బాబ్రీ మసీదు-రామ జన్మభూమి వివాదంపై ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న కేసులో అలహాబాద్ హై కోర్టు లక్నో ధర్మాసనం ఇచ్చిన తీర్పు వివాదాన్ని ముగించేదిగా లేదు. వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలు చేసి ఈ వివాదంలో కక్షిదారులుగా ఉన్న సంస్థలకు కేటాయించాలని ధర్మాసనం గురువారం నాడు ఇచ్చిన తీర్పు ప్రాతిపదిక ఏమిటనేది పరిశీలించాలి. ఈ తీర్పు అనేక ప్రశ్నలకు ఆస్కారమిచ్చింది. న్యాయమూర్తులు సుధీర్ అగర్వాల్, ఎస్.యు.ఖాన్, డి.వి.శర్మలతో కూడిన ధర్మాసనం కొన్ని అంశాలపై ఏకాభిప్రాయాన్ని, మరికొన్ని అంశాలపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూ మెజారిటీ అభిప్రాయం ఆధారంగా ఇచ్చిన ఈ తీర్పు అందులో ఇమిడి ఉన్న అంశాల సంక్లిష్టతను సూచిస్తున్నది. వివాద స్వభావంతో పాటు అనేక కారణాల రీత్యా అది క్లిష్టమైన వ్యవహారమే అవుతుంది. సుదీర్ఘ చారిత్రక కాలంతో, మతపరంగా రెచ్చగొట్టబడిన మనోభావాలతో, భిన్నాభిప్రాయాలకు తావునిచ్చే నిర్ధారణలతో ఈ వివాదం కూడి ఉండటమే ఇందుకు కారణం. ఆరు దశాబ్దాలుగా న్యాయపరమైన వివాదాలు కొనసాగుతుండగానే అనేక పరిణామాలకు గురైన ఈ వివాదం ఆస్తి హక్కులకు సంబంధించిన సాధారణ స్థల వివాదం కాదు. దేశంలో మతపరమైన విద్వేషాలను, కల్లోలాలను సృష్టించేందుకు బిజెపి, సంఘ పరివార్, ఇతర మతోన్మాద సంస్థలు, శక్తులు ఈ వివాదాన్ని వినియోగించుకున్నాయి. రాజకీయ, ఇతర లబ్దిని పొందాయి. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాలు అవకాశవాదంగా వుంటూ, ఈ వివాదానికి ఆజ్యం పోసే విధంగా వ్యవహరిస్తూ వచ్చాయి.
ధర్మాసనం తుది తీర్పును రూపొందించేందుకు ఇంకా సూచనలు, దరఖాస్తులు దాఖలు చేసేందుకు అవకాశం ఉండటం, మూడు భాగాలుగా స్థల విభజన కూడా ఈ వ్యవహారం కొనసాగింపునకు దారి తీస్తాయి. ప్రస్తుతమిచ్చిన ఉత్తర్వును మార్పు చేసే వరకు, లేదా తొలగించే వరకు మూడు మాసాల పాటు యధాతధ స్థితి కొనసాగనుంది. ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీలు దాఖలు చేసే అవకాశంతో పాటు, తుది పరిష్కారం కూడా సుప్రీం కోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉండటంతో, సహజంగానే బాధితులమనుకునే పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాయి.
సున్నీ వక్ఫ్ బోర్డు సుప్రీం కోర్టులో అప్పీలు చేస్తామని ప్రకటించగా, ఈ వివాదంలో భాగస్వాములైన ఇతర పక్షాలు కూడా అలా చేసే అవకాశాన్ని త్రోసిపుచ్చటానికి లేదు. ఎవరు సుప్రీం కోర్టుకు వెళ్ళినా, మిగిలిన కక్షిదారులు కూడా ఆ కేసులో ప్రతివాదులు గాక తప్పదు. హిందువులు, ముస్లింలు, నిర్మోహి అఖాడాలను బాబ్రీ మసీదు-రామ జన్మభూమి వివాదాస్పద స్థలం సంయుక్త హక్కుదారులుగా తన ప్రాధమిక తీర్పులో నిర్ధారించిన ధర్మాసనం మూడు భాగాలను ఎవరెవరు, ఎలా వినియోగించుకోవాలో, నిర్వహించుకోవాలో నిర్ధారించాల్సి ఉంది. న్యాయస్థానం నియమించిన కమిషనర్ రూపొందించిన మ్యాప్ ప్రకారం ప్రస్తుతం తాత్కాలిక ఆలయంగా రాముని విగ్రహం ఉన్న ప్రాంతాన్ని హిందువులకు, రామ చబూత్ర, సీతా రసోయిగా చూపబడిన ప్రాంతం నిర్మోహి అఖాడాకు తుది తీర్పులో కేటాయిస్తామని ధర్మాసనం పేర్కొంది. మిగిలిన ప్రాంతం సున్నీ వక్ఫ్ బోర్డుతో సహా కక్షిదారులైన మరో రెండు ముస్లిం సంస్థలకు కేటాయించాలని, కొన్ని సర్దుబాట్లు అవసరమైతే వివాదాస్పద స్థలానికి ఆనుకుని ఉన్న కొంత భాగాన్ని పరిహారంగా ఇవ్వవచ్చునని న్యాయస్థానం పేర్కొంది. ఇలాంటి సర్దుబాట్లపై వివాదాలు రేకెత్తే అవకాశాన్ని త్రోసిపుచ్చటానికి లేదు.
బాబ్రీ మసీదుగా పరిగణించబడుతూ వచ్చిన నిర్మాణంలో 1949 డిసెంబరు 23న ప్రధాన గుమ్మటం కింద రామ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 1992 ఆగస్టు 6న సంఫ్‌ు పరివార్ మతోన్మాద శక్తులు బాబ్రీ మసీదును కూల్చి వేశాయి. జాతీయ సమగ్రతా మండలికి, తద్వారా దేశానికి ఇచ్చిన హామీని బిజెపి ఉల్లంఘించింది. ఈ ప్రధాన గుమ్మటం కిందనున్న ప్రాంతమే రామ జన్మభూమి అని న్యాయస్థానం నిర్ధారణకు రావటానికి మనోభావాలే ప్రాతిపదిక. వివాదాస్పద కట్టడాన్ని కూల్చి వేసిన శక్తుల అరాచకంపై న్యాయస్థానం ఏమి అభిప్రాయం వెలిబుచ్చిందో పరిశీలించాలి. మతం పేరుతో, మనోభావాల పేరుతో ఉద్రేకాలను, ఉద్రిక్తతలను, కల్లోలాలను సృష్టించే మతోన్మాద శక్తుల అరాచకాలను అరికట్టేందుకు లౌకిక, ప్రజాతంత్ర వ్యవస్థలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగానే దేశ ప్రతిష్టను మంటగలిపే, దేశ సమైక్యతకు, సమగ్రతకు, లౌకిక వ్యవస్థకు ముప్పు తెచ్చే అలాంటి నేరస్థ మతోన్మాదంపై మౌనం వహించరాదు. అలాంటి అవాంఛనీయ ధోరణులు మతోన్మాద శక్తులు రెండువైపులా ఇంకా పెచ్చరిల్లడానికి, మతపరంగా వివాదాలను రెచ్చగొట్టడానికి, విధ్వంస, హత్యాకాండను, అరాచకాలను, కల్లోలాలను సృష్టించడానికి ప్రోత్సహించటానికి తావిస్తాయి.
అయోధ్య వివాదం తీర్పు రానున్న తరుణంలో దేశంలో మతోన్మాద శక్తులు ఎక్కడ ఏ ఉపద్రవం తెచ్చి పెడతాయోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. శాంతిభద్రతల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. రెచ్చగొట్టేందుకు మతోన్మాద శక్తులు చేసే ప్రయత్నాలకు దేశ ప్రజానీకం లోనుకాకుండా, శాంతిని, మత సామరస్యాన్ని పాటించాల్సిన అవసరంపై అన్ని వైపుల నుండి పిలుపులు ఇవ్వాల్సి వచ్చింది. తీర్పు తమకు అనుకూలంగా రాకపోతే రామాలయ నిర్మాణానికి 'ఉద్యమానికి' దిగుతామని, సుప్రీం కోర్టు తీర్పుకు కూడా వేచి ఉండబోమని విశ్వహిందూ పరిషత్ నాయకులు ప్రకటనలు చేయటం మతోనాన్మద శక్తుల స్వభావాన్ని వెల్లడిస్తున్నది. లక్నో ధర్మాసనం తీర్పు అయోధ్య వివాదానికి చరమగీతం పాడటం లేదు. మతదోన్మాద శక్తుల కుట్రల పట్ల ప్రజానీకం నిత్య జాగరూకతతో ఉండాలి. లౌకికవాదం, దేశ సమగ్రత, మత సామరస్యం, శాంతి పరిరక్షణ కోసం నిలవాలి. రాజ్యాంగపరంగా అత్యున్నతమైన సుప్రీంకోర్టు ఈ వివాదానికి పరిష్కారం చూపాలి.
Note:Article from Prajasakti.com
Friday, 1 October 2010
Thursday, 16 September 2010
సెప్టెంబరు17 చరిత్రకు వక్రభాష్యాలు
జమిందారీ దోపిడీకి, వెట్టిచాకిరీకి, నైజాం నిరంకుశ రాచరికానికి వ్యతిరేకంగా ప్రారంభమైన రైతాంగ సాయుధ పోరాటమే హిందూ, ముస్లిం పేదలను ఐక్యంగా నడిపింది. కులమత భేదాలకు అతీతంగా పోరాట యోధులు రక్తతర్పణ చేశారు. ఇప్పుడు సమస్య విలీనమా, లేక విమోచనా అన్నది కాదు. నాటి పోరాట కర్తవ్యాలు ఇంకా పూర్తి కాలేదు. చర్చ జరగవల్సిందీ, ఉద్యమించవలసిందీ వాటి గురించే. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ సందర్భంగా గతాన్ని స్మరించుకునేది ఇందుకోసమే.
సెప్టెంబర్ 17 మరోసారి చర్చనీయాంశమైంది. విలీనమా? విమోచనా? విద్రోహమా? అంటూ కొన్ని రాజకీయ పార్టీలు కూడా చర్చోపచర్చలు చేస్తున్నాయి. అందరూ తెలంగాణా గురించే మాట్లాడుతున్నారు. ఏ తెలంగాణ గురించి అన్నదే అసలు సమస్య. ఈ చర్చోపచర్చల్లో, అసలైన సమస్యలు మరుగున పడుతున్నాయి. ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుల పాత్ర, విశాలాంధ్రలో ప్రజారాజ్యం నినాదం గురించి ఎవరికి తోచిన రాతలు వారు రాస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ, సమైక్య రాష్ట్రం గురించి వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చర్చకు ప్రాధాన్యత ఏర్పడింది. వేరు తెలంగాణ గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు. కాని వీరతెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యం, దాని పునాదులు, తీరుతెన్నులు వేరు. వీరతెలంగాణ పోరాటాన్ని, వేరు తెలంగాణ చర్చను, కలగాపులగం చేయటం సమంజసం కాదు. చరిత్రను చరిత్రగా చూడాలి.
వీర తెలంగాణ విప్లవ పోరాటం చారిత్రాత్మకమైనది. మధ్య యుగాల నాటి అణచివేతపై ప్రజా తిరుగుబాటు. దేశంలోనే అతిపెద్దదైన హైదరాబాద్ సంస్థానంలో దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్లు, జమిందార్ల నిరంకుశ ఫ్యూడల్ దోపిడీకి హద్దుల్లేవు. ముందు జమిందార్లు, జాగీర్దార్ల భూముల్లో దున్నిన తరువాతనే రైతాంగం తమ భూమి దున్నుకోవాలి. చేతివృత్తిదార్లు తమ ఉత్పత్తులను వీరికి ఉచితంగా కట్టబెట్టాలి. వీరి కుటుంబాలలో ఉత్సవాల సందర్భంగా గొర్రెలు, మేకలు, కోళ్ళు ఉచితంగా ముట్టజెప్పాలి. ఇవన్నీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన శిస్తుకు అదనం. జమిందార్ల బిడ్డలను అత్తవారింటికి పంపేటపుడు, వారికి తోడు అత్తవారింట చాకిరి చేయడానికి దళిత బాలికలను పంపించేవారు. జమిందార్లు, అధికారుల ఇండ్లలోనూ, కార్యాలయాల్లోనూ వెట్టిచాకిరీకి, గ్రామంలో కుటుంబానికి ఒకరు చొప్పున పంపాలి. ఈ ఫ్యూడల్ దోపిడీికి, వెట్టిచాకిరీకి, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఉప్పొంగిన తిరుగుబాటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం.
ఈ పోరాటంలో తొలి అమరుడు బందగీ. ఆయనను 1941 జూలై 17న భూస్వామ్య గూండాలు హత్యచేశారు. సంఘం కార్యకర్త (ఆంధ్రమహాసభను సంఘం అని పిలిచేవారు) ఐలమ్మ భూమిమీద పంటను కాజేయడానికి వచ్చిన దేశ్‌ముఖ్‌ల గూండాలను రైతాంగం తరిమికొట్టింది. ఐలమ్మ పంటకు రక్షణ కల్పించింది. ఈ అవమాన భారాన్ని తట్టుకోలేని దేశ్‌ముఖ్‌ల గూండాలు 1946 జూలై 4న దొడ్డి కొమరయ్యను పొట్టన పెట్టుకున్నారు. దానితో అగ్గి రగిలింది. క్రమంగా తిరుగుబాటు సాయుధ రూపం దాల్చింది.
1928లోనే మాడపాటి హనుమంతరావు నాయకత్వంలో ఆంధ్రమహాసభ ప్రారంభమైంది. 1934లో కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రలో ఆవిర్భవించింది. 1940 నాటికే నైజాంలో ఆంధ్రమహాసభను సమైక్య ప్రజాసంస్థగా, నైజాం వ్యతిరేక ప్రజాశక్తుల వేదికగా కమ్యూనిస్టు పార్టీ రూపొందించింది. ఫ్యూడల్ వ్యతిరేక, నైజాం వ్యతిరేక పోరాటం నడిపింది కమ్యూనిస్టు పార్టీ. జమిందార్ల దౌర్జన్యాలు, నైజాం సైన్యాల అణచివేత, రజాకార్ల (వాలంటీర్ల పేరుతో ఏర్పడిన నిజాం ప్రైవేటు సైన్యం) దాడులను ఎదిరించి సాగిన సుదీర్ఘ పోరాటమది. ఈ క్రమంలోనే 1946లో విశాలాంధ్రలో ప్రజారాజ్యం కోసం పుచ్చలపల్లి సుందరయ్య పిలుపునిచ్చారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం ప్రకటించినప్పటికీి, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి నిరాకరించింది. నైజాం సర్కారుకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం కొనసాగింది.
స్వాతంత్య్రోద్యమకాలంలో, హైదరాబాద్ వంటి సంస్థానాలకు వ్యతిరేకంగా పోరాటానికి కాంగ్రెస్ సిద్ధపడలేదు. స్వాతంత్య్రానంతరం కూడా నైజాంతో సహా సంస్థానాధీóశులతో రాజీకే సిద్ధపడింది. నైజాం సర్కారు స్వతంత్ర రాజ్యంగా కొనసాగడానికి కేంద్ర కాంగ్రెసు ప్రభుత్వం అంగీకరించింది. కమ్యూనిస్టుపార్టీ నేతృతంలో సాగిన సాయుధ రైతాంగ పోరాటం మాత్రం అసఫ్‌జాహీ వంశపు మధ్యయుగాల నాటి రాచరిక పాలన పునాదులను కుదిపేసింది. నైజాం సర్కారు కూలిపోవడం తథ్యం అని తేెలిపోయింది. అదే జరిగితే ఈ ప్రాంతమంతా కమ్యూనిస్టుల అధిపత్యం కిందకు వస్తుంది. అది గమనించిన నెహ్రూ ప్రభుత్వం, గోల్కొండ ఖిల్లా పునాదులు కదులుతున్న సమయంలో, 1948 సెప్టెంబర్ 13న యూనియన్ సైన్యాలను రంగంలోకి దించింది. అందుకే నాలుగు రోజులు తిరగకుండానే, ఏ ప్రతిఘటన లేకుండానే సెప్టెంబర్ 17న నైజాం సర్కార్ లొంగిపోయింది.
నిజాం లొంగిపోయిన మరుక్షణం, ఆ ప్రజాకంటకుడైన రాజునే రాజ ప్రముఖ్‌గా నెహ్రూ ప్రభుత్వం నియమించిన విషయం మరువలేం. ఏడాదికి 50లక్షలు నష్ట పరిహారంగానూ, మరో 50లక్షల రూపాయలు రాజ భరణాలుగానూ ముట్టజెప్పింది. గ్రామాల నుండి పారిపోయిన జమిందార్లు, జాగీర్దార్లు, షేర్వాణీలు విడిచి ఖద్దరు బట్టలు, తెల్ల టోపీిలతో మళ్లీ గ్రామాలకు చేరుకోడానికి, పేదల అధీóనంలో ఉన్న భూములను తిరిగి స్వాధీóనం చేసుకునేందుకు నెహ్రూ సైన్యాలు అండగా నిలిచాయి. ప్రతిఘటించిన రైతాంగం పైన భయంకరంగా దాడులు చేశాయి. ఈ పరిస్థితులలో సుదీర్ఘపోరాటంలో సాధించుకున్న భూములు, ఇతర హక్కుల పరిరక్షణ కోసం కమ్యూనిస్టుపార్టీ నాయకత్వంలో రైతాంగం సాయుధ పోరాటం కొనసాగించక తప్పలేదు. 1951 అక్టోబర్ 21 వరకు ఈ పోరాటం సాగింది.
భూమి కోసం, భుక్తికోసం సాగిన ఈ పోరాటంలో 6వేల మంది ప్రాణాలొడ్డారు. 10వేల మంది కమ్యూనిస్టులు, ప్రజాపోరాటయోధులు మూడు, నాలుగు సంవత్సరాల పాటు నిర్బంధ శిబిరాలలో, జైళ్ళలో మగ్గవలసి వచ్చింది. 50వేల మంది పోలీస్ క్యాంప్‌లలోనూ, మిలటరి క్యాంప్‌లలోనూ వారాలు, నెలలతరబడి చిత్రహింసలకు గురయ్యారు. గ్రామాల్లో లక్షలాది ప్రజల మీద దాడులు చేశారు. ఆస్తులు లూటీ చేశారు. మహిళలను మానభంగాలకు, అవమానాలకు గురిచేశారు. నెహ్రూ సైన్యాలు రాక ముందు 1,500 మంది మరణిస్తే, అవి చేరిన తరువాత మరో 2,500 మంది ప్రత్యక్షంగా వారి తుపాకులకు బలయ్యారు. మరో 2వేల మంది కాన్‌సన్‌ట్రేషన్ క్యాంప్‌లలో తనువు చాలించారంటే, నెహ్రూ సైన్యాలు ఎవరిమీద యుద్ధానికి వచ్చాయో అర్థ్ధం చేసుకోవచ్చు. కాశ్మీర్ సంస్థానం విలీనం సందర్భంగా పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో కేంద్రం ఎంత ఖర్చు చేసిందో, ఇక్కడ సాయుధ రైతాంగ పోరాటాన్ని అణచడానికి కూడా అంత ఖర్చు చేసింది.
ఈ సాయుధ రైతాంగ పోరాటంలో 10వేల మంది గ్రామదళ సభ్యులు, 2వేల మంది గెరిల్లాదళ సభ్యులతో కూడిన ప్రజాసైన్యం పాల్గొన్నది. 16వేల చ.మైళ్ళ భూభాగంలో ప్రజారాజ్యం స్థాపించింది. 10 లక్షల ఎకరాల భూమి పంచింది. 3వేలగ్రామ రాజ్యాలను ఏర్పాటుచేసింది. బేదఖళ్లు నిలిచిపోయాయి. వెట్టిచాకిరి రద్దు చేశారు. వడ్డీ భారాల నుంచి పేద రైతులకు విముక్తి కల్పించారు. వ్యవసాయ కార్మికుల కనీస వేతనాలు అమలు జరిపారు. ప్రజాకంటక అటవీ అధికారులను తరిమివేసి గిరిజనులను కాపాడారు. ఈ పోరాటంలో పురుషులతో సమానంగా, మహిళలు తమ ప్రాణాలొడ్డి పోరాడారు. ఈ క్రమంలోనే మహిళలకు పురుషులతో సమాన హక్కులు గ్యారెంటీ చేయబడ్డాయి. కుల,మత భేదాలను మరిచి పేదలంతా సమైక్యంగా అగ్రకుల భూస్వాముల దురహంకారంపై తిరగబడ్డారు. గ్రామరాజ్యాల్లో అందరూ సమానంగా గుర్తింపు పొందారు. ఈ పోరాట ఫలితంగానే భూమి సమస్య దేశ ఎజెండా మీదకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా భూసంస్కరణల చట్టం, కౌల్దారి రక్షణచట్టం చేయవలసి వచ్చింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కూడా ఈ పోరాటం మార్గం సుగమం చేసింది.
హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం కావటంతో, మరాఠీ మాట్లాడే ఐదు జిల్లాలు మహారాష్ట్రలోను, కన్నడం మాట్లాడే 3జిల్లాలు కర్ణాటకలోను విలీనం చేశారు. దీనితో మద్రాసు నుండి ఆంధ్రప్రాంతాన్ని వేరు చేయాలన్న ఉద్యమం ఊపందుకున్నది. పొట్టి శ్రీరాములు మరణానంతరం ఆంధ్రరాష్ట్రం అవతరించింది. 1892లో పుట్టిన ఆర్యసమాజ్ కానీ, 1927లో పుట్టిన ఇత్తెహాద్ ఉల్ ముస్లిమీన్ కాని, హిందూ-ముస్లిం సామాన్య ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడానికి ప్రయత్నించాయి. హుమ్నాబాద్, గుల్బర్గా, ఉద్గిర్, ధూల్‌పేట వంటి ప్రాంతాల్లో మత ఘర్షణలను రెచ్చగొట్టారు. జమిందారీ దోపిడీకి, వెట్టిచాకిరీకి, నైజాం నిరంకుశ రాచరికానికి వ్యతిరేకంగా ప్రారంభమైన రైతాంగ సాయుధ పోరాటమే హిందూ, ముస్లిం పేదలను ఐక్యంగా నడిపింది.
కులమత భేదాలకు అతీతంగా పోరాట యోధులు రక్తతర్పణ చేశారు. ఇప్పుడు సమస్య విలీనమా, లేక విమోచనా అన్నది కాదు. నాటి పోరాట కర్తవ్యాలు ఇంకా పూర్తి కాలేదు. చర్చ జరగవల్సిందీ, ఉద్యమించవలసిందీ వాటి గురించే. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ సందర్భంగా గతాన్ని స్మరించుకునేది ఇందుకోసమే. సెప్టెంబర్ 17 విలీనం నిజమే, విమోచనా నిజమే. హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం అయినది ఒక చారిత్రక వాస్తవం. నైజాం రాచరిక పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్య పాలనలో అడుగుపెట్టిందీ నిజమే. ముస్లిం రాజు నుండి హిందువులకు విమోచన కలిగించినట్లు చిత్రీకరిస్తూ మతం రంగు పులిమే వారు కొందరైతే, ప్రత్యేక తెలంగాణా వాదానికి ముడిపెట్టే వారు మరికొందరు. ఈ రెండు వాదనలు చరిత్రకు వక్ర భాష్యాలే.
ఇక విద్రోహ దినం అనటంలో అర్థంలేదు. నిజాం నిరంకుశ రాచరికం కూలిపోవడాన్ని సర్వత్రా హర్షించారు. తర్వాత కాలంలో కొందరు, ఈ సాయుధ పోరాటాన్ని 1951 అక్టోబరు తర్వాత కూడా కొనసాగించి వుండాల్సిందనే వాదనను ముందుకు తెచ్చారు. ఇక్కడి నుండి దేశం మొత్తాన్ని పెట్టుబడిదారీ, భూస్వామ్య పాలన నుండే విముక్తి చేయగలిగివుండే వారమని వీరి వాదన. కానీ వాస్తవ పరిస్థితులు, దేశంలో ప్రజలు అందుకు సిద్ధంగా లేరన్న వాస్తవం వీరికి ఆరు దశాబ్దాలు గడిచినా అర్థ్ధం కాలేదు. 1948లో కలకత్తాలో జరిగిన కమ్యూనిస్టు పార్టీ తీర్మానం, భారతదేశానికింకా స్వాతంత్య్రం రాలేదనే అంచనా ప్రకటించింది. అది కూడా సరైంది కాదని త్వరలోనే తేలిపోయింది. తెలంగాణా ప్రాంతంలో ఒకరిద్దరు నాయకులు, ఆనాటి హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయొద్దని ప్రకటించటంతో, వారి మీద కమ్యూనిస్టు పార్టీ విశాలాంధ్ర కమిటీి చర్య తీసుకున్నది. ఈ ఘటనలను కూడా, ఇప్పుడు కొందరు వక్రీకరించి తప్పుడు భాష్యం చెబుతున్నారు.
ఈ పోరాటం ఎజెండా పైకి తెచ్చిన భూమి సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. కేంద్రం, కౌల్దారి చట్టం గురించి గాని, భూసంస్కరణ చట్టం గురించి గాని ముందుగానే ఊదరగొట్టి భూస్వాములు జాగ్రత్త పడడానికి తోడ్పడింది. కాపాడుకోగలిగినంత భూమిని భూస్వాములు అడ్డదారుల్లో సర్దుకున్న తరువాత కూడా 16,63,881 ఎకరాలు మిగులు భూమి ఉన్నట్లు డిక్లేరేషన్ ఇవ్వక తప్పలేదు. అయినా, నేటికీ అందులో మూడో వంతు కూడా పేదలకు పంచలేదు. ఇది కాక 17,35,000 ఎకరాల సాగుకు లాయకైన పడావు భూమి ఉన్నది. 16,90,000 ఎకరాల పచ్చిక బయళ్ళు, 6,92,500 ఎకరాల ఇతర భూములు కూడా పంచేందుకు అవకాశం ఉన్నదని కూడా తేలింది. ఇది కాక ఫారెస్టు, రెవెన్యూ శాఖల మధ్య వివాదాల్లో ఉన్న మరో 75 లక్షల ఎకరాల భూమి, మరో 3,75,000 ఎకరాల దేవాదాయ భూమి కూడ పంచేందుకు అవకాశం ఉన్నది. అయినా ప్రభుత్వం ఈ పని చేయడానికి సిద్ధ్దంగా లేదు. గత ఐదారు సంవత్సరాలలో పంచినట్లు చెప్పుకుంటున్న రాళ్ళురప్పల భూమి లెక్కిస్తే కూడా సుమారు 7లక్షల ఎకరాలకు మించలేదు. అది కూడా కాగితాలకే పరిమితమైంది. రాష్ట్ర ప్రభుత్వమే నియమించిన కోనేరు రంగారావు కమిటీ కూడా రాష్ట్రంలో భూమిలేని పేదలందరికీి భూమి పంచవచ్చునని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో భూమిలేని వ్యవసాయ కూలీల సంఖ్య 1991లో ఒక కోటి 10లక్షలు ఉండగా, ఇపుడది సుమారు 2కోట్లకు చేరుకున్నది. అటవీ హక్కుల చట్ట ప్రకారం కూడా గిరిజనులకు, తరతరాలుగా సాగుచేసుకుంటున్న నిరుపేదలకు పంచదగిన భూమి 30లక్షల ఎకరాలు ఉన్నది. ఇందులో 80శాతం తెలంగాణలోనే ఉన్నది. ఇప్పటికీ ప్రభుత్వం గుర్తించింది 3లక్షల ఎకరాలు మాత్రమే. కౌలు సమస్య పరిష్కారం కాలేదు. వీటి పర్యవసానంగానే 2007లో, రాష్ట్రంలో మరోసారి 7మాసాల పాటు మహత్తర భూ పోరాటం సాగింది. ఇప్పటికీ కులవివక్ష అంతం కాలేదు. గిరిజనుల, వెనుకబడిన తరగతుల, మహిళల సామాజిక సమస్యలు పరిష్కారం కాలేదు. మిగిలి ఉన్న ఈ చారిత్రక కర్తవ్యం గురించి చర్చ జరగాలి. ప్రజల్లో చైతన్యం పెంచి, వారిని కర్తవ్యోన్ముఖులను చేయాలి.
Tuesday, 4 May 2010
అమెరికన్ ప్రజాస్వామ్యాన్ని కబళించిన కార్పొరేట్ స్వామ్యం
2010 జనవరి 21....ఆ రోజు అమెరికన్ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక చీకటి రోజు. మరొక ఘోర పతనం. ఎన్నికలకు నిధులు సమకూర్చడం ద్వారా బహుళజాతి కంపెనీలు చేసే రాజకీయ వ్యయం మీద ప్రభుత్వం నిషేధం విధించరాదని అమెరి కన్ సుప్రీం న్యాయస్థానం తీర్పునిచ్చింది ఆ రోజున. ఈ తీర్పు ప్రభుత్వ విధానాలను జాతీ యంగా, అంతర్జాతీయంగా ప్రభావితం చేసేం దుకు బహుళజాతి కంపెనీలకు పూర్తి అవకాశం రాసిచ్చినట్లే. అమెరికన్ రాజకీయ వ్యవస్థను కార్పొరేట్ శక్తులు మరింతగా కబళించడానికి ఊతం ఇచ్చే తీర్పు ఇది.
''ఈ తీర్పు అమెరికన్ ప్రజాస్వామ్యం గుండెల్లో దిగబడిన పిడిబాకు. బహుళజాతి కంపెనీలు తమ బొక్కసాలనుండి కాస్తంత ఖర్చుచేసి ఎన్నికలను ప్రభావితం చెయ్యడానికీ, ఆనక ఎన్నికయిన ప్రజా ప్రతినిధులమీద ఒత్తిడి చేసి మరీ తమ కోర్కెలు ఈడేర్చేలా చేసుకునేం దుకూ మార్గం సుగమం చేసింది'' అని న్యూయా ర్క్ టైమ్స్ పత్రిక వ్యాఖ్యానించింది. తీర్పు విషయమై న్యాయమూర్తులలో విభజన ఓటింగ్ జరిగింది. 5-4 ఓట్ల తేడాతో ఈ తీర్పు వెలువడింది. జస్టిస్ ఆంథోని ఎం. కెనడీకి ఊతంగా మరో నలుగురు ప్రతీఘాత జడ్జిలు (జనాలను తప్పుదోవ పట్టించడానికి కన్సర్వేటివ్ జడ్జిలు అనే పదం వాడుతున్నారు) కలవడంతో మెజారిటీ తీర్పు ఇట్లా వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జాన్ జి. రాబర్ట్ జూనియర్ అతి సున్నితంగా తేల్చేసే అవకాశం ఉన్న ఈ వాజ్యాన్ని లాగి పీకి పాకంపెట్టి మరీ ఇంతదాకా తెచ్చాడు. ఫెడరల్ ఎన్నికల ప్రచారానికి కార్పొ రట్ కంపెనీలు అందచేసే నిధులమీద గత వందేళ్ళుగా కొనసాగుతున్న పరిమితులు బదా బదలయ్యే పరిస్థితి వచ్చేసింది. ఇక డొంక తిరుగుడు వ్యవహారాలతో పనిలేదు. కార్పొరేట్ మేనేజర్లు ఇక నుండి నేరుగా, ప్రత్యక్షంగా ఎన్నికల కొనుగోళ్ళకు దిగిపోవచ్చు. కార్పొరేట్ కంపెనీలు అందించే నిధులు బహు సంక్లిష్టంగా ఏ మాత్రం పారదర్శ కత లేకుండా పనిచేస్తాయి. ఎన్నికల త్రాసులో మొగ్గును ప్రభావితం చేసేదీ ఈ కార్పొరేట్ కంపెనీల నిధుల వరదే. అందుకే ప్రభుత్వ విధానాలను కూడా శాసించగలుగుతారు. ఆర్థిక వ్యవస్థను తమ గుప్పిటలో ఉంచుకున్న అతికొద్ది మంది కార్పొరేట్ శక్తుల చేతుల్లో ప్రజాస్వా మ్యాన్ని పెట్టేశారు.
థామస్ ఫెర్గూసన్, పేరొందిన రాజకీయ ఆర్థిక విశ్లేషకుడు. 'రాజకీయ పెట్టుబడి సిద్థాం తాన్ని' ప్రతిపాదించాడు. ఈ సిద్థాంతం ఆధారంగా చాలాకాలంగా కార్పొరేట్ పెట్టుబడు లు రాజకీయ విధివిధాన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయో ముందస్తు అంచనాలు చెబుతూ వచ్చాడు. వాటిల్లో ఏవీ పొల్లుపోలేదు. ప్రైవేట్ కార్పొరేట్ రంగం, రాజ్యంమీద నియం త్రణ సాధించడానికి ఎన్నికల సందర్భంగా ఎందుకు పెట్టుబడులు పెడుతుందో కడు చక్కగా వివరించాడాయన తన సిద్థాంతంలో. జనవరి 21 సుప్రీం న్యాయస్థానం వెలువ రించిన ఈ తీర్పు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే శక్తులను మరింత బలోపేతం చేస్తుంది. ఈ తీర్పు వెనుక నేపథ్యం గొప్ప జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. జస్టిస్ జాన్‌పాల్ స్టీవెన్స్ వాదన చూడండి- ''కార్పొరేట్ కంపెనీలకు రాజ్యాంగ తొలి సవరణ వర్తిస్తుందని మనం ఏనాడో నిర్ధారించాం. ఈ తొలి సవరణ వాక్‌స్వాతంత్య్రా నికి రాజ్యాంగ హామీని కల్పిస్తుంది. వాక్‌స్వాతం త్య్రం అంటే రాజకీయ అభ్యర్థులను బలపరచడం కూడా'' అన్నారు.
20వ శతాబ్దం తొలినాళ్లలో న్యాయ సిద్థాం తవేత్తలూ, కోర్టులూ కలిసి - రక్త మాంసాలు ఉన్న మనిషికి ఉన్నట్లే ఈ సమిష్టి చట్టబద్ధమైన సంస్థలకు (కార్పొరేట్ కంపెనీలకు) కూడా సమాన రాజ్యాంగ హక్కులు ఉంటాయన్న 1886 నాటి నిర్ణయాన్ని అమలులోకి తెచ్చాయి. ఈ ఉదారవాద దాడి ప్రమాదాన్నీ, దాని పర్యవసానాలనూ ఆనాడే పసిగట్టి ఖండించిన వారూ ఉన్నారు. ''ఈ నిర్ణయం వ్యక్తి స్వేచ్ఛను హరించివేస్తుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రజారంజక ప్రభుత్వాల స్థిరత్వం దెబ్బతినిపో తుంది'' అని క్రిస్టఫర్ జి టైడ్‌మాన్ అభివర్ణించాడు.
''కార్పొరేట్ రంగంలో అధికారం క్రమక్ర మంగా వాటాదారుల (షేర్ హౌల్డర్స్) చేతుల్లో నుండి మేనేజర్లకు అక్కడినుండి చివరకు 'బోర్డు డైరెక్టర్ల అధికారాలకు' దఖలు పడడం ద్వారా కార్పొరేట్ సంస్థలు 1886 నాటి వ్యక్తిగత స్థాయినుండి సర్వాధికారాలు కూడగట్టుకున్న వ్యవస్థలుగా స్థిరపడిపోయాయి'' అంటూ 'ప్రామాణిక న్యాయచరిత్ర' అన్న గ్రంథంలో మోర్టాన్ హౌర్‌విట్జ్ పేర్కొన్నాడు. ఆ తరువాత 'స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు' అనే తప్పుడు నామాలతో కార్పొరేట్ శక్తులు మరింత బలప డ్డాయి. ఎంతగా బలపడ్డాయి అంటే ఉదాహర ణకు జనరల్ మోటార్స్ కంపెనీ మెక్సికోలో ఒక ప్లాంట్ పెట్టి, దానికి మెక్సికో పరిశ్రమలకు ఆ దేశం ఇచ్చే హౌదాలూ, హక్కులూ, రాయితీ లూ ఇవ్వాలనీ, తమ ప్లాంట్‌ను కూడా జాతీయ పరిశ్రమగా గుర్తించాలనీ డిమాండ్ చేసేంతగా బలపడ్డాయి. కానీ విచిత్రం ఏమిటంటే రక్త మాంసాలున్న ఒక మెక్సికో దేశపు పౌరుడు, న్యూయార్క్ మహానగరంలో స్థిరపడిన తనకూ జాతీయ పౌరసత్వంగల అమెరికన్‌లతో సమాన హౌదా, గౌరవం, హక్కులూ ఇవ్వమని కాదు కదా కనీస మానవ హక్కుల గురించి కూడా డిమాండ్ చేసే పరిస్థితి లేదు. వందేళ్ళ క్రితమే ఉడ్రో విల్సన్ అమెరికాలో నెలకొన్న పరిస్థితుల గురించి ఇలా అభివర్ణిం చాడు: ''సాపేక్షంగా కొద్దిపాటి గుంపుగా ఉన్న వ్యక్తులూ, కార్పొరేట్ మేనేజర్లూ దేశ సంపద మీద, వ్యాపార కార్యకలాపాల మీద ఆధిపత్యం, నియంత్రణ సంపాదించారు. తద్వారా ప్రభు త్వానికి ప్రత్యర్థులుగా మారారు'' అన్నాడు. నిజానికి ఈ కొద్దిపాటి గుంపే రాను రానూ ప్రభుత్వానికి యజమానులుగా తయార య్యారు. రాబర్ట్స్ కోర్టు తీర్పు వారి యాజమా న్యాన్ని మరింత చట్టబద్ధం చేసింది. జనవరి 21 కోర్టు తీర్పు కూడా సంపద - అధికారం సాధించిన ఒక విజయానికి మూడు రోజుల తరువాత వెలువడడం యాదృచ్ఛిక మేనేమో. మాస్సాచ్యుట్స్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికలలో డెమోక్రాట్ల సింహాసనంగా కొనసాగుతూ వచ్చిన సెనెటర్ పీఠాన్ని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి స్కాట్ బ్రౌన్ గెలుచుకున్నాడు. బ్రౌన్ విజయాన్ని (ఒబామా నాయకత్వంలోని) డెమోక్రాట్ ప్రభుత్వంమీద పెరిగిపోతున్న ప్రజా అసంతృప్తికి చిహ్నంగా చిత్రీకరిస్తారు. కానీ ఓటింగ్ సరళి మనకు భిన్నమైన కథనాన్ని బయట పెడుతుంది.
సంపన్నులు నివసించే పట్టణ ప్రాంతాల్లో అత్యధిక ఓటింగ్, డెమొక్రాట్ల ఆధిపత్యం ఉన్న పట్టణ ప్రాంతాల్లో తగ్గిన పోలింగ్ బ్రౌన్ విజ యానికి దోహదం చేసింది. వాల్‌స్ట్రీట్ జర్నల్/యన్.బి.సి. పోల్ సర్వేలో రిపబ్లికన్ అనుకూల ఓటర్లలో 55 శాతం మంది ఓటింగ్ వెయ్య డానికి ఆసక్తి చూపిస్తున్నట్లు, డెమొక్రటిక్ ఓటర్లలో 38 శాతం మందే ఆసక్తి కనబరిచినట్లు వెల్ల డయ్యింది. అందుకే ఫలితాలు ప్రెసిడెంట్ ఒబామా విధానాలకు వ్యతిరేకంగా వచ్చాయి. సంపన్నులు మరింత సంపన్నులు కావడానికి ఒబామా విధానాలు తగిన ప్రోత్సాహం కల్పించనందున ధన్యాడ్య వర్గాల్లో అసంతృప్తి, పేద ప్రజానీకంలో తాము ఆశించిన ప్రయోజనాలు అందుకోవ డానికి ఇంకా చాలాకాలం వేచి ఉండాల్సి వచ్చేట్లుందే అన్న అసంతృప్తి. ప్రజాస్వామ్యంలో నెలకొన్న ఆగ్రహావేశా లను మనం అర్థం చేసుకోవచ్చు. ఒకపక్కన ప్రజాధనాన్ని బ్యాంకులు దిగమింగేస్తూ మరోపక్కన ప్రభుత్వం నుండి 'బెయిల్ అవుట్' ప్యాకేజీలు పొందుతూ ఉన్నాయి. ఇంకోపక్కన నిరుద్యోగం 10 శాతానికి మించిపోయింది. ఉత్పత్తిరంగంలో ప్రతి ఆరుగురిలో ఒకరు పని కోల్పోతున్నారు. ఈ రంగంలో నిరుద్యోగిత 1930 మహా మాంద్యం నాటిస్థాయిలో ఉంది. ఆర్థికవ్యవస్థ నానాటికీ ద్రవ్యీకరణ (ఫైనాన్షియలైజేషన్) చెందడం, ఉత్పాదకరంగం బోలుగా తయారవడం, కోల్పోయిన ఉద్యోగాలు తిరిగి పొందే అవకాశాలు సన్నగిల్లడం... ఇవన్నీ సామాన్య ప్రజానీకంలో అసంతృప్తికి దారితీశాయి.
బ్రౌన్ తన విజయాన్ని ఒబామా ప్రభు త్వం ప్రతిపాదించిన ఆరోగ్య సంరక్షణ విధానా లపట్ల 41 శాతం వ్యతిరేకతగా చెప్పు కొంటున్నాడు. అమెరికన్ సెనెట్‌లో మెజారిటీ ఈ బిల్లును సమర్థించారన్న వాస్తవం కన్నా, తన ఎన్నికే ఈ బిల్లు పట్ల ప్రజా వ్యతిరేకతకు అద్దం పడుతుందనే వాదనకు దిగాడు. మస్సాచ్యుసెట్స్ ఎన్నికలలో ఒబామా ఆరోగ్య సంరక్షణ విధానం కూడా ఒక అంశం గా ముందుకు వచ్చింది. ప్రజలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారనే వార్తాపత్రికల పతాక శీర్షికల్లో కూడా నిజంలేదు. కారణం ఏమిటి అనేది పోలింగ్ వివరాలు వెల్లడిస్తాయి. బిల్లు ఆను పానులు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం పొందలేదు. వాల్‌స్ట్రీట్ జర్నల్/ఎన్.బి.సి. సంయుక్త సర్వేలో మెజారిటీ ఓటర్లు ఆరోగ్య సంరక్షణ విధానాన్ని ఒబామా, రిపబ్లిన్‌లు 'హ్యాండిల్' చేస్తున్న తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ లెక్కలు దేశవ్యాప్తంగా జరిగిన పోల్ సర్వేల వివరాలతో సరిపోతున్నాయి. ఔషధాల (మందులు) అమ్మకాల్లో ప్రభుత్వ రంగానికి భాగస్వామ్యం ఉండాలని 50 శాతం మంది, 55 ఏళ్ళ వయసులో 'మెడికేర్' ఆరోగ్య ఇన్స్యూరెన్స్ పాలసీ' ఉండాలనుకునేవారు 64 శాతం మంది ఉన్నారు. కానీ ఈ రెండు పథకా లను మూలనపెట్టారు.
ఇతర దేశాల్లో మాదిరిగానే మందుల ధరలను ప్రభుత్వం నియంత్రించాలని 85 శాతం మంది కోరుతున్నారు. కానీ ప్రెసిడెంట్ ఒబామా తన సర్కారు అటువంటి ప్రయత్నం చెయ్యదని బహుళజాతి మందుల కంపెనీలకు హామీ ఇచ్చాడు. సామాన్య ప్రజానీకం ఎక్కువ మంది మందుల ధరలు తగ్గాలని ఆశిస్తున్నారు. ఇతర పారిశ్రామి దేశాలతో పోలిస్తే అమెరికా లో ఆరోగ్య సంరక్షణకు రెండింతలు ఖర్చు చెయ్యాల్సి వస్తుంది. అయినా ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. ఆరోగ్య సంరక్షణ కోసం చేసే తలసరి ఖర్చుల భారం తగ్గాలంటే నేడు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మందుల కంపెనీలకు రాయితీల వర్షం కురిపించినంత మాత్రాన ప్రయోజనం లేదు. ఇన్స్యూరెన్స్ పథకాలు సర్వం ఎటువంటి నియంత్రణాలేని ప్రైవేటు కంపెనీల చేతుల్లో బిల్‌మక్తాగా చిక్కుపడి ఉన్నాయి. అందుకే అమెరికాలో వైద్యం ఇంత ఖరీదయి పోయింది. ప్రజారోగ్య రంగాన్ని ఆవరించిన సంక్షో భాన్ని అధిగమించడానికి జరుగుతున్న ప్రయత్నా లకు జనవరి 21 తీర్పు వల్ల ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఇంధన- పర్యావరణ సమస్యల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ప్రజాభిప్రాయానికి- ప్రభుత్వ విధానాలకు మధ్య అంతరం నానాటికీ పెరుగుతోంది. ఈ లెక్కన అమెరికన్ ప్రజాస్వా మ్యానికి వాటిల్లనున్న నష్టం లెక్కించడం కూడా కష్టమే.
Article took from Markist Paper written By :NomoChimiski

Tuesday, 2 February 2010
వైద్య వ్యవస్థ - ఫ్రాన్స్ నమూనా
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మొదటిసారిగా 1950లలో మన వైద్య వ్యవస్థకు రూపురేఖలు దిద్దారు. సర్ జోసెఫ్ బోర్ కమిటీ సూచనలూ దీంట్లో ప్రధాన భూమిక వహించాయి. నిజానికి ఆనాటికి అదొక ముందడుగే. దానికి కేంద్ర బిందువు - ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణ: జనాభా ప్రాతిపదికన తగిన సంఖ్యలో ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, జిల్లా స్థాయిలో రెండవ అంచె రిఫరల్ ఆస్పత్రులు, రాష్ట్రస్థాయిలో మూడవ అంచె స్పెషాలిటీ ఆస్పత్రులు, వైద్య విద్యకు బోధనా సదుపాయాల ఏర్పాటు. ఆ తర్వాత వేసిన కమిటీలు కొన్ని చేర్పులు, మార్పులతో మెరుగులు దిద్దినా ఆ పునాది మీదనే అవన్నీ ప్రభుత్వ రంగంలోనే అదంతా.
ఈలోగా దేశంలో ప్రైవేటు వైద్య రంగం పుంజుకుంది. డాక్టర్ల సంఖ్యలో, రోగులకు సేవలు అందించే మోతాదులో, దాదాపు మూడింట రెండొంతులు ప్రైవేట్ రంగం ఆక్రమించింది. ఇటీవల ప్రైవేట్ రంగంలోనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు పెద్ద సంఖ్యలో వచ్చాయి. ఆధునిక సౌకర్యాలలో విదేశాలతో పోటీపడే స్థాయిలో ఉంటున్నాయి. ప్రభుత్వ రంగంలో కన్నా ప్రైవేట్ రంగంలోనే వైద్య కళాశాలలు ఎక్కువగా పెరుగుతూ వచ్చాయి. 1991లో వచ్చిన నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణల కారణంగా విద్యా, వైద్య రంగాలకు ప్రభుత్వ కేటాయింపులు గణనీయంగా తగ్గుతూ వచ్చాయి. ఫలితంగా ప్రభుత్వ రంగ వైద్య సేవలు రాశిలోను, వాసిలోను పడిపోతూ వచ్చాయి. మరోవైపు ఆదాయాలలో అంతరాలు పెరుగుతూ వచ్చాయి. సాధారణ ప్రజలకు మెరుగైన వైద్యం మాట అటుంచి, కనీస వైద్యం అందడం దుర్లభమవుతోంది. పోషకాహారలోపం, శానిటేషన్, వ్యాధి నిరోధక చర్యలు (preventive Measures/Public Health) అధ్వానస్థితికి చేరుకున్నాయి. ప్రజారోగ్యం సాధారణ ప్రజలకు అందని చందమామగా మారిపోయింది. మానవాభివృద్ధి సూచికలు దారుణంగా పడిపోతున్నాయి. సాధారణ ప్రజల్లో ముఖ్యంగా, పట్టణ, గ్రామీణ పేదలు, గిరిజన ప్రాంతవాసుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వాలు అరకొర చర్యలతో సరిపెడుతున్నాయి. ఆరోగ్యశ్రీ వంటి ప్రైవేటు ఇన్సూరెన్సు పథకాలు, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్పులు, కార్పొరేట్ రంగానికి రాయితీలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. అమర్త్యసేన్‌లాంటి సామాజిక ఆర్థికవేత్తలు పలువురు ఆందోళన వెలిబుచ్చారు. దేశీయ వైద్య ఆరోగ్య వ్యవస్థకు మౌలిక ప్రత్యామ్నాయం కోసం ఆలోచన ప్రారంభమైంది. ఈ దిశగా 2008 సెప్టెంబరు 8న ఢిల్లీలో ఒక వేదిక ఏర్పాటయింది. దానిలో world Care Council India, Business Alliance, The Hindu, Public Health Foundation of India తదితర స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు. దీనికి సారథిగా పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధినేత డా|| శ్రీనాథరెడ్డి ఉన్నారు. ఈయన ఎఐఐఎంఎస్‌లో హృద్రోగ నిపుణులుగా దీర్ఘకాలం పనిచేసి పదవీ వివరమణ చేసి ఉన్నారు. పద్మభూషణ్ అవార్డు పొందడమే కాక మన ప్రధాన మంత్రికి పర్సనల్ ఫిజిషియన్‌గా కూడా ఉన్నారు. వీరంతా ఒక సంవత్సరం పాటు దేశంలోని వివిధ సంస్థల నిపుణుల, ప్రజారోగ్య కార్యకర్తల సలహాలు తీసుకునేందుకు ఒక ప్రశ్నాపత్రాన్ని పంపి వారి అభిప్రాయాలను సేకరించనున్నారు. వారి సలహాలను 2010 అక్టోబర్ 10న ప్రభుత్వం నియమించిన పార్లమెంటరీ కమిటీకి సమర్పిస్తారు.
ఈ సమస్యపై దేశవ్యాప్త విస్తృతచర్చ జరగవలసి ఉంది. వివిధ దేశాల్లో ఉన్న ప్రజారోగ్య వ్యవస్థలను అధ్యయనం చేయడం వల్ల మన దేశ ప్రత్యేక పరిస్థితులకు ఏదైనా మంచి నమూనా దొరుకుతుందేమో చూడవలసి ఉంది. మాజీ సోషలిస్టు దేశాల్లో వైద్యం నూటికి నూరుపాళ్లు ప్రభుత్వ రంగంలోనే ఉండేది. ఇప్పుడు క్యూబాలో కూడా ఆ నమూనా కొనసాగుతున్నది. దీనిలో ఉన్న సుగుణం దేశంలో ప్రతి పౌరునికి ఒక చట్టబద్ధమైన హక్కుగా వైద్యసేవలు అందుతాయి. ఆ సేవలు పంచనక్షత్ర స్థాయిలో ఉండకపోవచ్చు. కాని పూర్తి అవసరాల మేరకు రోగికి పైసా ఖర్చు లేకుండా వైద్య సదుపాయం లభిస్తుంది. 1948 ఇంగ్లాండులో వైద్యరంగం పూర్తిగా జాతీయం చేయబడింది. దాన్ని ఎన్‌హెచ్‌ఎస్ అని పిలుస్తారు. ఇంచుమించు అదే నమూనా ఇటీవల కెనడా అవలంబించింది. ఈ దేశాల ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి. చిన్న చిన్న ఇబ్బందులు, లోపాలు లేకపోలేదు. అవి బ్యురాక్రసీ ప్రవేశం, వైద్యుల, నిధుల కొరత వల్ల ఏర్పడినవే ఈ స్వల్పమైన ఇబ్బందులు. కుటుంబాలు నిర్దిష్టమైన జి.పి (జనరల్ ప్రాక్టీషనర్) దగ్గరకే వెళ్లవలసి రావడం, అతని/ ఆమె ద్వారా మాత్రమే స్పెషలిస్టు వద్దకు గాని, హాస్పిటల్‌కు గాని రెఫరల్ పొందవలసిరావడం, అంతగా తొందరలేని కొన్ని సాధారణ ఆపరేషన్లకు ఎక్కువకాలం ఆగవలసిరావడం, ప్రతిసారి అపాయింట్‌మెంట్ తీసుకోవలసి ఉండటం ఇలాంటివి కొన్ని చెబుతుంటారు. అయినా ఇటీవల ఆ వ్యవస్థను మార్పు చేయాలని కొందరు సూచించినప్పుడు ఆ దేశ ప్రధాని గార్డన్‌బ్రౌన్‌తో సహా ప్రతిపక్ష నాయకుడు కూడా చాలా గట్టిగా వ్యతిరేకించడం గమనార్హం. తమ దేశం గర్వించదగ్గ ఒక వైద్య వ్యవస్థగా వారు దాన్ని పేర్కొన్నారు. మార్గరెట్ థాచర్ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వానికి ఖర్చు ఎక్కువ అవుతుందనే నెపంతో ఆమె కొన్ని మార్పులు చేయాలని చూస్తే దేశ ప్రజలంతా ముక్త కంఠంతో వ్యతిరేకించారు. ఇవి ఆదర్శవంతం కావచ్చు కాని మన దేశ ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. ఒకటి : ఆర్థిక భారం. రెండోది: ఇప్పటికే విస్తృతంగా ఉన్న వివిధ రకాల ప్రైవేట్ రంగం. మూడు : వైద్యులు, నర్సులు తదితర పారామెడికల్ సిబ్బంది (జనాభాతో పోల్చినపుడున్న) కొరత. అమెరికా నమూనా అత్యంత ఖరీదైంది. అసమానమైనది. ఇన్సూరెన్స్ కబంధ హస్తాల్లో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో కొన్ని యూరోపియన్ దేశాల్లో ఉన్న నమూనాలను అధ్యయనం చేయడం అవసరం కావచ్చు. వాటిలో ఫ్రాన్స్, జర్మనీ, స్విట్లర్లాండ్, నార్వే, స్వీడన్ ప్రధానమైనవి. వీటన్నింటిలోనూ ఫ్రాన్స్‌లో ఉన్న వైద్య వ్యవస్థ మెరుగైనదిగా పలువురి ప్రశంసలు అందుకుంటున్నది. ప్రఖ్యాత ఆర్థికశాస్త్రవేత్త 2008 నోబెల్ బహుమతి గ్రహీత పాల్‌కృగ్‌మన్ దీన్ని 'ఎక్స్‌లెంట్'గా ఒక వ్యాసంలో పేర్కొన్నాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2001లో ప్రపంచవ్యాప్తంగా చేసిన సర్వేలో దానిని 'ద బెస్ట్'గా వర్ణించింది. అయినా ఈ నమూనా మన దేశానికి మక్కీకి మక్కీగా పనికి వస్తుందని ఈ వ్యాసకర్త అనుకోవడం లేదు. కాని లోతుగా అధ్యయనం చేస్తే మన ప్రత్యేక పరిస్థితులకు ఏమైనా అన్వయం చేసుకోవచ్చునేమో. ఆర్థిక సామాజిక, వైద్య రంగ నిపుణులు పరిశీలించవచ్చు.
ఫ్రాన్స్ వైద్య విధానం
ఫ్రాన్స్ దేశపు ప్రజారోగ్య వ్యవస్థ (Health Care System) ను పరిశీలించేముందు ఆ దేశానికి సంబంధించిన కొన్ని గణాంకాలు తెలుసుకోవడం వల్ల కొంత ప్రాథమిక అవగాహన ఏర్పడుతుంది. అలాగే మన దేశ గణాంకాలతోనూ అత్యంత సంపన్నవంతంగా పేరున్న అమెరికా గణాంకాలతోనూ కూడా పోల్చి చూసుకోవచ్చు. ప్రాన్స్ ప్రజారోగ్య వైద్య వ్యవస్థలో ఉన్న ప్రధాన ఆకర్షణీయ అంశాలు : క్లుప్తంగా ఇలా చెప్పుకోవచ్చు. 1. మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తక్కువ తలసరి ఖర్చుతో ఎక్కువ ఫలితాలు సాధించవచ్చు. 2. మానవాభివృద్ధి సూచికలు ఇతర దేశాలకన్నా చివరికి అమెరికా కన్నా కూడా మెరుగ్గా ఉన్నాయి. 3. ప్రభుత్వరంగం, ప్రైవేటు రంగం రెంటిని సమర్థవంతంగా ఇముడ్చుకుని ఉపయోగించుకోవచ్చు. 4. ఇన్సూరెన్సు ఆధారితమైనా ఇన్సూరెన్సు కంపెనీలు దాదాపు పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీలోనే ఉన్నాయి. ప్రతి వ్యక్తికీ బీమా కల్పించే బాధ్యత వాటి మీద వుంది. 5. రోగికి తన డాక్టరును తన హాస్పిటల్‌ను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. 6.తక్షణవైద్యం లభిస్తుంది. 7.అన్నింటి పైనా ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. ఇక, వివరాలలోకి వెళితే...
ఫలితాలు
అక్కడి ఆరోగ్య సేవా వ్యవస్థను చాలా మంది మెచ్చుకోవడానికి ప్రధాన కారణం మెరుగైన జీవన ప్రమాణ సూచికలు (Health Care Indices). ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రజారోగ్యం మీద తన స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి)లో 11శాతం ఖర్చు పెడుతుంది. ఇది యూరోపియన్ దేశాల్లో కంటే కాస్త ఎక్కువే కాని, అమెరికాతో పోల్చితే చాలా తక్కువ. అమెరికా ఖర్చు జి.డి.పిలో 16 శాతం కాని ఫలితాల్లో ఉన్న తేడా గమనించతగ్గది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ రేటింగ్‌లో ఫ్రాన్స్ మొదటిస్థానంలో ఉంటే అమెరికా 37వ స్థానంలో ఉంది.
- ఫ్రాన్స్ శిశుమరణాల రేటున ప్రతి వెయ్యి జననాలకు 3.9, అమెరికాలో 7, భారత్‌లో 60.
- ఫ్రాన్స్‌లో సగటు జీవన ప్రమాణ (జి.డి.పి) 80 సంవత్సరాలు. అమెరికాలో 77 సంవత్సరాలు / భారత్‌లో 63 సంవత్సరాలు
-తలసరి ఆస్పత్రి పడకల సంఖ్య, డాక్టర్ల సంఖ్య అమెరికాలో కంటే ఫ్రాన్స్‌లో ఎక్కువ.
- ఫ్రాన్స్‌లో మధుమేహం, గుండెజబ్బులతో చనిపోయే వారి శాతం అమెరికాలో కంటే చాలా తక్కువ.
- నివారించదగ్గ శ్వాసకోశ వ్యాధుల వల్ల చనిపోయే వారి సంఖ్య ఫ్రాన్స్‌లో లక్ష జనాభాకు 31.2 అయితే అమెరికాలో 61.5 శాతం.
ఆశయాలు
దేశ ప్రజల్లో ప్రతి ఒక్కరికి వైద్య సదుపాయం అందుబాటులో ఉండాలి. అతి తక్కువ ఆదాయాలు గలవారికి, అసలు ఆదాయంలేని వారికి అండగా నిలుస్తుంది. వైద్య సదుపాయాల్లో తేడా ఏమీ ఉండదు. ఇంటి పెద్ద (Bread Winner) కుఉన్న ఇన్సూరెన్స్ తన మీద ఆధారపడే కుటుంబ సభ్యులందరికీ రక్షణ కల్పిస్తుంది. పౌరులకు తమ వైద్య ఖర్చు గురించిన అవగాహన బాధ్యత ఉండాలంటే కొద్ది శాతం (10 - 20శాతం) తాము కూడా భరించాలి. చీటికి మాటికి డాక్టర్ల దగ్గరకు వెళుతూ ఈ పథకాన్ని దుర్వినియోగపర్చకుండా ఈ ''కో-పేమెంట్'' ఉపయోగపడుతుందనే భావన
ఇన్సూరెన్స్
వైద్య ఖర్చులో అత్యధిక భాగానికి 80శాతం వరకూ జాతీయ బీమా వర్తిస్తుంది. తక్కిన కొద్ది భాగానికి ప్రైవేట్ ఇన్సూరెన్స్ ప్రీమియం పరిశ్రమాధిపతి లేదా ప్రభుత్వం కడతాయి. శ్రామికుడి వాటా తక్కువ.జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీలకు స్వయం నియంప్రతిపత్తి (Autonomy) ఉంటుంది.కాని పూర్తి ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది (మన ఎల్‌ఐసి, జిఐసి మాదిరిగా). సప్లిమెంటరీ ఇన్సూరెన్స్‌లో మాత్రం ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ సంస్థలు, కొద్ది సంఖ్యలో పూర్తి ప్రైవేటు కంపెనీలు ఉన్నాయి. జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీలు 4-5 ఉంటాయి. ఒకటి పరిశ్రమలలోనూ, ఇతర కమర్షియల్ కంపెనీలలోనూ పనిచేసే వేతన జీవులు, సేవలు చేసేవారికి. రెండోది : వ్యవసాయ రంగంలోని పనివారికి. మూడోది: నిరుద్యోగులు, విద్యార్థులకు. నాలుగోది: స్వతంత్ర వృత్తిదారులకు, వీటిని వేరు వేరు కంపెనీలు కవర్ చేస్తాయి.పరిశ్రమల్లో పనిచేసేవారికి, తదితర వేతన జీవులకు - ఉద్యోగ వేతనంలో 12 శాతం పరిశ్రమే ఇన్సూరెన్స్‌ను కడుతుంది. ఉద్యోగి తన వేతనంలో 0.75 మాత్రమే దానికి జత చేస్తాడు. పౌరుడు, డాక్టరు లేక డెంటిస్ట్ దగ్గరకు వెళితే లేక ఆస్పత్రిలో ఉండవలసి వస్తే ఆయా ఫీజుల్లో 70-80 జాతీయ ఇన్సూరెన్స్ భరిస్తుంది. కొన్ని ప్రత్యేక కేసుల్లో 100 శాతం ఖర్చు కూడా భరించవచ్చు. మిగతాది పేషెంట్ కట్టవచ్చు. దీనినే ''కో - పేమెంట్'' అంటారు. లేక దాని కోసం ముందుగానే ''సప్లిమెంటరీ ఇన్సూరెన్స్'' తీసుకునే సదుపాయం ఉంది. దీనికి చాలా కంపెనీల మధ్య పోటీతో అతి తక్కువ ప్రీమియంతో బీమా పొందవచ్చు. 87 శాతం ప్రజలు ఈ సప్లిమెంటరీ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు.
Tuesday, 19 January 2010
అసాధారణ ప్రజ్ఞాశాలి జ్యోతిబసు
లండన్ అర్థశాస్త్ర విభాగంలో(స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్) చదివిన భారతీయ ప్రముఖుల్లో జ్యోతిబాసు ఒకరుగా అసాధారణ ప్రజ్ఞాశాలిగా ఆ సంస్థ పరిగణించింది. పశ్చిమబెంగాల్ రాజకీయాలలో సిపిఎం నాయకత్వంలోని ఐక్యసంఘటన 1969లో రెండవసారి మరింత మెజారిటీతో అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించింది. జ్యోతిబసు రెండవసారి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఒక కమ్యూనిస్టుపార్టీ వరుసగా మరింత ప్రజాదరణతో ముందుకు రావటం ఎదురులేని కాంగ్రెస్‌ను సవాలు చేయటం ప్రపంచాన్ని ఆకర్షించింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని బ్రిటన్‌లోని ప్రముఖ పత్రిక గార్డియన్ ఒక వ్యాసాన్ని ప్రచురించింది.
1935 అక్టోబరు 27న జ్యోతిబసు 21 సంవత్సరాల వయస్సులో లండన్ విశ్వవిద్యాలయ కళాశాలలో చేరారు. ఉష్ణప్రాంతమైన కొల్‌కతా నుంచి వణికించే చలి ఉండే లండన్‌లో బసు అడుగుపెట్టే సమయానికి రెండవ ప్రపంచ యుద్ధ సన్నాహాలతో రాజకీయరంగం వేడెక్కుతోంది. న్యాయవాద విద్య చదవటానికి లండన్ వెళ్లినప్పటికీ అప్పుడున్న రాజకీయ పరిణామాలతో ఆయన ఆ ఒక్కదానికే పరిమితం కాలేదు. సెలవురోజుల్లో భారత్‌కు తిరిగి రాకుండా ఇతర అంశాలను కూడా అభ్యసించారు. విశ్వవిద్యాలయ కళాశాలలో చరిత్ర, సాధారణ అర్థశాస్త్ర విద్యార్థిగా నమోదైనప్పటికీ లండన్ అర్థశాస్త్ర విభాగంలో కూడా విద్యార్థిగా పేరు నమోదు చేయించుకున్నారు. అక్కడ రాజకీయ వ్యవస్థ నిర్మాణం,రాజ్యాంగ న్యాయశాస్త్రం, అంతర్జాతీయ న్యాయశాస్త్రం, మానవపరిణామశాస్త్రం తరగతులకు కూడా హాజరయ్యారు. ఇంతేకాదు రాజకీయ సిద్ధాంతం, సైకాలజీ తరగతులకు కొంతకాలం వెళ్లి మధ్యలో మానుకున్నారు. ఇలాంటి వారు అరుదుగా ఉన్నందున ఆ సంస్థ జ్యోతిబసును అసాధారణ ప్రజ్ఞాశాలిగా పరిగణించింది. తన ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకొనేందుకు ఆయన లండన్‌లో వర్తమాన ఆంగ్ల తరగతులకు కూడా హాజరయ్యారు. జ్యోతిబసు ఉపముఖ్యమంత్రిగా, అజరుముఖర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు వారిని ఇంటర్వ్యూచేసిన బ్రిటీష్ జర్నలిస్టులు ముఖ్యమంత్రి ఒక అంశంపై సమాధానం చెప్పటానికి పావుగంట సమయం తీసుకుంటే జ్యోతిబాసు కేవలం పది మాటల్లోనే విశదీకరిస్తారని ఫిర్యాదు చేశారు.
గార్డియన్ పత్రిక ప్రచురించిన జాఫ్రి మూర్‌హౌస్ వ్యాసం చూసిన తరువాత ఈయనెవరో ప్రముఖుడిలా ఉన్నారని ఆ వ్యాసాన్ని ఒక లైబ్రేరియన్ భద్రపరిచారు. అది అక్షరాలా వాస్తవమైంది. ఆ ఆర్టికల్‌తో పాటు బసు ఫొటోను ప్రచురించి దానికింద 'బాసు: నాయకుడు' అని పేర్కొన్నది.
జ్యోతిబసు లండన్‌లో చదివిన రోజులు ఒక ఎత్తైతే, కమ్యూనిస్టుగా మారటం, తన జీవనయానాన్ని నిర్ణయించుకున్నదీ అక్కడే. అందుకే ఆయనకు లండన్ అంటే అంత మక్కువ. బారిస్టరు చదివేందుకు లండన్ వచ్చి ఓడదిగిన తరువాత తూర్పు లండన్‌లోని తూర్పు బెంగాల్ నుంచి వచ్చి దుర్భరజీవితం గడుపుతున్నవారిని చూసి చలించిపోయారు. వారిలో అనేక మందికి ఆంగ్లం రాదు. జ్యోతిబసు వారికి ఆంగ్ల పాఠాలు కూడా చెప్పారు. చదువు ముగియగానే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా భారత్ వెళ్లి అక్కడ కమ్యూనిస్టుపార్టీ కార్యకర్తగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. బారిస్టర్ పరీక్షలు రాసిన తరువాత ఫలితాలు వచ్చేవరకు కూడా వేచి చూడలేదు. 1940 జనవరి ఒకటవ తేదీనే భారత్‌కు బయలుదేరి వచ్చారు.
తరువాత మరోసారి బ్రిటన్ వెళ్లాలనిగాని బారిస్టరు పట్టా పుచ్చుకోవాలని గాని అనుకోలేదు. అయితే జనవరి 26న ఆయన పరోక్షంలోనే ఫలితాలు ప్రకటించి పట్టాను పుచ్చుకొనేందుకు లండన్ రావాల్సిన అవసరం లేదని, ఆయన బారిస్టరుగా అర్హత సంపాదించినట్లు పరిగణిస్తున్నట్లు ప్రకటించారు. జ్యోతిబసుకు అనేక మంది బ్రిటీష్ వారు స్నేహితులయ్యారు. వారిలో తరువాత లేబర్ పార్టీ నాయకుడిగా ఎన్నికైన మైఖేల్ ఫుట్, క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన కార్మిక నాయకుడు టోనీ బెన్ వంటివారున్నారు. వారంతా భారత స్వాతంత్య్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చినవారే.
మా మంచి తాతయ్య
'లండన్‌లో బారిస్టరు చదివి భారత్‌లో న్యాయవాదిగా పనిచేయాలని ముందు అనుకున్నారు. అయితే లండన్ ఆయన్ను మార్క్సిస్టుగా మార్చివేసింది. అది కుటుంబానికి నచ్చలేదు. మా వరకు వస్తే ప్రపంచంలోనే 'గొప్ప తాతయ్య' అని ఆయన మనవరాలు మల్లిక పేర్కొన్నారు. నేను పాఠశాల రోజుల్లో ఒకసారి నేను పెద్ద అందంగా లేకపోయినా సుశ్మితాసేన్‌తో పాటు అందాల పోటీల్లో పాల్గొన్నాను. తాతయ్య ఎంతో సంతోషించారు. ఇంటికి వస్తూనే అందాలరాణి, అందాల రాణి ఎక్కడ అంటూ పిలిచారని మల్లిక చెప్పింది. సరదాగా పాల్గొన్న పోటీ ఉదంతాన్ని అవకాశంగా తీసుకొని ఆ రోజుల్లో కమ్యూనిస్టు వ్యతిరేక మీడియా చిలవలుపలవలుగా చిత్రించి జ్యోతిబసు మనవరాలేమిటి అందాల పోటీల్లో పాల్గొనటం ఏమిటని నానాయాగీ చేసింది. ఇప్పుడు ఆమె లండన్‌లో ప్రాంతీయ వంటకాల గురించి రాయటంతో పాటు అదే రంగంలో గౌరవ ప్రదమైన ఉద్యోగం చేస్తున్నది. లండన్‌లో ఎంతో మంది స్నేహితులున్న కారణంగానే జ్యోతిబాసు సెలవులు గడిపేందుకు ప్రతిఏటా రెండు మూడు వారాలు లండన్ వెళ్లేవారు. కోడి గుడ్డుపై ఈకలు వెతికేందుకు ప్రయత్నించే కమ్యూనిస్టు వ్యతిరేక మీడియా ఈ పర్యటనలపై కూడా బురద చల్లింది.
బంగ్లాదేశీయులకూ స్ఫూర్తి
విద్యాభ్యాసం, కమ్యూనిస్టుగా పునాదులు పడిన లండన్ ఒక అభిమాన పాత్రమైతే పూర్వీకుల స్థలమైన బంగ్లాదేశ్ కూడా జ్యోతిబసుకు ఎంతో ప్రీతిపాత్రమైనది. అందుకే ఆయన మరణాన్ని అక్కడి పత్రికలు, వివిధ తరగతులవారు ఎంతో విషాదంగా పరిగణించాయి. ఉభయదేశాల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సమస్యలున్నప్పటికీ వాటిపట్ల ఎల్లపుడూ జ్యోతిబసు సానుభూతితో వ్యవహరించారని బంగ్లాదేశ్ నేషనల్ అవామీలీగ్ పార్టీ అధ్యక్షుడు ముజఫర్ అహమ్మద్ కొనియాడారు. స్వాతంత్య్రం తరువాత కూడా జ్యోతిబసు తమకు స్ఫూర్తినిచ్చారని అన్నారు. బంగ్లాదేశ్ విశ్వసించే వ్యక్తి జ్యోతిబసు ఒక్కరే అని ప్రధాని హసీనా వాజెద్ గతంలో ఒకసారి వ్యాఖ్యానించిన విషయం తెలిసినదే.ఢాకా సమీపంలో తన పూర్వీకుల జన్మస్థలమైన బరోడీ గ్రామాన్ని దీర్ఘకాలం సందర్శించనప్పటికీ ఆయన ఆ గ్రామాన్ని మరిచిపోలేదని ముజఫర్ అన్నారు. తమ దేశవిముక్తి సమయంలో, ఇతర సంక్షోభసమయాల్లోనూ ఎన్నో విలువైన సలహాలు ఇచ్చారని తెలిపారు. ఆయన మరణం ఒక్క కమ్యూనిస్టు ఉద్యమానికే గాక యావత్ ప్రపంచ వామపక్ష ఉద్యమాలకు నష్టమని బంగ్లాదేశ్ వామపక్ష నాయకుడు హైదర్‌ఖాన్ రోనో పేర్కొన్నారు. ఇంతటి మహౌన్నత నాయకుడు కనుకనే బంగ్లా ప్రధాని షేక్ హసీనా వాజెద్ ఆయన అంత్యక్రియలకు స్వయంగా హాజరై తమ గౌరవాన్ని ప్రకటించనున్నారు.

Subscribe to:
Comments (Atom)