, సంచలనాలకోసం దాని తాపత్రయం కొంతమే రకు కారణం కావచ్చు కాని పనిగట్టుకుని జరుగు తున్న 'చైనాచొరబాటు' ప్రచారం వెనుక మీడియా అత్యుత్సాహానికి మించిన అనేక కారణాలు న్నాయని పరిశీలకులు చెబుతున్నారు. సరిగ్గా ఇదే కాలంలో మన దేశంలో జరిగిన మరికొన్ని పరిణామాలును పరిశీలిస్తే ఈ ప్రచారం ఎవరు, ఎందుకు చేస్తున్నారో అర్ధం చేసుకోడానిక తోడ్ప డతాయి.
హైడ్రొజన్ బాంబు వివాదం
1998లో బిజెపి నాయకత్వంలోని ప్రభు త్వం రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో వరుసగా జరిపిన అణుపరీక్షల్లో హైడ్రొజన్ బాంబు పరీక్ష విఫలమయిందని పోఖ్రాన్-2లో రక్షణ పరిశో ధనా సంస్థ (డిఆర్‌డిఓ) తరఫున పాల్గొన్న శాస్త్ర వేత్త కె. సంతానం ఆగస్టు 16న ప్రకటించారు. హైడ్రొజన్ బాంబు పరీక్షలో అనుకున్న శక్తి ఉద్భ వించలేదని, కనుక ఈ ప్రయోగం విఫలమయి నట్లేనని ఆయన చెబుతూ ఈ ప్రయోగం ఆధా రంగా మన దేశం తయారుచేస్తున్న హైడ్రొజన్ బాంబులు అనుకున్న ఫలితాలను ఇవ్వబోవని చెప్పాడు. సంతానం చెప్పింది తప్పు, పోఖ్రా న్-2 పరీక్ష పూర్తిగా విజయవంతమైందని భారత అణుఇంధన కమిషన్ అధికారికంగా స్పష్టం చేసింది. కాని వివాదం ఆగలేదు. సంతానం వ్యాఖ్యానాల ఆధారంగా మీడియా అనేక కథనాలు ప్రసారం చేసింది. పరీక్ష విజయ వంతమైందని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చెప్పారు.
సంతానం ప్రకటనను అణుఇంధన కమిషన్ మాజీ అధ్యక్షుడు చిదంబరం, బాబా అణుపరిశోధనా సంస్థ మాజీ అధ్యక్షుడు, హైడ్రొ జన్ బాంబు రూపకర్త అనిల్ కాకోద్కర్ ఖండిం చారు. అయినా సంతానం ప్రకటనలు ఆగలేదు. శాస్త్రవేత్తల్లో కొంతమంది సంతానానికి మద్దతు గా ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించారు. ఎప్పు డో పదకొండేళ్ల క్రితం జరిగిన అణు పరీక్షల గురించిన చర్చ మళ్లీ ఇప్పుడు ముందుకు తీసుకురావడానికి కారణమేమిటి? అంటే వాళ్లదగ్గర సరైన సమాధానం లేదు. కాని ఈ హైడ్రొజన్ బాంబు వివాదం కూడా చైనా కేంద్రంగా నడిచిన విషయాన్ని మనం పరిశీలిస్తే లింకులు అర్థమవుతాయి. తన మొదటి పత్రికా ప్రకటన తరువాత ఒక నెలరోజులకు సంతానం అక్టోబర్ 21న ఢిల్లీలో పత్రికలవారితో మాట్లా డుతూ ''చైనా నుండి దేశాన్ని రక్షించుకోవాలంటే మన దేశం వరుసగా అనేక హైడ్రొజన్ బాంబు పరీక్షలు జరపాలి'' అని కోరారు. చైనా వద్ద 200 అణుబాంబులున్నాయి. వాటిలో అనేక హైడ్రొజన్ బాంబులు. వాటిని ఎదుర్కోవాలంటే భారత్‌కూడా పెద్దఎత్తున హైడ్రొజన్ బాంబుల తయారీని చేపట్టాలని ఆయన పేర్కొన్నాడు.
పోఖ్రాన్-2 పరీక్ష హైడ్రొజన్ బాంబుల తయా రీకి సరిపోదనేది ఆయన అభియోగం. దేశ రక్షణను పటిష్ట పరుచుకోడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే. తీసుకుంటుంది కూడా. అయితే ప్రస్తుత ప్రచారం వెనుక దేశ రక్షణ సమస్యకాదు, చైనాను ప్రధాన శత్రువుగా చూపించడం అనే లక్ష్యం ఇమిడి ఉందనేది నిపు ణుల అభిప్రాయం.
శాంభవి ఉదంతం
సెప్టెంబర్ నెలలోనే మీడియాలో మరో చర్చ పెద్ద ఎత్తున సాగింది. ఏడేళ్ల శాంభవి అనే అమ్మాయి ఢిల్లీలో దలైలామాను కలుసుకుని చర్చలు జరిపిందనీ, తానూ, దలైలామా గత జన్మలో స్నేహితలమనే విషయాన్ని ఆమె దలైలా మాతో చెప్పగా ఆయన కూడా అంగీకరించా డనేది వార్త సారాంశం. పత్రికలూ, వార్తా ఛాన ళ్లూ ఈమె మాటలకు బాగా ప్రాచుర్యం కల్పిం చాయి. భారత దేశంలో దలైలామా కార్యకలాపాల గురించి తెలియని వారు ఎవరూ లేరు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలను కేంద్రంగా చేసుకుని ఆయన ఆధ్యాత్మకత ముసు గులో చైనా వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తున్నారు. దలైలామా మూడేళ్లకొకసారి నిర్వహించే కాలచక్ర సభలుగాని, ఆయన ఇతర కార్యకలా పాలుగాని చైనా వ్యతిరేక ప్రచారవేదికలుగా ఉంటాయనేది మనకు అనుభంలోని విషయమే. ఇప్పుడు శాంభవి నోటితో అదేవిధమైన ప్రచా రానికి పూనుకున్నారు.
2012 నాటికి చైనా నాశనమై పోతుందనీ, టిబెట్‌కు స్వాతంత్య్రం వస్తుందనీ శాంభవి మీడియాముందు చెప్పింది. టిబెట్‌ను చైనా అక్రమంగా ఆక్రమించుకున్నదని ఆమెచెప్పిన మాటలు ఆమెవి కావనీ, ఆమెచేత చెప్పించారనీ తేలికగానే అర్థమైపోతోంది. శాంభవి కర్నూలు జిల్లా నంద్యాలకు సమీపం లోని సూర్యనంది ఆశ్రమంలో అకస్మాత్తుగా ప్రత్యక్షమై ఈ విషయాలు చెప్పింది. అయితే ఆమెది మన రాష్ట్రం కాదు. ఆమె తల్లిదండ్రులు వారణాసిలో ఉంటున్నారు. మూడేళ్లుగా ఆమె ఉషారాణి అనే సంరక్షకురాలి పర్యవేక్షణలో సూర్యనందిలో ఉంటున్నట్లు చెబుతున్నారు. ఆ పాపకు సంబంధించిన మొత్తం వ్యవహారం ఒక మిస్టరీగానే సాగింది. ఆమె దలైలామా యొక్క చైనా వ్యతిరేక ప్రచార యంత్రాంగంలో భాగ మా అనేది పలువురు వ్యక్తపరిచిన సందేహం. ఇటీవల 'సాక్షి' పత్రికలో దాని న్యూఢిల్లీ విలేకరి వాసదేవన్ ఇటువంటివే అనేక సందేహాలు లేవనెత్తడంతోబాటు శాంభవిఉదంతం, ధర్మశా లలో దలైలామా కార్యకాలపాలను భారత- చైనాల మధ్య చిచ్చుపెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలుగా పేర్కొన్నాడు.
''అసలు ధర్మశా లలో ఏం జరుగుతోంది? గతజన్మల కోలా హలం హఠాత్తుగా ఈరోజే ధర్మశాలను ఎందు కు చుట్టుముట్టింది? భౌద్ధ భిక్షువుల మదిలో శాంభవి ఎందుకు ఆరాధనీయ స్థానం సంపా దించింది?'' అని వాసుదేవన్ ప్రశ్నిస్తూ ధర్మ శాలను గురించిన అనేక విషయాలు వెల్లడించారు. ఆయన ఇలా రాశారు: ''అసలు ధర్మశాలలో జరుగుతున్న విషయాలు బయటి ప్రపంచానికి ఇంతవరకూ తెలియకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులోనూ సాం స్కృతిక పరంగా భారతీయ జీవన శైలిపై టిబెటన్లు చేస్తున్న మెత్తటి దాడుల్లో భాగంగానే, ధర్మశాలలో క్రమక్రమంగా 'భారతీకరణ' అదృశ్య మైతోందనడానికి ప్రబల సాక్ష్యాలు ఇటీవల కాలంలో బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధర్మశాలలోని దలైలామా అంతర్జాతీయ ఆధ్యా త్మిక కేంద్రం వద్ద, ఆశ్రమనియమాల పేరిట భారతీయుల రాకను క్రమబద్దీకరించే విషయం లోనూ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ పార్లమెంట్ ప్రాంగణంలోకి భారతీయులను అనుమతించే విషయంలో దలైలామా సెక్యూరిటీ అనుసరించే విధానాలూ ఏ సగటు భారతీయు డినైనా గాయపరుస్తాయి.
అయితే సెక్యూరిటీ సిబ్బంది విదేశీయలను అనుమతించే విషయం లో ఉదారంగా ఉంటున్న విషయం ఎవరికంటా పడటంలేదని వారనుకుంటున్నారు.''ధర్మశాల వ్యవహారాలు మొత్తం చాలా రహస్యంగా అక్కడి భారతీయ అధికారుల కళ్లుగప్పే పద్ధతిలో సాగుతున్నాయని వాసుదేవన్ రాశారు. శాంభవి ఉదంతం వెనుకనున్న చైనా వ్యతిరేక ప్రచారాన్ని గురించి ప్రస్తావిస్తూ ఆయన ఇలా రాశారు: ''అసలు శాంభవి పుట్టుపూర్వో త్తరాలేమిటి? ఆమెకు కేర్‌టేకర్‌గా వ్యవహరిస్తున్న ఉషారాణి అనే మహిళకూ, టిబెట్ ప్రవాస ప్రభుత్వ డిప్యూటీ స్పీకర్ దోల్మ గ్యారీకి ఉన్న అనుబంధమేమిటి? శాంభవిని డిప్యూటీ స్పీకర్ 'ఆచార్య శాంభవి'గా ప్రకటించడం వెనుక ఉన్న మతలబు ఏమిటి? అనే దిశగా మన నిఘా సంస్థలు దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. చైనాతో మన సంబంధాలు ఆందోళన కలిగించే దిశగా ప్రయనిస్తున్న సమయంలో ఒక చిన్నారి నోట పలికిస్తున్న చైనా వ్యతిరేక వ్యాఖ్యలు మన రెండు దేశాల నడుమ సాంస్కృతిక పరమైన ఉద్రిక్తతలు తలెత్తడానికి కారణమవుతాయనే ఇంగితం మన నిఘా సంస్థలకు కొరవడటమే దురదృష్టకరం.
మతపరంగా టిబెటన్లకు ఉన్న పునర్జన్మ, గతజన్మ అంశాలపై మనం స్పృశించ కపోవడం మన సంస్కారం కాబట్టి ఇన్నాళ్లుగా శాంభవి నెపంతో టిబెటన్లు అధికారికంగా నడిపిస్తున్న ఈ చైనా వ్యతిరేక ప్రచారానికి మన మద్దతు ఉందనే అపోహను టిబెటన్లు విదేశీ పర్యాటకుల మెదళ్లలోకి చాలా జాగ్రత్తగా ఎక్కించగలిగారు.''దలైలామా భారత దేశంలో ఎవరికి వ్యతి రేకంగా ఎవరికోసం పనిచేస్తున్నారో మనకు తెలియంది కాదు. ఆయనకు అంతర్జాతీయంగా అమెరికా, ఇతర సామ్రాజ్యవాద శక్తులనుండి లభిస్తున్న మద్దతుగురించి కూడా అందరికీ తెలుసు. నిజానికి దలైలామాకు భారత్ ఇస్తున్న మద్దతు, ఆయనా, ఆయన అనుయాయులూ సామ్రాజ్యవాదుల మద్దతుతో చైనాపై కుట్రలకు భారత భూభాగాన్ని ఉపయోగించుకుంటున్న వైనం భారత్-చైనాల మధ్య మొదటినుండీ సమస్యలు తెస్తూనే ఉన్నాయి. భారత్‌లో నడు స్తున్న టిబెట్ ప్రవాస ప్రభుత్వ కార్యకలాపాలు మన దేశానికి మేలు చేయకపోగా కీడు తెస్తున్నాయి.
ఎందుకీ ప్రచారం?
మన అణ్వస్త్ర కార్యక్రమాన్ని చైనాకు వ్యతిరేకంగా తిప్పడం, దలైలామా కార్యకలా పాలను అడ్డుపెట్టుకుని చైనా వ్యతిరేక ప్రచారానికి సరికొత్తగా తెరతీయడం, అదే సమయంలో భారత్‌లోకి చైనా చొచ్చుకు వస్తున్నదన్న ప్రచారం అందుకోవడం ఇవన్నీ ఒకేసారిగా ఎవరో వెనక ఉండి నడుపుతున్నట్లు ఒక్కసారిగా జరగడం విశేషం. చివరికి ప్రధాన మంత్రితో సహా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈ కుట్రపూరిత ప్రచారానికి తెరదించడానికి రంగంలోకి దిగాల్సి వచ్చింది. చైనా-భారత్ సరిహద్దులు సురక్షి తంగా ఉన్నాయని ప్రధాన మంత్రి దేశ ప్రజల నుద్దేశించి ప్రకటించారు. మొత్తంగా చూసిన ప్పుడు ఈ ప్రచారాలన్నిటి వెనుక ఒక్కటే లక్ష్యం కనిపిస్తోంది. భారత్-చైనాలు దగ్గర కాకుండా, రెండు దేశాల మధ్య సాధారణమైన సంబం ధాలు ఏర్పడకుండా అడ్డుకోవడమే ఆ లక్ష్యంగా కనిపిస్తోంది.
ఒకవైపు అమెరికాలోని పిట్స్ బర్గ్‌లో జి20 దేశాల శిఖరాగ్ర సదస్సు జరుగనున్న తరుణం లో, బ్రెజిల్‌తో కలిసి భారత్-చైనాలు ఈ సమావేశంలో కీలకమైన పాత్ర నిర్వహించే సమయంలో రెండు దేశాల మధ్య చిచ్చురేపడా నికే ఈ ప్రచారం జరుగుతోందన్నది పరిశీలు కుల భావన. ఇటీవల హిందూ పత్రికలో భారత మాజీ దౌత్యవేత్త ఎం.కె. భద్రకుమార్ ఒక వ్యాసం రాస్తూ భారత్ - చైనాల మధ్య యుద్ధం వస్తోందన్న వాతావరణాన్ని కల్పిస్తున్నవాళ్లెవరో చెప్పారు. ఆయన అభిప్రాయం ప్రకారం కేవలం మీడియాలోని ఒక సెక్షనే కాకుండా భారత ప్రభుత్వంలో కీలక పాత్ర నిర్వహించిన అమె రికా అనుకూల అధికారులు, మాజీ దౌత్య వేత్తలు, వ్యూహకర్తల పాత్ర ఉంది. థింక్ ట్యాంక్ పేరుతో వీళ్లు అభిప్రాయాలను మలిచే పనిచేస్తున్నారు.
న్యూఢిల్లీలో ప్రయివేటు నిధులతో నడుస్తున్న విధాన పరిశోధనా కేంద్రంలో వ్యూహాత్మక అధ్యయనాల ప్రొఫెసర్ అయిన బ్రహ్మ చెల్లయ్య, బిజెపి నాయకుడు అరుణ్ శౌరి వంటివారు భారత్-చైనాల మధ్య అగ్గి రగల్చడమే పనిగాపెట్టుకుని రచనలు చేస్తున్నారు. ఈ ప్రచారంలో మీడియాలోని ఒక భాగం కూడా పాత్ర వహిస్తోంది. ముఖ్యంగా మన దేశంలో విదేశీ నిధులతో నడుస్తున్న మీడియా ఈ విషయంలో చాలా చురుకుగా పనిచేస్తోంది. రెండోది, సైన్యంలోని ఒక సెక్షన్, చైనా మన దేశంమీద దాడికి వస్తోందన్న పద్దతిలో వార్తలను లీక్ చేస్తున్నారు. అనేక చోట్ల చైనా చొరబాట్ల వర్తాలు నేరుగా కాకుండా మీడియాకు లీకుల రూపంలో వస్తున్నాయి. దేశ ప్రజల్లో ఆ విధమైన భయోత్పాతం ఏర్పడితే సైన్యానికి ప్రభుత్వం నిధులు పెంచుతుందన్న భావం ఈ సెక్షన్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇక మూడోది, మన దేశంలో బిజెపి-సంఫ్‌ు పరివార్‌లు బాహా టంగా, సైన్యంలోనూ, అధికార యంత్రాంగం లోనూ ఉన్న వారి అనుయాయులు లోపాయి కారీగా భారత్-చైనా సంబంధాలు చెడగొట్టడా నికి ప్రయత్నిస్తున్నారు. వారి అమెరికా అనుకూల, మితవాత ఎజెండాలో 'చైనాతో వైరం' అనేది ఒక భాగంగా ఉన్నది. అందుకే బిజెపి నాయకులు ప్రసుత ఎన్నికల్లో 'చైనా పట్ల భారత్ మెతక వైఖరి' అనే ప్రచారాస్త్రాన్ని చేపట్టారు.
హిందూ వ్యాసంలో భద్రకుమార్ ఒక ప్రశ్న లేవనెత్తారు. భారత్-చైనాల మధ్య యుద్ధాన్ని ఎవరు కోరుకుంటున్నారు? రెండు దేశాలు ఘర్షణ పడితే ఎవరికి లాభమో వారుకోరుకుంటున్నారు. ప్రపంచంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందు తున్న, ఇరుగుపొరుగు దేశాలైన భారత్-చైనాలు ఘర్షణ పడితే భారత్‌కూ లాభం ఉండదు, చైనాకూ లాభం ఉండదు. పైగా రెండు దేశాలూ చాలా తీవ్రంగా నష్టపోతాయి. కాని ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో భారత్-చైనాలు ఘర్షణ పడితే అమెరికా లాభపడుతుందని ఆయన నిర్ధారిస్తూ ఈ నాడు మన దేశంలో జరుగుతున్న ఈ చైనా వ్యతిరేక ప్రచారం వెనుక అమెరికా ప్రయోజనాలు కాపాడే శక్తుల ప్రమేయం ఉందని తేల్చారు.
అమెరికా వ్యూహం
ప్రపంచ పరిణామాలు నేడు అమెరికా స్వార్ధ ప్రయోజనాలకు వ్యతిరేక దిశలో పయని స్తున్నాయి. తన నాయకత్వంలో ఏకధృవ ప్రపంచాన్ని నిర్మించడానికి అమెరికా ప్రయత్ని స్తుంటే దానికి విరుద్ధంగా ప్రపంచం బహుళధృవ రాజకీయాలవైపు నడుస్తోంఇ. రష్యా, చైనాలు ఒకవైపు, లాటిన్ అమెరికాలో వామపక్ష ప్రభు త్వాలు మరోవైపూ అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్నాయి. ఇంకోవైపు వర్ధమాన దేశాలనుండి బ్రెజిల్, భారత్, చైనాలు కలిసి కట్టుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాల ఏకపక్ష ధోరణులను ప్రతిఘటిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థికవ్యవస్థగా ఆవిర్భవించి మొదటి స్థానంవైపు శరవేగంగా దూసుకుపోతున్న చైనా, మూడో స్థానంలోకి త్వరలోనే చేరుకోబోతున్న భారత్‌ల మధ్య ఆర్థిక వాణిజ్య సంబంధాలు పెరిగితే అమెరికా సామ్రా జ్యవాద ఆధిపత్యానికి గండిపడినట్లే అవుతుంది.
ఇరుగుపొరుగున ఉన్న ఈ రెండు దేశాల మధ్య పూర్తి స్థాయిలో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు ఏర్పడితే ఆ బంధం ప్రపంచ శాంతికీ, సుస్థిర తకూ దోహదపడుతుంది. అమెరికాకు సరిగ్గా అదే ఇష్టం లేదు. భారత స్వతంత్ర అభివృద్ధి కాకుండా తన ప్రపంచాధిపత్య వ్యూహంలో దాన్ని జూనియర్ భాగస్వామిగా చేసుకోడానికి అది శతవిధాలా ప్రయత్నిస్తోంది. భారత్‌తో రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం, అణు ఒప్పం దం, వ్యూహాత్మక సైనిక విన్యాసాలు నిర్వహిం చడం వగైరాలన్నీ ఇందులో భాగమే. మన దేశంలోని పాలకవర్గంలో ఒక సెక్షన్ దీనికి మద్దతుగా నిలబడింది.
కాని అమెరికా ప్రయత్నాలకు విరుద్ధంగా మరోవైపు భారత్-చైనాల మధ్య ఈ కాలంలో వాణిజ్య, దౌత్య సంబంధాలు వేగంగా పెరుగు తున్నాయి. 2008లో రెండు దేశాల మధ్య వాణిజ్యం 5,100 కోట్లడాలర్లకు (2,505,000 కోట్ల రూపాయలకు) చేరుకుంది. 2007తో పోలిస్తే 34 శాతం పెరిగింది. 2009లో ఇది 6,000 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. 1999లో రెండు దేశాలమధ్య వాణిజ్యం కేవ లం 33 కోట్ల డాలర్లు మాత్రమే ఉండేదంటే ఈ 15 ఏళ్లలో వాణిజ్య సంబంధాలు ఎంతగా పెరిగాయో అర్ధం చేసుకోవచ్చు. 1990 నుండి ప్రతిఏటా 30 శాతం వృద్ధి చెందుతోంది. అమె రికా-భారత్‌ల మధ్య జరుగుతున్న వాణిజ్యాన్ని నేడు భారత్ - చైనామధ్య వాణిజ్యం మించి పోయింది. 2000 సంవత్సరంలో అమె రికా-భారత్‌ల మధ్య 1,400 కోట్ల డాలర్ల వాణిజ్యం జరగ్గా 2007-08 నాటికి అది 4,200 కోట్ల డాలర్లకు పెరిగింది. అంటే 2000 నాటికి భారత్-చైనాల మధ్య జరిగిన వాణిజ్యం కన్నా భారత్-అమెరికాల మధ్య వాణిజ్యం అధికంగా ఉండేది, కాని ఇప్పుడది రెండో స్థానంలోకి పోయింది. నేడు భారత్‌కు అదిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా మాత్రమే.
రెండోవైపు 1985లో రాజీవ్ గాంధీ చైనా పర్యటన తరువాత ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు బాగా వృద్ధి చెందుతూ వచ్చాయి. 1962 యుద్ధానికి దారితీసిన సరిహద్దు సమస్యను పక్కనబెట్టి రెండు దేశాలూ వాణిజ్య, ఆర్థిక, ఇతర సంబంధాలు పెంచుకోవాలని నిర్ణయానికి రావడం రెండు దేశాల సంబంధా లలో పెద్ద మార్పుకు దారితీసింది. 1962 తరువాత ఈనాటివరకూ భారత్-చైనాల మధ్య 3.500 కిలోమీటర్ల పైగా ఉన్న సరిహద్దుల్లో ఎటువంటి ఘర్షణా లేదు. ఈ ప్రాంతంలో ఘర్షణలో ఒక్క మరణమూ సంభవించలేదు. ఇటీవలెనే సిక్కింలో భూమార్గం ద్వారా వాణి జ్యానికి ఆరంభం పలికారు. ఇంకా అనేక సెక్టార్లలో వాణిజ్య మార్గాలు తెరిస్తే రెండు దేశాల సరిహద్దులు అభివృద్ధి మార్గలుగా మారిపోయే అవకాశం ఉంది.
అన్నిటికీ మించి నేడు అంతర్జాతీయంగా భారత్-చైనాలు తమ రెండు దేశాలకూ, వర్ధ మాన దేశాలకూ ప్రయోజనం చేకూర్చే అనేక అంశాలపై పరస్పర సమన్వయంతో వ్యవహ రిస్తూ పశ్చిమ దేశాల ఒత్తిళ్లను ప్రతిఘటించ గలుగుతున్నాయి. భూగోళ తాపాన్ని తగ్గించే వాయువుల అదుపు విషయంలో భారత్ - చైనాలు ఇటీవల అనేక వేదికల మీద సమన్వ యంతో వ్యవహరించి అమెరికా, ఇతర పశ్చిమ దేశాల ఒత్తిళ్లను తిప్పికొట్టగలిగాయి. డబ్ల్యుటివో దోహా దఫా వాణిజ్య చర్చల్లో కూడా రెండు దేశాలు కలిసి కట్టుగా అమెరికాకు చెక్ పెడుతున్నాయి. అలాగే అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పశ్చిమ దేశాలు తమపై సంక్షోభ భారాలు నెట్టివేయకుండా అడ్డుకుంటు న్నాయి. ఈ క్రమంలోనే పిట్స్ బర్గ్‌లో జరిగిన జి20 సమావేశంలో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా (బ్రిక్)లు ప్రముఖ పాత్ర పోషించాయి. వీటితోబాటు ఇటీవలి కాలంలో భారత్-చైనా సైన్యాల మధ్య కూడా సంయుక్త విన్యాసాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు పెరుగుతున్నాయి. దాంతో రెండు దేశాల సైన్యాల మధ్య సహృద్భావం రోజురోజుకీ పెరుగుతోంది.
ఈ విధంగా భారత్-చైనా మధ్య వాణి జ్యం, ఇతర సంబంధాలు పెరగడం, అంతర్జా తీయ వేదికల మీద రెండు దేశాల మధ్య సమన్వ యం పెరగడం భారత్‌ను తన జూనియర్ భాగ స్వామిగా చేసుకోవాలనుకుంటున్న అమెరికా వ్యూహానికి హానికరం. కనుకనే రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టడానికి అది అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. మన వ్యవస్థలో చొచ్చుకుపోయిన అమెరికా అనుకూల శక్తులు దానికి ఈ ప్రయ త్నంలో అన్నివిధాలా సహకరిస్తున్నాయి. దీని గురించి హిందూ వ్యాసంలో భద్రకుమార్ ఇలా పేర్కొన్నారు: ''విశేషమేమంటే మన ప్రాంతంలో పాకిస్థాన్ సహకారంతో తన సైనిక ఉనికిని పెంచుకుంటున్న అమెరికా విధానాలనుండి ప్రజల దృష్టిని ఈ (చైనా వ్యతిరేక) యుద్ధ ఉన్మాదం పక్కకు మళ్లించింది. అదేవిధంగా ఆఫ్ఘనిస్థాన్ సమస్యపైనా, ఉగ్రవాదం సమస్యపైనా ఏవిధంగా సహకరించుకోవాలి అని భారత్, రష్యా, చైనాలు మార్గాన్వేషణ చేస్తున్న సమయంలో ఇది ఈ ప్రాంతంలో గందరగోళం నెలకొల్పింది.
ఈ ఉన్మాదాన్ని గనుక మరింత పెరగనిస్తే అప్పు డు చైనా బూచిని ఎదుర్కొనేందుకు భారత దేశం అమెరికాతో అనివార్యంగా సైనిక సహకారాన్ని విస్తరించుకోవలసి వస్తుంది...''
Note :Article from Prajasakti.com
Monday, 12 October 2009
ఒబామా మాట నిలుపు కుంటారా ?
శాస్త్రసాంకేతిక రంగాలలో మానవాళి అభ్యుదయానికి కృషి చేసిన వారికి ప్రకటిస్తున్న నోబెల్ బహుమతుల విషయంలో ఎలాంటి విభేదాలు లేవు. వచ్చిన చిక్కల్లా శాంతి బహుమతుల ప్రకటనతోనే నోబెల్ ఫౌండేషన్, బహుమతుల నిర్ణాయక కమిటీలు తీవ్ర విమర్శల పాలౌతున్నాయి. సామ్రాజ్యవాదులు ముఖ్యంగా అమెరికన్ల కనుసన్నలలో మెలిగేవారికి అవసరమైతే శాంతి బహుమతులు ఇప్పించే పలుకుబడి అమెరికన్లకు ఉందని అనేక సందర్భాలలో వెల్లడైంది. ఇప్పుడు జరిగిందదే. అధ్యక్షుడిగా పదవీస్వీకారం చేసిన పదిహేనురోజుల్లోనే నోబెల్ బహుమతి ప్రతిపాదన గడువు ముగిసింది. అంటే కనీసం ఆయన విధానాలు ఎలా ఉంటాయో తెలియకముందే పేరును ప్రతిపాదించటాన్ని బట్టి ముందస్తు ఏర్పాటుగా భావిస్తున్నారు. అందుకే అది తెలియని వారిని ఒబామాకు 2009 సంవత్సరానికి అంతర్జాతీయ శాంతి నోబెల్ బహుమతి ప్రకటించటం ఆశ్చర్య పరిచింది. మీడియా, రాజకీయ పరిశీలకులు ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రిపబ్లికన్లు, ఇతర మితవాదులు అవార్డు ఇవ్వటంపై విమర్శలు గుప్పిస్తుండగా అంతే మోతాదులో సమర్థిస్తున్నారు. పాలస్తీనాలో యూదుల అక్రమనివాసాల నిర్మాణాన్ని నిలిపివేయించటంలో విఫలమై, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధం కొనసాగిస్తున్న వ్యక్తికి శాంతి బహుమతి ఇవ్వటం ఏమిటని యుద్ధ వ్యతిరేకులు ప్రశ్నిస్తున్నారు.
నోబెల్ శాంతి బహుమతులు వివాదాస్పదం కావటం ఆదినుంచీ ఉంది.అధికారంలో ఉండగా నోబెల్ శాంతి బహుమతులు పొందిన తొలి అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్. ఆయన రష్యా-జపాన్ మధ్య రాజీకుదిర్చినందుకు 1906లో అవార్డును ప్రకటించారు. ఇది ఒకవైపు మాత్రమే. స్పానిష్-అమెరికా యుద్ధానికి తోడ్పడినందుకు, ఫిలిఫ్పైన్స్‌లో రక్తం ఏరులుగా పారించినందుకు బహుమతిగా ఈ అవార్డు వచ్చిందన్న విమర్శలకూ ఆధారాలు లేకపోలేదు. బహుమతి ప్రకటన వెలువడగానే అమెరికా సైనిక బలప్రదర్శన ద్వారా ప్రపంచాన్ని భయపెట్టేందుకు గ్రేట్ వైట్ ఫ్లీట్( 16 నౌకాదళ నౌకలు)ను అట్లాంటిక్ సముద్రంలోకి నడిపించిన అపర 'శాంతి' ప్రియుడు రూజ్‌వెల్ట్. ఈ పూర్వరంగంలోనే బహుమతికోసం ఒబామా ఆఫ్ఘనిస్తాన్‌కు అదనపు సైన్యాలను పంపటం వాయిదావేశారని అమెరికాలో విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు ఒబామా యంత్రాంగంలో ఒకసారి ప్రపంచానికి అమెరికా అంటే ఏమిటో తెలియచెప్పాలంటే మన వద్ద ఉన్న ఆధునిక ఆయుధాలన్నింటినీ ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రయోగించాలని జనరల్ స్టాన్లీ క్రిస్టల్ ఇప్పుడు లాబీయింగ్ నిర్వహిస్తున్నాడు. అంతకు ముందున్న కమాండర్‌ను మార్చి స్టాన్లీని ఒబామా కొత్త కమాండర్‌గా నియమించారు. మరో 17వేల మంది కొత్త సైనికుల తరలింపునకు ఆజ్ఞలు జారీ చేశారు. ఒకవైపు ఒబామా పేరును నోబెల్ కమిటీకి ప్రతిపాదించిన సమయంలోనే మరోవైపు అఫ్ఘనిస్తాన్‌కు మరింతగా మరో 40వేల అదనపు బలగాలను పంపటం గురించి ఒబామా సర్కార్ కసరత్తు చేస్తున్నది. నోబెల్ బహుమతి ప్రకటన గురించి ముందుగా తెలిసిన కారణంగానే బలగాలను పంపటంపై నిర్ణయాన్ని వాయిదా వేశారన్న విమర్శలు కూడా వచ్చాయి. మొదటి ప్రపంచ యుద్దంలోకి అమెరికాను లాగను అన్న ఎన్నికల వాగ్దానంతో రెండవసారి 1916లో గెలిచిన ఉడ్రోవిల్సన్ మరుసటి ఏడాదే అమెరికాను యుద్దంలో దించిన పెద్దమనిషి. వర్సెయిల్స్ సంధితో నానాజాతి సమితి ఏర్పాటుకు కారకుడయ్యాడనే పేరుతో ఆయనకూ 'శాంతికాముకుడు' ముద్రవేసి నోబెల్ బహుమతి ఇచ్చారు. ఫిలిప్ఫైన్లు, పాలస్తీనియన్లు, వియత్నామీయులు,
ఇప్పుడు ఆప్ఘనిస్తానీయులపై రోబోట్, క్షిపణి దాడులు జరుపుతూ వివాహవిందుల్లో ఉన్నవారిని, నిరాయుధులను విచక్షణా రహితంగా సంహరిస్తున్న వారందరికీ నోబెల్ శాంతి బహుమతులు రావటం రాజకీయం, అమెరికా తన అక్రమాలకు ముసుగువేసుకోవటం తప్ప మరొకటి కాదు. నోబెల్ శాంతి తాజాగా పొందిన ఒబామా, అంతకు ముందు అందుకున్న మార్టిన్ లూధర్‌కింగ్ జూనియర్, దలైలామా, అంగ్‌సాన్ సూకీ, నెల్సన్ మండేలా అందరూ తాము మహాత్మాగాంధీని చూసి స్ఫూర్తి పొందామని చెప్పుకున్నవారే. ఇంతమందికి ఆరాధ్యుడైన మహాత్మాగాంధీకి మాత్రం శాంతి బహుమతి ఇవ్వటానికి నోబెల్ కమిటీకి మనస్కరించకపోవటం వెనుక కూడా రాజకీయమే అని చెప్పకతప్పదు. ఎందుకంటే ఆయన బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా పోరాడటమే. అనేకసార్లు గాంధీపేరును ప్రతిపాదించినా తిరస్కరించిన కమిటీ తీరా ఆయన మతోన్మాదుల చేతిలో హత్యకు గురికాబోయే కొద్ది రోజుల ముందు ఆయనను జాబితా నుంచి తొలగించటం విచారకరమే అని ప్రకటించింది. ఆతరువాత 1948లో శాంతి బహుమతికి అర్హులైన సజీవులెవరూ లేనందున ఆ సంవత్సరానికి బహుమతిని ఇవ్వటం లేదని పేర్కొన్నది. వివాదం ఎలా ఉన్నా తనకు వచ్చిన బహుమతిని కార్యాచరణకు పిలుపుగా భావించి తాను స్వీకరిస్తున్నానని ఒబామా పేర్కొన్నారు. అయితే అది ప్రపంచశాంతిని ఒక్క అడుగు ముందుకు తీసుకుపోయినా సంతోషమే. అమెరికాలో మార్పు తీసుకువచ్చేందుకే నాకు అనుకూలంగా తీర్పు ఇవ్వమనే నినాదంతో ఎన్నికలలో పోటీ చేసిన ఒబామా తాను వాగ్దానం చేసిన ఆరోగ్యబీమా సంస్కరణలను అమలు జరపటానికి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్నారు. అటువంటిది ప్రపంచంలో ఏదో ఒకమూల అశాంతి, యుద్ధాలు లేకపోతే నిదురపట్టని ఆయుధలాబీ ఒబామాను శాంతికాముడిగా వ్యవహరించనిస్తుందని ఆశించటం అత్యాశే అవుతుంది. అయితే ఒబామాకు ఒకవేళ విఫలమైనా అన్నమాటను నిలబెట్టుకొనేందుకు చిత్తశుద్దితో ప్రయత్నిస్తే చరిత్ర బ్రహ్మరథం పడుతుంది, లేకుంటే చెత్తబుట్టలోకి నెడుతుందని ఒబామా గ్రహిస్తారా?
Note:Article from prajasakti Desk

Thursday, 8 October 2009
పెట్టుబడిదారీ వ్యవస్థకు స్పష్టమైన ప్రత్యామ్నాయం ఉంది
పెట్టుబడిదారీ వ్యవస్థ పనికిమాలినదని తేలిపోయింది కాబట్టి ఇప్పుడు మన ముందున్న ప్రత్యామ్నాయమేమిటి?.....ఈ ప్రశ్న నేడు ప్రపంచ ఆర్థిక రంగంలో జరగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న లక్షలాదిమంది ప్రజల, ఇంకా చెప్పాలంటే కోట్లాది మంది ప్రజల మెదళ్లు తొలుస్తున్నది. గత కొన్ని నెలలుగా కనిపిస్తున్న రుణ సంక్షోభం, ఆర్థిక పతనం, మాంద్యం....వంటి వాటిని చూసేవారిలో ఇటువంటి ప్రశ్న ఉదయించడం సహజం. కాని సమస్యేమంటే ఈ ప్రశ్న ఉదయించిన కోట్లాది మంది ప్రజల ముందు మన రాజకీయ నాయకులు, మీడియా, విద్యా వ్యవస్థ, ఇంకా వారి అనుభవాల్లోని ఇతర అంశాలు ఉంచుతున్న సమాధానం ఏమిటంటే 'ప్రత్యామ్నాయం లేదు' అని. ఇప్పుడున్న స్థితిలో పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం ఏ విధంగానూ లేదు, ప్రత్యామ్నాయంటూ ఉంటే గింటే అది మార్పు చేయబడిన పెట్టుబడిదారీ వ్యవస్థే మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. మార్పు చేయబడ్డ పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే కొత్త కీనీసియనిజం, లేదా గార్డన్ బ్రౌనిజం (బ్రిటన్ ప్రధాని సూత్రం), లేదా బరాక్ ఒబామాయిజం (అమెరికా అధ్యక్షుల వారి సూత్రం) మాత్రమే.
కాని ఇది వాస్తవం కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థకు నిశ్చితమైన, స్పష్టమైన ప్రత్యామ్నాయం ఉంది. 160 ఏళ్లనుండి (1848లో కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగెల్స్ కమ్యూనిస్టు మ్యానిఫెస్తో రాసినప్పటినుండి) ఈ ప్రత్యామ్నాయం మన ముందుంది. ఆ స్పష్టమైన ప్రత్యామ్నాయమే సోషలిజం. సోషలిజం చాలా సూటైన వ్యవస్థ. పెట్టుబడిదారీ వ్యవస్థతో పోలిస్తే చాలా సరళతరమైన వ్యవస్థ. ప్రధాన ఉత్పత్తి సాధనాలు (భూమి, పరిశ్రమలు, వ్యాపారాలు, బ్యాంకులు వగైరాలు)పై సామాజిక (లేదా సమిష్టి) యాజమాన్యం, అదుపు కలిగి ఉండడమే సోషలిజం అంటే. ఈ వ్యవస్థలో ఉత్పత్తి లాభాలకోసం కాకుండా మానవ అవసరాల ప్రాతిపదికగా జరుగుతుంది. దానివల్ల సమాజంలో వర్గ విభజనలు అంతమవుతాయి.
.............
సోషలిజం సమాజంలో చాలా మార్పులు తెస్తుంది. ప్రజలందరికీ అవసరమైన ఆహారం, గృహవసతి అందిస్తుంది. మానవుల మధ్య అసమానతలు, వర్గవిభజన తొలగిస్తుంది. ఆర్థికవ్యవస్థలో ప్రజాతంత్ర యుతమైన ప్రణాళికను ప్రవేశపెడుతుంది. వాతావరణంలో వినాశకరమార్పులను అరికడుతుంది. ప్రపంచ శాంతి, సమైక్యత నెలకొల్పుతుంది. కాని సోషలిజం ఈ మార్పులన్నీ తేవాలంటే ముందుగా కార్మికవర్గం పెట్టుబడిదారీ వ్యవస్థను తొలుత ఒక దేశంలోనూ, తరువాత మొత్తం ప్రపంచమంతటానూ, కూకటివేళ్లతో పెకిలించి పారేయ్యాల్సి ఉంటుంది. దీనికి కార్మిక మండళ్లు ఏర్పాటు కావడం చాలా కీలకమైన అంశం. ఈ మండళ్ల ఏర్పాటు పెట్టుబడిదారీ వ్యవస్థలోనే ప్రారంభమవుతుంది. యజమానులకు వ్యతిరేకంగా కార్మిక సమ్మెలు నిర్వహించే క్రమంలోనూ, సార్వత్రిక సమ్మెలు, ఫ్యాక్టరీల ఆక్రమణలు వంటి పోరాటాల నిర్వహణ క్రమంలోనే ఇటువంటి కార్మిక మండళ్లు ఏర్పడతాయి. ఇవి క్రమంగా పాత పెట్టుబడిదీరీ రాజ్యానికి ప్రత్యామ్నాయ అధికార కేంద్రాలుగా మారుతాయి. ఆ క్రమంలో జరిగే నిర్ణయాత్మక విప్లవంలో వారు పెట్టుబడిదారులను అధికారం నుండి తొలగించి కార్మికుల అధికారాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆధునిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కార్మికుల విశిష్ట స్థానాన్ని బట్టి వారికా అధికారం చేకూరుతుంది. ఈ క్రమంలోనే వారు కోట్లామంది ప్రజల సృజనాత్మక శక్తినీ, సామర్ధ్యాలనూ విముక్తి చేస్తారు. అది ఒకసారి జరిగితే ఇప్పటికన్నా ఉన్నతమైన, చాలా చాలా ఉత్తమమైన ప్రపంచం 'సాధ్యం' అనే స్థితినుండి వాస్తవ రూపానికి వస్తుంది.
Note: Written By
(జాన్ మోలినాక్స్ బ్రిటిష్ సోషలిస్టు వర్కర్స్ పార్టీ సభ్యుడు. రచయిత. పోర్ట్స్‌మౌత్ విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా పనిచేస్తున్న ఈయన మార్క్సిస్టు సిద్ధాంతం, కళల మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు రాశాడు. 'సోషలిస్టు రివ్యూ' 2009 జనవరి సంచికలో ఆయన రాసి వ్యాసం నుండి ఈ వాక్యాలు గ్రహించబడ్డాయి.)

Friday, 2 October 2009
బోఫోర్స్‌కు సమాధి
అనుకున్నట్టే జరిగింది. కాంగ్రెస్‌కు పర్యాయపదంగా మారిన బోఫోర్స్ కుంభకోణంలో దోషులెవరో తేలకుండానే కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని శాశ్వతంగా సమాధి చేసింది. 1437 కోట్ల రూపాయల హోవిట్జర్ తుపాకుల కొనుగోలుకు సంబంధించి భారత ప్రభుత్వానికి, స్వీడిష్ కంపెనీ బోఫోర్స్‌కి మధ్య కుదిరిన ఒప్పందంలో కొందరు రాజకీయపెద్దలకు, అధికారులకు పెద్దయెత్తున ముడుపులు ముట్టినట్లు 1987లో స్వీడిష్ రేడియో వెల్లడించడంతో దేశం ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. రక్షణ కొనుగోళ్లలో ఇంతటి భారీ కుంభకోణాన్ని దేశం అదివరకెన్నడూ కనీవినీ ఎరుగదు. పైగా ఈ కుంభకోణంతో కాంగ్రెస్‌లోని కొందరు పెద్దలకు ప్రమేయమున్నట్లు జర్నలిస్టుల పరిశోధనాత్మక వార్తా కథనాలు రావడంతో దేశంలో ఇది పెను ప్రకంపనలు సృష్టించింది. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి ఇది దారితీసింది. ఆ తరువాత కూడా ఆ పార్టీని ఇది నీడలా వెంటాడుతూనే వస్తోంది. ఈ కుంభకోణంలో తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించాల్సిన పెద్దలు ఇందులో నిజాలు బయటకు రానీయకుండా తొక్కిపట్టడానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. మధ్య మధ్యలో ఎన్డీయే, కాంగ్రెస్ మద్దతుపై ఆధారపడిన ప్రభుత్వాలు వచ్చినా ఈ కేసుపై దర్యాప్తు ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగానే సాగింది.
ఈ కేసు దర్యాప్తును ప్రహసనంగా మార్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయని ప్రయత్నమంటూ లేదు. బోఫోర్స్ కుంభకోణం బయటపడగానే పార్లమెంటులోపల, వెలుపల ప్రతిపక్షాల నుంచి, ప్రజానీకం నుంచి పెద్దయెత్తున వ్యతిరేకత రావడంతో అయిష్టంగానే సంయుక్త పార్లమెంటరీ సంఘం(జెపిసి) ఏర్పాటుకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించింది. కానీ, ఆ కమిటీ విచారణను ఒక తంతుగా మార్చడంతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ఆ కమిటీని బహిష్కరించారు. 1987లో ఈ కుంభకోణం వెలుగు చూసినా, విపి సింగ్ నేతృత్వంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే దీనిపై సిబిఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఆ తరువాత తొమ్మిదేళ్లకు అంటే 1999లో సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం స్విస్ బ్యాంకు విడుదల జేసిన 500 డాక్యుమెంట్ల ఆధారంగా విన్ ఛద్దా, ఖత్రోచి, కీ.శే. రాజీవ్ గాంధీలపై సిబిఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. అప్పటికే రాజీవ్ చనిపోయినందున ఆయన పేరును విచారించాల్సిన నిందితుల జాబితా నుంచి తప్పించింది. ఆ తరువాత కొన్నాళ్లకు హిందూజా సోదరుల పేర్లను చేర్చుతూ అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. కానీ, దర్యాప్తు సంస్థ సరైన ఆధారాలు చూపకపోవడం వల్ల 2004లో హిందూజా సోదరులను ఢిల్లీ హైకోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. యుపిఏ-1 ప్రభుత్వం అధికారంలో వుండగా ఈ కేసులో కీలక నిందితుడైన ఇటాలియన్ ఆయుధ వ్యాపారి, రాజీవ్ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన ఒట్టావియో ఖత్రోచిని ఇంటర్‌పోల్ రెడ్ అలెర్ట్ నోటీసు ఆధారంగా అర్జెంటీనా ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. అయితే సిబిఐ గట్టిగా వాదించకపోవడం వల్ల ఆ ఖత్రోచిని భారత్‌కు అప్పగించేందుకు అర్జెంటీనా కోర్టు తిరస్కరించింది. మలేసియాలో ఖత్రోచి బహిరంగంగా సంచరించినా అతన్ని పట్టుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకుండా నాన్చింది. 2005లో ఖత్రోచి బ్యాంకు అకౌంట్లపై వున్న స్తంభనను ఎత్తివేయవచ్చని భారత ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టుకు సలహా ఇచ్చినప్పుడే ఈ కేసును సమాధి చేయడానికే ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని విదితమయింది. ఖత్రోచిపై వున్న రెడ్ అలర్ట్ నోటీసును ఉపసంహరించాలని ఇంటర్‌పోల్‌ను సిబిఐ కోరడంతో ఇది మరింత బలపడింది. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కేసును మూసేయాలన్న ప్రభుత్వ ప్రకటన ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పాలకులు వ్యవహరించిన తీరు చాలా జుగుప్స కలిగిస్తోంది. ఈ కేసులో నిజాలు బయటకు రావాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేశమాత్రం కూడా లేదని ఈ పరిణామాలన్నీ స్పష్టం చేస్తున్నాయి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే ఇంతకాలం చట్టానికి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఖత్రోచిని పట్టుకుని మక్కెలిరగ్గొట్టి అతనిచే నిజం కక్కించాలి. కానీ, కేంద్రంలో పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగనీయకుండా సిబిఐని అడ్డుకున్నాయి. నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాల్సిన సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మార్చాయి. కేరళలో మార్క్సిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పినరయి విజయన్‌పై అక్రమంగా కేసును బనాయించడంలోను, యుపిలో ములాయం సింగ్‌పై కేసుల విషయంలోనూ సిబిఐని యుపిఏ ప్రభుత్వం ఎలా సాధనంగా వాడుకున్నదీ చూశాము.ఒకవైపు సిబిఐని ఆధారాలు సేకరించకుండా కాళ్లు చేతులు కట్టిపడేసి మరో వైపు సరైన ఆధారాలు లేకుండా ఎంతకాలం నిందితులను వేధిస్తామంటూ అధికారంలో వున్న పెద్దలు అమాయకత్వం ఒలకబోయడం వారి నయవంచనకు పరాకాష్ట. ఖత్రోచి అమాయకుడని కాంగ్రెస్ నమ్మవచ్చుగాక. కానీ, దేశ ప్రజలచేత అలా నమ్మింపజేయాలని చూడడం దాని అవివేకం. ఖత్రోచి ఏ తప్పు చేయకపోతే గత పందొమ్మిదేళ్లుగా చట్టానికి, న్యాయానికి చిక్కకుండా ఎందుకు తప్పించుకు తిరుగుతున్నట్లు? బోఫోర్స్ కుంభకోణంలో చేతులు మారిన అరవై నాలుగు కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి చేరినట్లు? వీటికి సమాధానం లభించాలంటే ఈ కుంభకోణంలో కీలక పాత్రధారి ఖత్రోచిని ప్రాసిక్యూట్ చేయాలి. అందుకు ప్రయత్నించకుండా, కేసును మూసేయడమే దీనికి పరిష్కారం అన్నట్లుగా వ్యవహరించడం దారుణం.
దేశ భద్రతకు సంబంధించిన రక్షణ కొనుగోళ్లలో బయటపడిన అతిపెద్ద కుంభకోణంలో ఎవరినీ శిక్షించకుండా ఇలా వదిలేయడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు ఏ రకమైన సందేశాన్ని ఇవ్వదలచుకున్నది? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఉన్నతాధికారులు, రాజకీయ బ్రోకర్లు అవినీతికి పాల్పడినా దానిని పట్టించుకోకూడదని చెప్పదలచుకున్నదా? అన్ని రకాల అవినీతికి మూలమైన రాజకీయ అవినీతిని ఉపేక్షించినా తప్పు కాదని చెప్పదలచుకున్నదా? అదే ప్రభుత్వ ఉద్దేశమైతే ఆ మాటే చెప్పాలి. అంతేకానీ, ఈ విధమైన ద్వంద్వ ప్రమాణాలతో అవినీతిపై అది పోరాడలేదు. ఇప్పటికైనా ఈ కపట నాటకాన్ని కట్టి పెట్టి బోఫోర్స్ కేసులో నిజాలను బయటపెట్టాలి. ఇందుకు కారకులైనవారు ఎంతటివారైనా శిక్షించాలి.

Thursday, 1 October 2009
ఆరుదశాబ్దాల జన చైనా అప్రతిహత పురోగమనం
october 1st 2009
నేటికి సరిగ్గా అరవై ఏళ్ల క్రితం చైనా రాజధాని బీజింగ్‌లోని తియాన్మెన్ స్క్వేర్‌లో మావో సేటుంగ్ జనచైనా ఆవిర్భవించిందని అశేష ప్రజానీకం మధ్య ప్రకటించాడు. అప్పటివరకు ప్రజలు ఎన్నెన్నో కష్టాల పాల్జేసిన యుద్ధం ముగిసిందనడానికి అది సంకేతం. కమ్యూనిస్టుపార్టీ నాయకత్వాన సాగిన విప్లవపోరాటం విజయవంతం అయిన రోజు అది. లక్షలాదిమంది కార్యకర్తలు, సాధారణ ప్రజానీకం లెక్కలేనన్ని త్యాగాలు చేసి, రక్తం ధారవోసి ఆ విప్లవాన్ని సాధించారు. ఇది సామ్రాజ్యవాదుల దోపిడీనుండి, జపాన్ దురాక్రమణదారుల దురాగతాల నుండి విముక్తి అని, దశాబ్దాలుగా యుద్ధ ప్రభువుల చేతిలో తాము అనుభవిస్తున్న అంతులేని కష్టాలకు చరమగీతం అని చైనా ప్రజలు విశ్వసించారు.
చైనా కమ్యూనిస్టు పార్టీ వారి విశ్వాసాన్ని వమ్ముచేయలేదు. వారి అశలను, ఆకాంక్షలను నెరవేర్చడానికి శాయశక్తులా కృషిచేసింది.
దాని ఫలితమే నేటి నవ చైనా. తరతరాల వలస పాలకుల దోపిడీ వల్ల ఒక నాడు అత్యంత వెనుకబడిన దేశంగానూ, ప్రజలు దుర్భర దారిద్య్రంలో మగ్గుతున్న దేశంగానూ ఉన్న చైనా నేడు ప్రపంచంలోనే అగ్రదేశాలలో ఒకటిగా అభివృద్ధి చెందింది. ప్రపంచంలోనే అమెరికా, జపాన్, జర్మనీల తర్వాత నాల్గవ ఆర్థిక వ్యవస్థగా రూపుదాల్చింది. ఒకప్పుడు తనపై పెత్తనం చేసిన గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ లాంటి సామ్రాజ్యవాద దేశాలను వెనక్కి నెట్టివేసింది. గత రెండు దశాబ్దాల కాలంలో చైనా దాదాపు ఏడాదికి 10 శాతం చొప్పున ఆర్ధికాభివృద్ధి సాధిస్తూ వచ్చింది. మరింత కచ్చితంగా చెప్పాలంటే 1979-2007 మధ్య కాలంలో చైనా సగటు వార్షికాభివృద్ధి రేటు 9.8 శాతం. ఇది అదే కాలంలో ప్రపంచ సగటు వార్షికాభివృద్ధితో పోల్చుకుంటే 6.8 శాతం అధికం. అంతేకాదు ప్రపంచ జిడిపిలో చైనా వాటా కూడా ఇంతే వేగంగా పెరిగింది.
1978లో ఇది 2.3 శాతం అయితే, 2006 నాటికి 14.5 శాతానికి పెరిగింది. జిడిపి పరిమాణం రీత్యా పోల్చుకున్నపుడు అమెరికా జిడిపి 12 ట్రిలియన్ డాలర్లు (ట్రిలియన్ అంటే లక్ష కోట్లు) అయితే, చైనా జిడిపి 4 ట్రిలియన్ డాలర్లు. ఇటీవల కాలంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పుకుంటున్న భారత దేశం జిడిపి 1 ట్రిలియన్ డాలర్లు మాత్రమే. 1 ట్రిలియన్ డాలర్ల క్లబ్బులో చేరామని మనం గొప్పగా సైతం చెప్పుకున్నాం. ప్రపంచ జిడిపిలో ి వాటా రీత్యా చూసుకుంటే 2000 నాటికి అమెరికా వాటా 27 శాతం, చైనా వాటా 12 శాతం, భారత దేశం వాటా కేవలం 5 శాతంవంద కోట్లకు పైగా జనాభా కలిగిన చైనాను 2050 నాటికల్లా మధ్య శ్రేణి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం తమ లక్ష్యమని 1980ల ఆరంభంలో చైనా కమ్యూనిస్టుపార్టీ నాయకత్వం ప్రకటించింది. కాని చైనా ఈ లక్ష్యాన్ని అనుకున్న సమయం కన్నా ఎంతో ముందుగానే సాధించే దిశగా పయనిస్తున్నది. 1980- 2000 మధ్య కాలంలో చైనా జిడిపి నాలుగు రెట్లు అధికమయింది.
చైనా తలసరి ఆదాయం 2020 నాటికి 3200 డాలర్లు కావాలన్నది లక్ష్యం. కాని 2008 నాటికే 3000 డాలర్ల తలసరి ఆదాయాన్ని చైనా సాధించింది. చైనా సాధించిన అభివృద్ధి గురించి మరింత సూటిగా చెప్పుకోవాలంటే 1952తో పోల్చుకున్నపుడు చైనా జిడిపి 400 రెట్లు పెరిగింది.
ఇంతటి అభివృద్ధిని చైనా తేలిగ్గా సాధించలేదు. అంతర్గతంగాను, బయటినుండి అనేక సవాళ్లను, అవరోధాలను ఎదుర్కొని విజయవంతంగా అధిగమించింది. ఈ అద్భుత అభివృద్ధి కమ్యూనిస్టుపార్టీ నాయకత్వాన స్థూలంగా సోషలిస్టు సూత్రాలకు కట్టుబడి సాగించిన పయనం మూలంగానే సాధ్యమయింది. చైనా విప్లవ అరవయ్యో వార్షికోత్సవం సందర్భంగా క్యూబాలో చైనా రాయబారి జావో రియాంగ్జి క్యూబా న్యూస్ ఏజన్సీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ ఇలా చెప్పారు:''చైనా చారిత్రక పురోగమన క్రమానికి అనుకూలమైన, అవసరమైన మార్గం సోషలిజమే అని గట్టిగా విశ్వసించిన చైనా ప్రజలు ఆ మార్గాన్ని ఎన్నుకున్నారు. సోషలిజం మాత్రమే అభివృద్ధిని కాపాడుతుంది, సాధిస్తుంది. సుసంపన్నమైన, నాగరిక, ప్రజాతంత్ర, సామరస్య దేశాన్ని సాధించడం మా లక్ష్యం.''
విప్లవం అనంతరం మొట్టమొదట కమ్యూనిస్టు పార్టీ చేపట్టిన ప్రధాన చర్య భూసంస్కరణలు. 1949-50లో అమలు జరిగిన భూసంస్కరణలు భూస్వాములనుండి స్వాధీనం చేసుకొని 40 శాతం భూమిని పేదలకు పంచి పెట్టింది. దీనిమూలంగా 60 శాతం మంది ప్రజలకు ప్రయోజనం కలిగింది. కొత్తగా భూమిని పొందిన రైతాంగం ఎంతో ఉత్సాహంగా పంటలు పండించారు. ఆ తర్వాత రైతులు సమిష్టి వ్యవసాయ క్షేత్రాలను కూడ అభివృద్ధి చేశారు. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు ఎంతో వేగంగా పెరిగాయి. అదే సమయంలో అప్పటి సోవియట్ యూనియన్ పారిశ్రామికాభివృద్దికి అవసరమైన యంత్రాలను, నిపుణులను కూడ పంపించి సహకరించడంతో చైనా ఈ రంగంలోనూ పురోగతి సాధించింది. సరిగ్గా ఇలాంటి దశలోనే ఒక్కసారిగా ఆర్థికాభివృద్ధిని అధికం చేయాలన్న పేరుతో చైనా పార్టీ నాయకత్వం ''పెద్ద అంగతో ముందుకు'' (గ్రేట్ లీప్ ఫార్వర్డ్) అనే విధానాన్ని చేపట్టింది.
1958-62 మధ్య కాలంలో ఈ విధానం అమలు జరిగింది. పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన స్టీలు, బొగ్గు, విద్యుత్తు లాంటి వాటి ఉత్పత్తికి వూహకందని రీతిలో లక్ష్యాలను నిర్దేశించి వాటికోసం తీవ్రమైన వత్తిడికి ప్రభుత్వం పాల్పడింది. దీనితో నాణ్యతతో నిమిత్తం లేకుండా పరిమాణం మాత్రమే పెంచడంతో పెరిగిన ఉత్పత్తిలో వృధా వాటా అధికం అయ్యే పరిస్థితి ఏర్పడింది. మరోవైపున రైతులు స్వచ్ఛందంగా సమిష్టి క్షేత్రాలను ఏర్పాటుచేసుకోవడానికి బదులు, వారిని బలవంతంగా కమ్యూన్లుగా మార్చివేసింది. అందరూ కలిసి పనిచేయడం, ఒకేచోట తినడం లాంటి పద్ధతుల వల్ల వ్యక్తిగత ప్రోత్సాహకాలకు అవకాశం లేకపోవడంతో ఉత్పత్తి క్షీణించింది. ఇలాంటి మార్పులతో గొప్ప ముందడుగు అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయింది. ఎన్నో అనర్ధాలు కూడ సంభవించాయి. దీని తర్వాత అంతకన్నా పెద్ద పొరపాటుకు చైనా కమ్యూనిస్టు పార్టీ పూనుకుంది. అదే 1966 నుండి పదేళ్ల పాటు కొనసాగిన ''సాంస్కృతిక విప్లవం''.
భౌతిక ఉత్పత్తిని పెంచేశాము కాబట్టి ఇక మిగిలింది ప్రజల చైతన్యాన్ని పరివర్తన చేయడం మాత్రమే అన్న పేరుతో ఇది సాగింది. ఈ కాలంలో జరిగిన తప్పిదాలకు లెక్కేలేదు. లీ షావ్‌చీ, డెంగ్ సియావో పింగ్ లాంటి పార్టీ అగ్రనేతలను పెట్టుబడిదారీ మార్గానికి అనుకూలురని ముద్రవేసి వేధింపులకు, నిర్బంధాలకు గురిచేశారు. వయసు మీరిన మావోను అడ్డం పెట్టుకొని ఆయన భార్య జియాంగ్ కింగ్ నాయకత్వాన ''దుష్ట చతుష్టయం'' రాజ్యమేలింది. ఎంతో మంది మేధావులను శారీరక శ్రమ చేయాలనే పేరుతో విద్యాలయాలనుండి తొలగించి పంటపొలాలలోకి పంపడం లాంటి విపరీత చర్యలు ఈ కాలంలోనే చోటుచేసుకున్నాయి. విప్లవంలోను, అనంతర కాలంలోను పార్టీకి ఎంతో విశ్వాసంతో సేవలందించిన ఎందరో ఈ విధమైన నిర్బంధచర్యలకు గురయ్యారు. 1976 నాటికి చైనా కమ్యూనిస్టు పార్టీయే ఈ ఘోర తప్పిదాన్ని గుర్తించి, సవరించుకుంది. దాని ఫలితంగానే డెంగ్ సియావో పింగ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
డెంగ్ నేతృత్వంలో చైనా పార్టీ సంస్కరణల బాటను చేపట్టింది. అదే సమయంలో బారత్‌తో సహా ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక సంస్కరణలను చేపట్టాయి. నయా ఉదారవాద బాటలో చేపట్టిన ఈ చర్యలకు, చైనాలో సంస్కరణలకు కొన్ని పోలికలు ఉన్నప్పటికీ ఈ రెండు తరహాల నేపధ్యం మాత్రం పూర్తి భిన్నమైనది. విదేశీ పెట్టుబడులకు స్వేచ్ఛగా ప్రవేశించే అవకాశం కల్పించిన చైనా, తన దేశంలో అపారంగా లభించే మానవవనరులతో వాటిని సద్వినియోగం చేసుకొని తన ఉత్పత్తిని విపరీతంగా పెంచుకున్నది. సంపన్న దేశాలతో పోల్చుకున్నపుడు ఎంతో చౌకగా తయారయిన ఈ ఉత్పత్తులను ఆయా దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా తన విదేశీ మారక నిల్వలను బ్రహ్మాండంగా పెంచుకున్నది. ఈ సరళీకృత విధానాల వల్ల అనివార్యంగానే ప్రాంతీయ అసమానతలు, వ్యక్తుల ఆదాయాల మధ్య అసమాతనలు చోటుచేసుకున్నాయి. వాటిని గుర్తించి సరిచేసుకొని తనదైన రీతిలో చర్యలు చేపడుతున్నది. ప్రజాస్వామ్యం కోసం అంటూ తియాన్మెన్ స్క్వేర్‌లో విద్యార్థులు, యువకులు సమీకృతులైన ఘటనను ఆసరాగా చేసుకుని చైనాను అస్థిరత్వం పాల్జేయాలని పశ్చిమ దేశాలు ఎన్ని కుతంత్రాలకు పాల్పడినప్పటికీ చైనా ప్రభుత్వం దానిని సమర్ధవంతంగా అధిగమించింది.
ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలను పెంచుకున్న చైనా ఇటీవల సంభవించిన ప్రపంచ పెట్టుబడి దారీ సంక్షోభం ప్రభావానికి సహజంగానే గురయింది. అయినప్పటికీ, ఈ ప్రభావం నుండి బయట పడడానికి ఎంచుకున్న మార్గంలోనూ చైనా తన విశిష్టతను నిలుపుకున్నది. పెట్టుబడిదారీ దేశాలన్నీ ఈ సంక్షోభానికి కారణమయిన ఆర్ధిక సంస్థలు, పారిశ్రామిక సంస్థలకే సహాయాన్ని అందచేసి ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. సంక్షోభం మూలంగా ఉపాధి కోల్పోయి వీధులపాలయిన లక్షలాది సాధారణ ప్రజానీకాన్ని పట్టించుకోవడం లేదు. దీనికి పూర్తి భిన్నంగా చైనా ఇప్పటి వరకు విదేశీ మార్కెట్లను దృష్టిలో పెట్టుకొని సాగించిన ఉత్పత్తిని దేశీయ మార్కెట్‌లో విక్రయించడానికి, ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి అనేక చర్యలు తీసుకుంటున్నది. ప్రజల ఉపాధిని పరిరక్షించడానికి నేరుగా చర్యలు గైకొంటున్నది. ఇదే చైనా మార్గం ప్రత్యేకత. చైనా ఆర్థిక సంస్కరణలను చేపడుతున్నది, మేమూ చేపడుతున్నాము అని చెప్పే వారికి ఈ చర్యలు సమాధానం చెబుతాయి.
చైనా అనుసరిస్తున్న సంస్కరణల మార్గము, దాని ద్వారా సాధించిన అభివృద్ధి ఫలితాలు, కొన్ని ప్రతికూల ఫలితాలు మన ముందున్నాయి. ఏదేమయియినప్పటికీ చైనా సాధించిన అపారమైన ఆర్థికాభివృద్ధి తిరుగులేని వాస్తవం. అందుచేత సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకుంటూ, అది అనుసరించిన మార్గంలోని తప్పొప్పులను తులనాత్మకంగా అంచనా వేయవలసిన అవసరం ఉంది. అలాంటి విశ్లేషణ, గుణపాఠాలు మాత్రమే ప్రపంచ దేశాల ప్రజానీకానికి ఉపయోగపడతాయి.

Subscribe to:
Comments (Atom)